కశ్మీర్ విషయంలో నెహ్రూ పాత్రేమిటి.. విలన్ ఆయనేనా

ఈ కథ విభజన కాలం నాటిది. దక్షిణ ఆసియాలో భారత్, పాకిస్తాన్ అనే రెండు కొత్త దేశాలు అవతరించాయి. కొన్ని దేశీయ సంస్థానాలు కూడా వాటిలో విలీనమవుతున్నాయి.
సౌరాష్ట్రకు సమీపంలోని జూనాగఢ్ అలాంటి పెద్ద సంస్థానాల్లో ఒకటి.
జూనాగఢ్ పాలకుడు ముస్లిం నవాబు మూడో మహబత్ ఖాన్. కానీ, అక్కడి జనాభాలో 80 శాతం హిందువులే.
అక్కడ అధికారం కోసం అంతర్గత కుమ్ములాటలు సాగుతున్నాయి. 1947 మే లో సింధ్ ముస్లిం లీగ్ నాయకుడు షానవాజ్ భుట్టో జూనాగఢ్ దీవాన్‌గా నియమితులయ్యారు. మహమ్మద్ అలీ జిన్నాకు భుట్టో దగ్గరగా సంబంధాలు నెరుపుతున్నారు.
1947 ఆగస్టు 15 వరకూ జూనాగఢ్ విలీనంపై భుట్టో ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదు. జిన్నా సలహా మేరకే ఆయన అలా చేశారు.
అయితే, స్వాతంత్ర్య ప్రకటన రాగానే, పాక్‌తో కలవాలని జూనాగఢ్ నిర్ణయం తీసుకుంది. కానీ, ఒక నెల వరకూ పాక్ ఈ అభ్యర్థనపై స్పందించలేదు.
సెప్టెంబర్ 13న పాకిస్తాన్ ఒక టెలిగ్రామ్ ద్వారా జునాగఢ్‌ను తమ దేశంలో విలీనం చేసుకుంటున్నట్లు ప్రకటించింది. కతియవార్ సంస్థానానికి, భారత ప్రభుత్వానికి ఇది ఒక పెద్ద షాక్.
వాస్తవానికి జిన్నా జునాగఢ్‌ను ఓ పావులా ఉపయోగిస్తున్నారు. ఆయన కన్ను కశ్మీర్‌పైనే ఉంది.
విలీనంపై జూనాగఢ్ నవాబుకు కాకుండా, అక్కడి ప్రజలకు నిర్ణయాధికారం ఉండాలని భారత్ అంటుందన్న విశ్వాసంతో జిన్నా ఉన్నారు. ఎందుకంటే, అలాంటి వాదన భారత్ చేయగానే, కశ్మీర్ విషయంలోనూ ఇదే వర్తించాలని జిన్నా డిమాండ్ చేశారు.
సర్దార్ పటేల్ జీవిత చరిత్రపై 'పటేల్: ఎ లైఫ్' అనే పేరుతో రాజ్ మోహన్ గాంధీ రాసిన పుస్తకంలో ఈ విషయాలను పేర్కొన్నారు.
పాక్ వేసిన ప్రణాళికను అడ్డుకోవాల్సిన బాధ్యత అప్పటి భారత ప్రధాని జవహర్లాల్ నెహ్రూ, హోం మంత్రి సర్దార్ పటేల్‌లపై పడింది.
- పాకిస్తాన్‌తో చర్చలంటూ జరిగితే 'పీవోకే'పైనే: రాజ్‌నాథ్ సింగ్
- ఉడుము దాడిలో తీవ్రంగా గాయపడ్డ వృద్ధ జంట
ఒప్పందానికి కట్టుబడని పాక్
1947 అక్టోబర్ 22న పాక్ నుంచి 200 నుంచి 300 దాకా ట్రక్కులు కశ్మీర్‌కు వచ్చాయి. పాక్ ఫ్రంటియర్ ప్రావిన్స్‌కు చెందిన అఫ్రీదీ, వజీర్, మెహసూద్ వంటి తెగలవారు వాటిలో ఉన్నారు. వాళ్ల సంఖ్య 5 వేల దాకా ఉంటుంది.
