రఫేల్ నడాల్: US Open చాంపియన్, కెరియర్‌లో 19వ గ్రాండ్‌శ్లామ్

  • 9 సెప్టెంబర్ 2019
రఫేల్ నడాల్ Image copyright Getty Images
చిత్రం శీర్షిక రఫేల్ నడాల్

రఫేల్ నడాల్ యూఎస్ ఓపెన్-2019 టైటిల్ విజేతగా నిలిచాడు.

హోరాహోరీగా ఐదు సెట్ల వరకూ జరిగిన మ్యాచ్‌లో రెండో ర్యాంక్‌లో ఉన్న నడాల్ ఐదో ర్యాంక్ ఆటగాడు డేనీల్ మెద్వెదేవ్‌ను 7-5, 6-3, 5-7, 4-6, 6-4 తేడాతో ఓడించాడు.

రష్యా ఆటగాడు మెద్వెదేవ్ మొదటిసారి ఒక గ్రాండ్ శ్లామ్ పోటీలో ఫైనల్ చేరుకున్నాడు. కానీ నడాల్ ముందు నిలవలేకపోయాడు.

ఇది నడాల్ కెరియర్‌లో 19వ గ్రాండ్ శ్లామ్ టైటిల్. అతడికి యూఎస్ ఓపెన్ విజేతగా నిలవడం ఇది నాలుగోసారి.

మరో టైటిల్ సాధిస్తే అగ్రస్థానంలో ఉన్న ఫెదరర్ రికార్డును నడాల్ సమం చేస్తాడు.

"నా టెన్నిస్ కెరియర్‌లోనే అత్యంత ఉద్విగ్న క్షణాల్లో ