వైరల్‌ ఫొటో: మొదటి రోజు స్కూల్‌కు వెళ్తున్నప్పుడు అలా... వచ్చేటప్పుడు ఇలా..

  • 27 ఆగస్టు 2019
స్కూల్‌కు వెళ్లక మందు వెళ్లి వచ్చిన తర్వాత లూసీ ఎలా ఉందో చూండి.
చిత్రం శీర్షిక స్కూల్‌కు వెళ్లక ముందు... వెళ్లి వచ్చిన తర్వాత లూసీ ఎలా ఉందో చూడండి

మొదటి రోజు స్కూల్‌కు వెళ్లినప్పుడు, తిరిగి వచ్చినప్పుడు తన బిడ్డ ఎలా ఉందో ఓ తల్లి ఫొటోలు తీసి సోషల్ మీడియాలో పెట్టిన పోస్టు వైరల్‌గా మారింది.

''Really Funny" అని ఆమె ఫేస్‌బుక్‌లో పెట్టిన ఫొటోలు వేలాది మంది నెటిజన్లు షేర్ చేశారు.

స్కాట్లాండ్‌లోని ఈస్ట్ రెన్ఫ్రెషైర్‌కు చెందిన జిల్ తన కూతురు లూసీని తొలిసారి స్కూల్‌కు పంపుతున్న వేళ ఆమెను క్లిక్ మనిపించింది. తన బిడ్డ ఎంతో అందంగా ఉందని మురిసిపోయింది.

కానీ, ఆమె ఆనందం ఎంతో సేపు నిలవలేదు. స్కూల్ నుంచి తిరిగి వచ్చిన లూసీ చింపిరి జట్టు, మాసిన బట్టలతో ఆమె ముందు ప్రత్యక్షమైంది.

ఆరా తీస్తే స్కూల్‌లో తోటి పిల్లలతో ఆడుకొని బట్టలన్నీ పాడు చేసుకుందని తెలిసింది.

చెదిరిన జట్టు, మాసిన బట్టలతో ఉన్న లూసీని ఆమె మళ్లీ ఫొటో తీసింది.

తర్వాత రెండు ఫొటోలను (ఉదయం స్కూల్‌కు వెళ్లే ముందు తీసిన ఫొటో, వెళ్లి వచ్చాక తీసిన ఫొటో) తన ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసింది.

ఈ ఫొటోలను దాదాపు 10 వేల మంది లైక్ చేశారు. స్థానిక వార్తా పత్రిక కోరడంతో వారిని ఆ ఫొటోలు ప్రచురించుకునేందుకు జిల్ అనుమతించారు.

''నా బిడ్డకు స్కూల్‌కు వెళ్లడం అంటే చాలా ఇష్టం. ఆమె స్కూల్‌కు వెళ్లడం ఇదే తొలిసారి. కొత్త విషయాలు నేర్చుకోడానికి ఇష్టపడుతుంది'' అని జిల్ చెప్పారు.

సోమవారం మధ్యాహ్నం లూసీ ఇంటికి రాగానే.. ‘ఏం చేశావ్? ఇలా తయారయ్యావ్?’ అని వాళ్లమ్మ ప్రశ్నిస్తే..

దానికి ఈ చిచ్చురపిడుగు ఇచ్చిన సమాధానం ఏంటో తెలుసా.. ''పెద్దగా ఏం లేదులే అమ్మా''.

''వాళ్ల స్కూల్లో టీచర్లు చాలా మంచివాళ్లు. చక్కగా పాఠాలు చెబుతారు. నా బిడ్డ తొలిరోజు అక్కడ సరదాగా గడిపి ఉంటుంది'' అని జిల్ పేర్కొన్నారు.

తన బిడ్డ చేష్టలను అప్పుడప్పుడు క్లిక్‌మనిపిస్తానని ఆమె చెప్పారు. చక్కగా ముస్తాబైనప్పుడు కాకుండా సాధారణ సమయంలో ఫొటోలు తీస్తుంటానని తెలిపారు.