వాళ్లు తమను తాము స్వాతంత్ర్య పోరాటకారులమని ప్రకటించుకున్నారు. సెలవులపై ఉన్న పాకిస్తాన్ సైనికులు వీరికి నాయకత్వం వహిస్తున్నారు. కశ్మీర్‌ను ఆక్రమించి పాక్‌లో దాన్ని విలీనం చేయాలన్నది వారి ఉద్దేశం.
అప్పటివరకూ దాదాపుగా అన్ని సంస్థానాలూ భారత్, పాక్ల్లో వేటిలో విలీనం కావాలన్నదానిపై నిర్ణయం తీసేసుకున్నాయి. కశ్మీర్ మాత్రం ఇంకా ఎటూ తేల్చుకోలేదు.
1947 ఆగష్టు 12న జమ్మూ కశ్మీర్ మహారాజు హరి సింగ్.. భారత్, పాకిస్తాన్లతో యథాతథ స్థితిని కొనసాగించేందుకు ఓ ఒప్పందం చేసుకున్నారు.
దీని ప్రకారం జమ్మూకశ్మీర్ ఏ దేశంతోనూ కలవకుండా, స్వతంత్రంగా ఉంటుంది. కానీ, ఈ ఒప్పందానికి పాక్ కట్టబడి లేదు. కశ్మీర్‌పై దాడి ప్రకటించింది.
'ద స్టోరీ ఆఫ్ ది ఇంటిగ్రేషన్ ఆఫ్ ఇండియన్ స్టేట్స్' అనే పుస్తకంలో వీపీ మేనన్ కశ్మీర్ విషయంలో అప్పటి పాక్ చర్యల గురించి సవివరంగా రాశారు.
దాడి చేసేందుకు వచ్చిన తెగలు కశ్మీర్లో ఒక్కో పాంతాన్ని ఆక్రమించుకుంటూ వస్తున్నాయి. మరికొన్ని రోజులు ఆగితే, శ్రీనగర్ కూడా వారి చేతుల్లోకి వెళ్తుంది. వారిని ఎదుర్కొనేంత శక్తి కశ్మీర్ మహారాజుకు లేకపోయింది. దీంతో, స్వతంత్రత విషయం పక్కనపెట్టి ఆయన భారత్ సాయం కోరారు.
- విజయవాడ జలమయం.... కృష్ణా, గుంటూరు జిల్లాల్లో నీట మునిగిన పంటలు
- ఆయన రోజూ 30 కిలోమీటర్లు గాల్లో తేలుతూ ఆఫీసుకు వెళతారు...
మహారాజు ముందు ఒకే మార్గం
కశ్మీర్ విషయంపై దిల్లీలో రాజకీయ కార్యకలాపాల వేగం పెరిగింది. అక్టోబర్ 25 న లార్డ్ మౌంట్ బాటన్ నేతృత్వంలో రక్షణ కమిటీ సమావేశం జరిగింది. క్షేత్ర స్థాయి పరిస్థితిని తెలుసుకునేందుకు హోంశాఖ కార్యదర్శిగా ఉన్న వీపీ మేనన్‌ను కశ్మీర్‌కు పంపాలని అందులో నిర్ణయం తీసుకున్నారు.
శ్రీనగర్ చేరుకున్న వెంటనే మేనన్‌కు పరిస్థితి అర్థమైపోయింది. ఒకట్రెండు రోజుల్లో పాక్ నుంచి దాడికి వచ్చిన తెగలు నగరంలోకి చొరబడతాయని ఆయన గుర్తించారు.
కశ్మీర్‌ను కాపాడుకోవాలంటే మహారాజు ముందు ఒకే మార్గం మిగిలుంది. అది భారత్ సహకారం కోరడం.
అప్పటికి కశ్మీర్ స్వతంత్ర రాజ్యంగానే ఉంది. స్వతంత్ర రాజ్యంలోకి భారత సేనలను పంపడం పట్ల మౌంట్ బాటన్ సుముఖంగా లేరు.
వీపీ మేనన్‌ను మళ్లీ జమ్మూ వెళ్లారు. నేరుగా ఆయన మహారాజు ప్యాలెస్‌కు చేరుకున్నారు. ప్యాలెస్ అంతా ఖాళీగా కనిపించింది. వస్తువులు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. శ్రీనగర్ నుంచి వచ్చి, మహారాజు నిద్రపోతున్నారు.
