సిరియా యుద్ధం ఈ బాలుడి ముఖాన్ని మార్చేసింది
మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.

సిరియా యుద్ధం ఈ బాలుడి ముఖాన్ని మార్చేసింది

  • 20 ఆగస్టు 2019

హెచ్చరిక: ఈ వీడియోలో ఉన్న కొన్ని దృశ్యాలు మిమ్మల్ని కలచివేయవచ్చు.

జౌమా కుటుంబం 2018లో సిరియా నుంచి వలసవెళ్తుండగా వారు ప్రయాణిస్తున్న వాహనంపై వైమానిక దాడి జరిగింది.

కిటికీ పక్కనే కూర్చున్న జౌమా కళ్లలోకి పగిలిన బస్సు కిటికీ అద్దాలు చొచ్చుకుపోయాయి. దీంతో అతడి కంటిచూపు పూర్తిగా పోయింది.

ఆ దాడిలో బస్సు ధ్వంసం కావడంతో జౌమాకు, అతడి కుటుంబ సభ్యులకు తీవ్ర గాయాలయ్యాయి.

అతడి తండ్రి కాలివేళ్లు తెగిపోయాయి.

అప్పుడు జౌమా వయసు కేవలం 3 సంవత్సరాలు.

ఉత్తర సిరియాలోని కర్దిష్ కుటుంబానికి చెందిన జౌమా కుటుంబం ఇప్పుడు లెబనాన్ రాజధాని బీరట్‌లో ఓ చిన్న గదిలో నివసిస్తోంది.

యుద్ధప్రభావిత ప్రాంతం నుంచి వలస వచ్చిన జౌమా కుటుంబం ఇప్పుడు దుర్భర పేదరికాన్ని అనుభవిస్తోంది.

జౌమా గాయాల నుంచి ఇప్పటికీ అప్పుడప్పుడూ రక్తమోడుతూ ఉంటుంది. ఆ గాయాల నుంచి చిన్నచిన్న గాజు ముక్కలు బయటకొస్తూనే ఉంటాయి.

ఆనాడు జరిగిన ప్రమాదం గురించి వివరించమని అడిగినప్పుడు వారి కళ్లలో ఇప్పటికీ ఆ బాధ స్పష్టంగా కనిపించింది.

అందుకే వారితో సంభాషణలను మేం రికార్డు చెయ్యలేదు.

ఇవి కూడా చదవండి.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)