ఇరాకీ కర్డిస్తాన్‌లోని ఇర్బిల్ నగరంలో కాల్పులు... టర్కీ దౌత్యవేత్త మృతి

  • 17 జూలై 2019
ఇర్బిల్ నగరం Image copyright Reuters
చిత్రం శీర్షిక ఇర్బిల్ నగరంలో కాల్పుల ఘటన జరిగిన హుక్కాబాజ్ రెస్టారెంట్

ఇరాకీ కర్డిస్తాన్‌లోని ఇర్బిల్‌ నగరంలో ఒక రెస్టారెంటులో టర్కీ దౌత్యవేత్తను కాల్చి చంపారని అక్కడి భద్రతా దళాలు బీబీసీకి చెప్పాయి.

టర్కీ డిప్యూటీ కాన్సుల్, మరో ఇద్దరు దౌత్యవేత్తలు ఆ రెస్టారెంటులో ఆహారం తీసుకుంటున్నప్పుడు ఈ ఘటన జరిగింది. ఆ కాల్పుల్లో చనిపోయిన వారిలో టర్కీ దౌత్య అధికారిలో ఉన్నట్లు సమాచారం.

కాల్పులు జరిపిన ఇద్దరు సాయుధులు అక్కడి నుంచి వెంటనే పారిపోయారని. కర్డిష్ భద్రతా దళాలు ఆ ప్రాంతాన్ని అదుపులోకి తీసుకున్నారని సమాచారం అందింది.

అయితే, ఇప్పటివరకూ ఎవరూ కూడా ఈ దాడికి తామే బాధ్యులమని ప్రకటించలేదు.

ప్రాథమిక సమాచారం ప్రకారం టర్కీ కాన్సులేట్‌కు చెందిన ముగ్గురు అధికారులు ఈ కాల్పుల్లో చనిపోయారు.

టర్కీ గత కొంతకాలంగా ఇరాక్ నుంచి పని చేస్తున్న కర్డిష్ మిలిటెంట్లకు మీద దాడులు కొనసాగిస్తోంది.

(ఈ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అవుతోంది. కాసేపట్లో మరిన్ని వివరాలు అందిస్తాం. తాజా సమాచారం కోసం ఈ పేజీని రిఫ్రెష్ చేస్తూ ఉండండి. )

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)