ఆయన్ను మేనన్ నిద్ర లేపారు. రక్షణ కమిటీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాల గురించి వివరించారు. భారత్‌లో విలీనానికి అంగీకరిస్తూ 'ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ ఆక్సెషన్'పై హరిసింగ్ సంతకం చేశారు.
- అఫ్గానిస్తాన్: కాబూల్ పెళ్లి వేడుకలో మానవ బాంబు విధ్వంసం, 63 మంది మృతి
- వరదలో 12 ఏళ్ల బాలుడి సాహసం.. సోషల్ మీడియాలో వైరల్
షేక్ అబ్దుల్లా ఉద్యమం
కశ్మీర్ సమస్యాత్మకంగా మారుతున్నప్పుడు మహారాజు వైపు నుంచి ఆలస్యం జరిగిందని మేనన్ తన పుస్తకంలో రాశారు. అందుకే ఒప్పందం చేసుకోవడంలో జాప్యమైందని అభిప్రాయపడ్డారు.
కశ్మీర్ రాజ్యంలో ఉత్తరాన గిల్గిత్, దక్షిణంలో జమ్మూ పశ్చిమాన లద్దాఖ్, మధ్యలో కశ్మీర్ లోయ ఉన్నాయి.
జమ్మూలో హిందువులు ఎక్కువగా ఉన్నారు. లద్దాఖ్‌లో బౌద్ధులు.. గిల్గిత్, కశ్మీర్ లోయలో ముస్లింల జనాభా ఎక్కువ. మొత్తంగా రాజ్యంలో మెజార్టీ వర్గం ముస్లింలే.
మహారాజు హిందువు కాబట్టి, అన్ని ఉన్నత పదవుల్లో హిందువులే ఉండేవారు. తమను అణగదొక్కుతున్నారన్న భావన ముస్లింల్లో ఉండేది
ఇలాంటి సమయంలో షేక్ అబ్దుల్లా అక్కడి ముస్లింల తరఫున పోరాటం ప్రారంభించారు. 1932లోనే ఆయన ముస్లిం కాన్ఫరెన్స్ పార్టీని స్థాపించారు. 1939లో ఆ పార్టీ పేరు నుంచి ముస్లిం అన్న పదాన్ని తొలగించి నేషనల్ కాన్ఫరెన్స్‌గా మార్చారు.
మహారాజుకు వ్యతిరేకంగా షేక్ అబ్దుల్లా ఆందోళనలు నిర్వహించారు. 1946లో 'క్విట్ కశ్మీర్' నినాదంతో ఉద్యమం నడిపించారు. దీంతో, ఆయన చాలా కాలం జైల్లో గడిపాల్సి వచ్చింది.
కశ్మీర్ విలీనం తర్వాత 1949లో హరి సింగ్ కుమారుడు కరణ్ సింగ్ జమ్మూకశ్మీర్ 'సదర్ ఎ రియాసత్' (అధ్యక్షుడు) పదవి చేపట్టారు. భారత రాజ్యాంగాన్ని రూపొందించిన భారత రాజ్యాంగ పరిషత్‌లో షేక్ అబ్దుల్లా సభ్యుడిగా చేరారు.
- పాక్ అధీనంలోని కశ్మీర్లో 'స్వాతంత్ర్యం' ఎంత?
- ఆర్కిటిక్ కాలుష్యం: స్వచ్ఛమైన మంచు ఖండంలో ప్లాస్టిక్ విష పదార్థాలా...
అంబేడ్కర్ వైఖరి ఏంటంటే,.
కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించాలని షేక్ అబ్దుల్లా చేసిన అభ్యర్థనను రాజ్యాంగ పరిషత్ ఛైర్మన్ అంబేడ్కర్ నిరాకరించారని డాక్టర్ పీజీ జ్యోతికర్ ఓ పుస్తకంలో రాశారు.
''భారత్ మిమ్మల్ని రక్షించాలి. మీకు రోడ్లు వేయాలి. మీ జనాలకు రేషన్ ఇవ్వాలి. అయినా, భారత్‌కు అధికారాలేవీ ఉండకూడదని మీరు కోరుకుంటున్నారా? దీనికి నేనెప్పుడూ అంగీకరించను'' అని అంబేడ్కర్ సమాధానం ఇచ్చినట్లు పేర్కొన్నారు.
దీని తర్వాత షేక్ అబ్దుల్లా నెహ్రూను ఆశ్రయించారు. నెహ్రూ అప్పుడు విదేశీ పర్యటనకు వెళ్తున్నారు.
గోపాలస్వామి అయ్యంగార్ అప్పుడు ఏ పోర్ట్‌ఫోలియో లేకుండా మంత్రిగా ఉన్నారు. అంతకుముందు కశ్మీర్ సంస్థానంలో దీవాన్‌గా, అక్కడి రాజ్యాంగ సభలో సభ్యుడిగానూ పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. దీంతో ఆర్టికల్ 370ని రూపొందించమని అయ్యంగార్‌కు నెహ్రూ చెప్పారు.
జన్‌సంఘ్ అధ్యక్షుడు బలరాజ్ మధోక్ ఆత్మకథలో 'విభజిత కశ్మీర్, జాతీయవాదీ అంబేడ్కర్' అనే ఓ అధ్యాయం ఉంది. ''నా దృష్టిలో అంబేడ్కర్ జాతీయవాద నేతల్లోకెల్లా జాతీయవాదిగా, మేధావుల్లోకెల్లా మేధావి'' అని అందులో మధోక్ రాశారు.
- లక్ష కోట్ల పెట్టుబడుల ఉపసంహరణ సాధ్యమేనా?
- సహాయ శిబిరాల్లో ఆడుకునే పిల్లలను చూస్తే ఆనందం, బాధ ఒకేసారి కలుగుతున్నాయి
సేనలను వెనక్కి పిలిపించేందుకు నెహ్రూ నిరాకరణ
మహారాజు సంతకం చేసిన 'ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ ఆక్సెషన్'ను తీసుకుని మేనన్ నేరుగా దిల్లీ ఎయిర్పోర్ట్ చేరుకున్నారు. అక్కడ సర్దార్ పటేల్ ఆయన్ను కలిశారు. వారిద్దరూ కలిసి అలాగే భద్రత కమిటీ సమావేశానికి వెళ్లారు.
అక్కడ సుదీర్ఘ చర్చ జరిగింది. చివరికి జమ్మూకశ్మీర్ పెట్టిన షరతులను అంగీకరించి, సేనలను అక్కడికి పంపించారు. పరిస్థితులు సద్దుమణిగాక అక్కడ ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించాలని కూడా నిర్ణయం తీసుకున్నారు.
నవంబర్ 21న పార్లమెంటులో ప్రసంగిస్తూ నెహ్రూ ఇదే విషయం చెప్పారు. ఐరాస లేదా మరో సంస్థ ఆధ్వర్యంలో జరిగే ప్రజాభిప్రాయ సేకరణలో పాల్గొని కశ్మీర్ ప్రజలకు వారి భవితవ్యాన్ని నిర్ణయించుకునే అవకాశం కల్పిస్తామని వ్యాఖ్యానించారు..
అప్పుడు పాక్ ప్రధాని లియాకత్ ఖాన్ కశ్మీర్లో ప్రజాభిప్రాయ సేకరణకు ముందే భారత్ సేనలను వెనక్కిపిలిపించుకోవాలని కోరారు. కానీ, నెహ్రూ ఇందుకు అంగీకరించలేదు.
ఒప్పందం ప్రకారం కశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తితో భారత్‌లో భాగమైంది. రక్షణ, విదేశీ, కమ్యునికేషన్స్ వ్యవహారాలు మినహాయించి మిగతా అన్ని అంశాలు రాష్ట్ర అధికార పరిధిలోనే ఉంటాయి.
1954లో 35ఏ అనే మరో ఆర్టికల్‌ను తీసుకువచ్చారు. దీని ప్రకారం జమ్మూకశ్మీర్ వ్యవహారాల్లో జోక్యం, అక్కడ చట్టాల అమలు అంశాల్లో భారత్‌కు పరిమితమైన అధికారులు ఉన్నాయి.
- హైదరాబాద్‌లో అమ్మపాల బ్యాంకు: తల్లుల నుంచి పాల సేకరణ.. ఉచితంగా చిన్నారులకు
- మోదీ పంద్రాగస్టు ప్రసంగంలో చెప్పిన త్రివిధ దళాల ముఖ్య అధికారి ఎలా ఉంటారు?