''ఒక వేళ నేను ఫొటో తీస్తున్నానని చెబితే లూసీ వద్దంటుందని తెలుసు. ఎందుకంటే చక్కగా లేకుంటే తను ఫొటో తీయించుకోడానికి ఇష్టపడదు'' అని జిల్ చెప్పారు.

ముగ్గురు బిడ్డల తల్లైన జిల్ భర్త.. లూసీ మొదటి రోజు స్కూల్ ఎలా జరిగింది? అని అడగటంతో.. ఈ ఫొటోలను పంపింది.

''ఫొటోలు చూసి మా ఆయన చాలా సరదాగా ఉందని అన్నారు. దీంతో అవే ఫొటోలను మా స్నేహితులు, బంధువులతో ఫేస్‌బుక్‌లో పంచుకున్నా'' అని జిల్ పేర్కొన్నారు.

''నా పోస్టు ఈ స్థాయిలో వైరల్ అవుతుందని అనుకోలేదు. తన ఫొటోలు వైరల్ కావడంతో లూసీ ‘నేను ఫేమస్ అయ్యా’నని అందరికీ చెబుతోంది'' అని అన్నారు.

చిత్రం శీర్షిక తొలిసారి స్కూల్‌కు వెళుతున్న ఉద్వేగంలో బూట్లు తప్పుగా వేసుకున్న హార్పర్

కుడి కాలికి ఎడమ బూటు

జిల్ పోస్టుకు చాలా మంది తల్లిదండ్రులు ప్రతిస్పందించారు. తమ పిల్లలు స్కూల్‌కు వెళ్లినప్పుడు, తిరిగి వచ్చాక ఎలా ఉన్నారో కొన్ని ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు.

లారా నాలుగేళ్ల కూతురు హార్పర్ మొదటి రోజు స్కూల్‌కు వెళుతున్నప్పుడు చాలా ఉద్వేగానికి గురైంది. దీంతో ఒక కాలి బూటును మరో కాలికి వేసుకుంది.

''నువ్వు బూట్లను తప్పుగా వేసుకుంటున్నావని అంటే ‘పర్లేదు మమ్మీ.. ఈ రోజు నాకు చాలా గొప్ప రోజు’ అని హార్పర్ చెప్పుకొచ్చింది'' అని తన బిడ్డ అన్న మాటలను లారీ ఫేస్‌బుక్‌లో షేర్ చేశారు.మొదటిసారి స్కూల్‌కు వెళ్లినప్పుడు, తిరిగి వచ్చినప్పుడు తన బిడ్డ ఎలా ఉందో ఓ తల్లి ఫొటోలు తీసి సోషల్ మీడియాలో పెట్టిన పోస్టు వైరల్‌గా మారింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు

ఆసిఫాబాద్ మహిళ అత్యాచారం, హత్య కేసు: ‘ఆ శరీరం ఆడమనిషిలానే లేదు.. నా కోడలిని బొమ్మలా ఆడుకున్నారు’

దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌‌పై విచారణ కమిషన్: నిందితులు పిస్టల్ లాక్కొని దాడికి దిగినా పోలీసులు గాయపడలేదా: సీజేఐ ప్రశ్న

రజినీకాంత్ @69: సినిమాలా? రాజకీయమా? జీవితంలోని కీలక సమంలో ఏ నిర్ణయం తీసుకుంటారు?

అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కి, అమెజాన్‌కి మధ్య వివాదంలో లాభపడిన మైక్రోసాఫ్ట్

యువకుడిపై నలుగురి అత్యాచారం... ముంబైలో మూడు గంటల పాటు నరకం

పాకిస్తాన్ థార్ ఎడారి: ఇక్కడ ఆవుల బలిదానం ఉండదు, గోమాంసం విక్రయించరు

పౌరసత్వ సవరణ బిల్లుపై అస్సాంలో ఆందోళనలు, గువాహటిలో కర్ఫ్యూ, 10 జిల్లాల్లో ఇంటర్‌నెట్ నిలిపివేత

పౌరసత్వ సవరణ బిల్లుకు పార్లమెంటు ఆమోదం