ఆండ్రాయిడ్ లేటెస్ట్ వెర్షన్ పేరేంటో తెలుసా?

  • 23 ఆగస్టు 2019
ఆండ్రాయిడ్ కొత్త వర్షన్ 'క్యూ' కాదు '10' Image copyright Google
చిత్రం శీర్షిక ఆండ్రాయిడ్ 10

ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ (ఓఎస్) తన తాజా వెర్షన్‌కు తిను బండారమో, తీపి పదార్థం పేరో పెట్టడం లేదు. 2009లో ప్రారంభించిన ఆ సంప్రదాయానికి ఆండ్రాయిడ్ ఈసారి ముగింపు పలికింది.

ఇప్పటివరకూ వస్తున్న వెర్షన్ల క్రమం ప్రకారం దీని కొత్త వెర్షన్‌ క్యూ అక్షరంతో ప్రారంభం కావాలి.

ఆండ్రాయిడ్ మొదటి రెండు వర్షన్లు ఇలా కాకుండా ఆల్ఫా, బీటా పేర్ల మీద వచ్చాయి.

ఆ తర్వాత ఇప్పటివరకూ వచ్చిన అన్ని వెర్షన్లను ఆల్ఫాబెట్ ఆర్డర్ ప్రకారం 'సీ' నుంచి 'పీ' వరకూ తీపిపదార్థాల పేరు వచ్చేలా పెట్టారు.

ఈ మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్‌కు ఇంతకు ముందు జెల్లీబీన్, కిట్‌కాట్, లాలీపాప్ లాంటి పేర్లు పెడుతూ వచ్చారు.

కానీ, లేటెస్ట్ వెర్షన్ ఏదో తెలుసుకోవాలనుకునే వినియోగదారులను ఆ పేర్లు గందరగోళానికి గురిచేస్తుండడంతో, ఇప్పటివరకూ ఉన్న సంప్రదాయానికి గుడ్‌బై చెప్పినట్లు గూగుల్ చెప్పింది.

ఈ ఏడాది చివర్లో విడుదలయ్యే కొత్త ఎడిషన్‌ను ఆండ్రాయిడ్ 10 అని పిలుస్తారు.

ఇది నిజానికి ఆండ్రాయిడ్ 17వ వర్షన్ అయినా, అందరికీ సులభంగా తెలిసేలా దీనికి 10 అని పెట్టింది.

ప్రతి ఏటా వెర్షన్‌ను విడుదల చేస్తున్నప్పుడు ఈ పేర్లు పెట్టే సంప్రదాయం ఆహ్లాదంగా ఉండేది అని గూగుల్ ఒక బ్లాగ్‌లో చెప్పింది.

"కానీ ఈ పేర్లు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అందరికీ అర్థం కావడం లేదని మాకు గత కొన్నేళ్లుగా ఫీడ్‌ బ్యాక్ వస్తోంది"

"ఉదాహరణకు కొన్ని భాషల్లో మాట్లాడినపుడు ఎల్, ఆర్ అక్షరాల మధ్య తేడా ఉండడం లేదు" అని గూగుల్ చెప్పింది.

ఒక గ్లోబల్ ఆపరేటింగ్ సిస్టమ్‌గా ఆండ్రాయిడ్ వెర్షన్ పేర్లు స్పష్టంగా, ప్రపంచంలోని ప్రతి ఒక్కరినీ చేరేలా ఉండాలని గూగుల్ భావించింది.

కొత్త ఆండ్రాయిడ్ వెర్షన్‌కు పేరు పెట్టేందుకు గూగుల్ ఒక ఒపీనియన్ పోల్ కూడా నిర్వహించింది.

అందులో అది 'క్యూ' అక్షరంతో వచ్చే కొన్ని పేర్లు ఇచ్చి, వాటిలో ఒకటి ఎంపిక చేయమంది.

చివరకు అందరికీ అర్థమయ్యేలా కొత్త సంప్రదాయానికి తెరతీస్తూ ఆండ్రాయిడ్ కొత్త వెర్షన్‌కు ఆండ్రాయిడ్ '10' అనే పేరు పెట్టింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)

ముఖ్యమైన కథనాలు

హౌడీ మోదీ సభతో మోదీ, ట్రంప్‌ల్లో ఎవరికేంటి లాభం.. అమెరికాలోని భారతీయుల ఓట్లన్నీ ట్రంప్‌కేనా

గోదావరిలోంచి బోటును బయటకు తీయలేరా

గాంధీకి దగ్గరైన ఈ ఎనిమిది మంది మహిళల గురించి మీకు తెలుసా

గ్రహాంతరవాసులను చూడ్డానికి ఎంతమంది వచ్చారు.. వచ్చినవారికి ఏమైంది

కేసీఆర్‌నే జైలుకు పంపుతామంటున్నారు.. తప్పు చేస్తే ఆ సీఎంలు వదిలిపెట్టేవాళ్లా - కేటీఆర్

‘బ్రౌన్ గర్ల్స్’... ఇన్‌స్టాగ్రామ్‌లో దక్షిణాసియా అమ్మాయిల సరికొత్త గ్యాంగ్

18 సంవత్సరాల్లోపు యూజర్లకు ఇలాంటి పోస్టులు ఇక కనిపించవు - ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్

శేఖర్ రెడ్డిని చంద్రబాబు బినామీ అన్న జగన్ ఆయనను టీటీడీ బోర్డులోకి ఎలా తీసుకున్నారు