పటేల్ అంగీకరించారు
1949 అక్టోబర్‌లో రాజ్యాంగ పరిషత్ సమావేశం జరిగింది. కశ్మీర్ ప్రతే్యక ప్రతిపత్తి ప్రతిపాదన పట్ల సబ్యులు వ్యతిరేకతతో ఉన్నారు. నెహ్రూ అప్పుడు విదేశాల్లో ఉన్నారు. సర్దార్ పటేల్ కార్యనిర్వాహక ప్రధానిగా ఉన్నారు. కానీ, కశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తి అభ్యర్థనకు పటేల్ సమ్మతి తెలియజేశారు.
విదేశాలకు వెళ్లే మందు కశ్మీర్‌కు మరిన్ని అధికారాలు ఉండాలని నెహ్రూ.. పటేల్‌కు సూచించారు. అందుకే వాటిని కూడా సమర్థిస్తూ పటేల్ మాట్లాడారు.
నెహ్రూ ఆలోచనలను అబ్దుల్లా, గోపాలస్వామి, ఆజాద్ సమర్థిస్తున్నారు. అందుకే నెహ్రూ లేకున్నా, ఆయనకు వ్యతిరేకంగా వెళ్లకూడదని పటేల్ నిర్ణయించుకున్నారు.
కశ్మీర్ విషయంలో నెహ్రూ ఒక్కరే నిర్ణయం తీసుకున్నారనడం తప్పే అవుతుందని అశోకా విశ్వవిద్యాయలంలో చరిత్ర బోధించే ప్రొఫెసర్ శ్రీనాథ్ రాఘవన్ అభిప్రాయపడ్డారు.
''కశ్మీర్ విషయంలో భిన్నాభిప్రాయులున్నా నెహ్రూ, పటేల్ కలిసే పనిచేశారు. పటేల్ అంగీకారం లేకుండా నెహ్రూ ముందడుగు వేశారని అనలేం'' అని ఆయన అన్నారు.
మే 15, 16 తేదీల్లో కశ్మీర్ అంశంపై పటేల్ నివాసంలో ఓ సమాశేం జరిగింది. నెహ్రూ కూడా దీనికి హాజరయ్యారు.
నెహ్రూ, షేక్ అబ్దుల్లా మధ్య కుదిరిన అంగీకారం గురించి అయ్యంగార్ పటేల్‌కు ఓ ప్రస్తావన పంపారు. దానిపై 'ఈ విషయంలో మీ అభిప్రాయం గురించి నెహ్రూకు చెప్తారా? మీ అంగీకారం తర్వాతే ఆయన షేక్ అబ్దుల్లాకు లేఖ రాస్తారు'' అని ఓ కామెంట్ కూడా రాశారు.
మౌలిక అధికారాలు, నిర్దేశిక సూత్రాల విషయాన్ని రాష్ట్ర రాజ్యాంగ సభకే వదిలేయాలని షేక్ అబ్దుల్లా ప్రతిపాదించారు. దీనిపై పటేల్ విముఖతతో ఉన్నారు. అయినా, దీనిపై ముందుకు వెళ్లమనే అయ్యంగార్‌కు పటేల్ సూచించారు.
నెహ్రూ విదేశాల నుంచి తిరిగివచ్చిన తర్వాత ఆయనకు ఓ లేఖ రాస్తూ.. ''సుదీర్ఘ చర్చ తర్వాతనే నేను పార్టీని ఒప్పించగలిగాను'' అని పటేల్ పేర్కొన్నారు.
ఆర్టికల్ 370 నిర్మాత సర్దార్ పటేలేనని శ్రీనాథ్ అభిప్రాయపడ్డారు.
- పింగళి వెంకయ్య: జాతీయ పతాక రూపకర్తకు తగిన గుర్తింపు దక్కలేదా
- ఫ్లైబోర్డుతో గాల్లో ఎగురుతూ ఇంగ్లిష్ చానల్ దాటేశాడు
ప్రభుత్వ చర్యల పట్ల ఆగ్రహం
కశ్మీర్ విషయంలో భారత ప్రభుత్వం తీసుకున్న చాలా చర్యల పట్ల పటేల్ ఆగ్రహం వ్యక్తం చేశారని రాజ్‌మోహన్ గాంధీ రాశారు.
