పోర్న్‌ హబ్: రివెంజ్‌ పోర్న్‌ వీడియోల మీద డబ్బులు సంపాదిస్తున్న పోర్న్ సైట్ యజమానులు

  • 8 సెప్టెంబర్ 2019
మహిళ Image copyright Getty Images
చిత్రం శీర్షిక ప్రతీకాత్మక చిత్రం

పోర్న్ వీడియోల వెబ్‌సైట్ పోర్న్‌హబ్ యజమానులు "రివెంజ్ పోర్న్" వీడియోలతో లాభాలు ఆర్జిస్తున్నారని, బాధితుల నుంచి ఫిర్యాదులు వచ్చినా వాటిని తొలగించడంలేదని ఆరోపణలు వచ్చాయి.

ఒక వ్యక్తిని క్షోభకు గురిచేసేందుకు వారి అనుమతి లేకుండా అసభ్యకరమైన చిత్రాలను, వీడియోలను కొందరు వ్యక్తులు ఇంటర్నెట్‌లో వ్యాప్తి చేస్తుంటారు. అలాంటి కంటెంట్‌ను రివెంజ్ పోర్న్ అంటారు.

ఆ పని మాజీ భాగస్వామి చేసి ఉండొచ్చు, గిట్టనివారు ఇంకెవరైనా చేసి ఉండొచ్చు. అనేక మంది వీటి బారిన పడుతున్నారు.

రివెంజ్ పోర్న్ బాధితుల్లో బ్రిటన్‌కు చెందిన సోఫీ (పేరు మార్చాం) ఒకరు. ఆమె వీడియోలను ఆమె అనుమతి, అంగీకారం లేకుండానే పోర్న్‌హబ్‌లో అప్‌లోడ్ చేశారు.

ఆ వీడియోలు పోర్న్ సైట్‌లో ఉన్నట్లు సోఫీకి తెలిసేలోపే వాటిని లక్షల మంది చూశారు.

ఆ వీడియోలు ఇంటర్నెట్‌లో వైరల్ అయ్యాయంటూ సోఫీకి తన సోదరి 2018 మే నెలలో చెప్పారు. దాంతో, ఆ వీడియోను తొలగించాలంటూ సోఫీ పోర్న్‌హబ్ వెబ్‌సైట్‌ను కోరారు. కానీ, 2019 ఆగస్టు నాటికి కూడా ఆ వీడియో ఆ వెబ్‌సైట్‌లో ఉంది.

మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.
Media captionవీడియో: రివెంజ్‌ పోర్న్‌ వీడియోలతో డబ్బులు సంపాదిస్తున్నారు

అధికంగా సంపాదించేందుకు పోర్న్‌హబ్ యజమానులు అలాంటి వీడియోలను అనుమతిస్తున్నారని రివెంజ్ పోర్న్ బాధితుల తరఫున పోరాడే #NotYourPorn ఉద్యమకారుల బృందం ఆరోపించింది.

పోర్న్‌హబ్ మాత్రం "రివెంజ్ పోర్న్‌ను తీవ్రంగా ఖండిస్తున్నామని" అని పేర్కొంది. రివెంజ్ పోర్న్‌‌కు అడ్డుకట్ట వేసేందుకు కఠిన నిబంధనలు పాటిస్తున్నామని వెల్లడించింది.

"ఆ వీడియోను తొలగించాలని కోరుతూ సోఫీ నుంచి మాకు ఈ-మెయిల్ వచ్చినట్లు మా రికార్డుల్లో కనిపించడంలేదు. కానీ... ప్రస్తుతం ఆమెతో మాట్లాడుతున్నాం. ఈ సమస్యను పరిష్కరించే దిశగా ముందుకెళ్తున్నాం" అని పోర్న్‌హబ్ పేర్కొంది.

