ఆసియాలోనే అతిపెద్ద నది ప్రవహించే మొత్తం దూరం ట్రెక్కింగ్ చేసిన సాహసికుడు

  • 12 ఆగస్టు 2019
యాష్ డైక్స్ Image copyright Ash dykes

ఆసియాలోనే అతి పెద్ద నదైన చైనాలోని యాంగ్జీ పొడవునా నడుచుకుంటూ సాగిపోయాడో సాహసికుడు.

6,300 వేల కిలోమీటర్ల పొడవైన ఈ నది పర్వతాల్లోంచి ప్రవహిస్తుంది. ఏడాది పాటు నడిచిన ఆ సాహసికుడు నది ప్రారంభమయ్యే చోట మొదలుపెట్టి ప్రవహించే మొత్తం దూరం నడిచి రికార్డులకెక్కాడు.

వేల్స్‌కు చెందిన యాష్ డైక్స్ అనే ఈ సాహసికుడు టిబెట్ పీఠభూమిలోని యాంగ్జీ నది పుట్టిన చోట నడక మొదలుపెట్టి రాళ్లు, రప్పలు, అడవులు, పర్వతాలు, లోయలు దాటుకుంటూ షాంఘై సమీపంలో ఆ నది తూర్పు చైనా సముద్రంలో కలిసే ప్రదేశానికి సోమవారం చేరుకున్నాడు.

శనివారమే తన నడక పూర్తి చేయాల్సి ఉన్నప్పటికీ టైఫూన్ లెకిమా కారణంగా ఆలస్యమైందని డైక్స్ చెప్పారు.

తన సాహసం చరిత్ర పుస్తకాలకు ఎక్కుతుందని డైక్స్ 'బీబీసీ'తో అన్నారు.

Image copyright Ash dykes

యాంగ్జీ నది ప్రపంచంలోనే మూడో అతిపెద్ద నది. నైలు, అమెజాన్ తరువాత ఇదే అత్యంత పొడవైనది. 6,300 కిలోమీటర్ల దూరం ప్రవహించే ఇది ఆసియా ఖండంలో ఇదే అతి పొడవైన నది.

ఇది చైనాలో పుట్టి చైనాలోనే సముద్రంలో కలుస్తుంది.

ఈ నది పుట్టిన ప్రదేశం నుంచి సముద్రంలో కలిసే చోటు వరకు మొత్తం దూరం నడిచేవారు ఇంతవరకు ఎవరూ లేకపోవడంతో చైనా మీడయా డైక్స్‌ను ఆకాశానికెత్తేస్తోంది.

జీవ వైవిధ్యంపై అవగాహన పెంచడానికి

చైనాలో జీవ వైవిధ్యంపై చైతన్యం కలిగించడం.. యాంగ్జీ పరివాహక ప్రాంతంలో సాధారణ ప్రజానీకం చూడని కొత్త ప్రదేశాలను ప్రపంచానికి పరిచయం చేయడం లక్ష్యంగా తన యాత్ర ప్రారంభించానని.. చివరకు అది రికార్డుగా మారిందని డైక్స్ తెలిపారు.

తన ప్రయాణం అత్యంత క్లిష్టంగా సాగిందని చెప్పారు. ఈ సాహస యాత్ర ప్రారంభించినప్పుడు అక్కడ -20 డిగ్రీల ఉష్ణోగ్రత ఉందని చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)