ప్రజాభిప్రాయ సేకరణ, ఐరాసకు విషయాన్ని తీసుకువెళ్లడం, కశ్మీర్‌లోని పెద్ద భూభాగం పాక్ అధీనంలోకి వెళ్లాక యుద్ధం ఆపడం, రాజ్యం నుంచి మహారాజు వెళ్లిపోవడం వంటి విషయాల పట్ల పటేల్ విముఖతతో ఉన్నారు.
''అడుగడుగునా పటేల్ సూచనలు చేశారు. అభిప్రాయాలు వ్యక్తం చేశారు. కానీ, ఆయన పరిష్కారాలు సూచించలేదు. నిజానికి కశ్మీర్ అంశం పరిష్కారం అయ్యేది కాదని 1950 ఆగస్టులో ఆయన జయ్ప్రకాశ్తో అన్నారు'' అని పేర్కొన్నారు.
కశ్మీర్ సమస్యను పటేల్ ఎలా పరిష్కరించుండేవారన్నది ఆయన అనుచరులు కూడా చెప్పలేకపోయారని జయ్‌ప్రకాశ్ ఓసారి అన్నారు.
1948 జనవరిలో కశ్మీర్ వివాదం ఐరాసకు చేరింది. అక్కడ ప్రజాభిప్రాయ సేకరణ అంశం తెరపైకి వచ్చింది.
ఐరాస మధ్యవర్తిత్వం కారణంగా కశ్మీర్‌లోని కొంత ప్రాంతం భారత్‌లో, మరికొంత ప్రాంతం పాక్ నియంత్రణలో అలాగే కొనసాగింది.
1950లో భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చాక, ఆర్టికల్ 370తో జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి వచ్చింది.
రాజ్యాంగ పరిషత్‌లో ప్రత్యేక ప్రతిపత్తి విషయంపై చర్చ సందర్భంగా వచ్చిన ప్రశ్నలకు సమాధానం చెబుతూ.. ''భారత ప్రభుత్వం కశ్మీర్ ప్రజలకు కొన్ని హామీలు ఇచ్చింది. భారత్‌తో ఉంటారా, విడిగా ఉంటారా తేల్చుకునే అవకాశం కూడా వారికి ఉంటుంది. ఇందుకోసం ప్రజాభిప్రాయ సేకరణ జరిపేందుకు కట్టుబడి ఉన్నాం. అంతకుముందు అక్కడ పరిస్థితులు శాంతియుతంగా మారాలి. ప్రజాభిప్రాయ సేకరణ నిష్పాక్షికంగా జరిగేందుకు అనుకూలమైన వాతావరణం ఏర్పడాలి'' అని సభ్యుడు గోపాలస్వామి అయ్యంగార్ అన్నారు.
అయితే జమ్మూకశ్మీర్‌లో ప్రజాభిప్రాయ సేకరణ ఎప్పుడూ జరగలేదు.
ఇవి కూడా చదవండి:
- కశ్మీర్: మోదీ ఆర్టికల్ 370 రద్దు నిర్ణయానికి దేశంలో విస్తృతంగా మద్దతు ఎందుకు లభిస్తోంది?
- 'సైనిక విన్యాసాలు చేస్తూ శాంతి చర్చలా...' దక్షిణ కొరియాపై ఉత్తర కొరియా ఆగ్రహం..
- కశ్మీర్‌లోని లాల్ చౌక్‌లో 1992లో ఎగిరిన భారత జెండా.. అప్పడు మోదీ పాత్ర ఏంటి
- పక్షులు ఢీకొని ఎగిరిన కాసేపటికే మొక్కజొన్న పొలంలో దిగిన విమానం
- భారత్‌తో యుద్ధానికి సిద్ధం.. గుణపాఠం చెప్పే సమయం వచ్చింది : ఇమ్రాన్ ఖాన్
- షార్క్‌లు మనుషులపై ఎందుకు దాడులు చేస్తాయంటే...
- భారతదేశానికి స్వతంత్రం వచ్చినప్పుడు... మహాత్మాగాంధీ ఎక్కడ ఏం చేస్తున్నారు?
- మనుషుల అవయవాలు జంతువుల్లో వృద్ధి - ఈ పరిశోధనల లక్ష్యం ఏంటి
- పోర్న్ స్టార్ మియా ఖలీఫాను వెంటాడుతున్న గతం
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)