Image copyright Getty Images

అప్పటికే లక్షల మంది చూశారు

"18 నెలల క్రితం నా కుటుంబ సభ్యులతో కలిసి బయటకు వెళ్లాను. ఫోన్ చూస్తే మిస్డ్ కాల్స్, మెసేజ్‌లు ఉన్నాయి. ప్రపంచంలోని అతిపెద్ద పోర్న్ వెబ్‌సైట్ అయిన పోర్న్‌హబ్‌లో నా వీడియో ఉందని మా సోదరి చెప్పారు. అది పోర్న్‌హబ్ టాప్ 10 వీడియోల జాబితాలో ఉంది. అప్పటికే దానిని లక్షల సార్లు చూశారు. అది చూడగానే షాకయ్యాను. నా నోట మాటరాలేదు. తీవ్ర క్షోభకు గురయ్యాను" అని సోఫీ (పేరు మార్చాం) బీబీసీ విక్టోరియా డెర్బీషైర్ కార్యక్రమంలో చెప్పారు.

సోఫీ గతంలో తన మాజీ భాగస్వామితో కలిసి ఉన్నప్పుడు ఆరు వీడియోలు తీసుకున్నారు. కొన్నేళ్ల క్రితం ఇద్దరూ విడిపోయారు. కానీ, ఆ వీడియోలను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేసేందుకు ఆమె ఎవరికీ అనుమతి ఇవ్వలేదు.

పోర్న్‌హబ్‌లో ఆమె తన వీడియోలను గుర్తించిన తర్వాత వారం రోజుల్లోనే తొలగించారు.

కానీ, ఆ తర్వాత ఆ ఆరు వీడియోలను దాదాపు 100 క్లిప్పులుగా కత్తిరించి, మళ్లీ అదే వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేశారు.

ఆ వీడియోలపై పోర్న్‌హబ్‌కు ఫిర్యాదు చేస్తే అటువైపు నుంచి సరైన స్పందన రావడంలేదని సోఫీ అంటున్నారు.

ఆమె పోలీసులను కూడా సంప్రదించారు. అయినా ఇప్పటికీ ఎవరి మీదా కేసు నమోదు చేయలేదు.

అధిక డబ్బులు సంపాదించేందుకు కొందరు వ్యక్తులు ఇలాంటి వీడియోలను వాడుతున్నారని రివెంజ్ పోర్న్ బాధితుల తరఫున పోరాడుతున్న #NotYourPorn వ్యవస్థాపకురాలు కేట్ ఐజాక్స్ అన్నారు.

ఇలాంటి కంటెంట్‌ను గుర్తించిన వెంటనే ఆయా వెబ్‌సైట్లు తొలగించాలని, వాటిని మళ్లీ అప్‌లోడ్ చేయకుండా నిరోధించాలని కేట్ కోరుతున్నారు.

'నా కుటుంబంపై ప్రభావం'

పోర్న్‌వెబ్‌సైట్‌లో సోఫీ వీడియో ప్రత్యక్షమయ్యే నాటికి ఆమె మరో వ్యక్తితో రిలేషన్‌లో ఉన్నారు. ఆమెకు టీనేజీ కూతురు కూడా ఉంది. ఆ వీడియోల వల్ల తాము చాలా ఇబ్బంది పడుతున్నామని సోఫీ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

"పోర్న్‌హబ్‌లో అప్‌లోడ్ చేసే వీడియోలు మా నిబంధనలకు విరుద్ధంగా ఉన్నట్లు గుర్తిస్తే, వెంటనే తొలగిస్తాం. ఆ వీడియోలోని వ్యక్తుల అనుమతి, అంగీకారం లేకుండా అప్‌లోడ్ చేసే వీడియోలను కూడా తొలగిస్తాం " అని పోర్న్‌హబ్ ఉపాధ్యక్షుడు కోరీ ప్రైస్ అన్నారు.

ప్రతీకార పోర్న్ వీడియోలను సులువుగా తొలగించేందుకు 2015 నుంచి సమర్పణ పత్రాన్ని అందుబాటులోకి తెచ్చామని కోరీ చెప్పారు. "మేము అత్యాధునిక థర్డ్-పార్టీ డిజిటల్ ఫింగర్ ప్రింటింగ్ సాఫ్ట్‌వేర్‌ను కూడా ఉపయోగిస్తాం. అప్‌లోడ్‌ చేసే వీడియోలను అన్నింటినీ అది స్కాన్ చేస్తుంది. ఒక్కసారి తొలగించిన వీడియో మళ్లీ తమ వెబ్‌సైట్‌లోకి రాకుండా నిరోధిస్తుంది" అని వివరించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)

ముఖ్యమైన కథనాలు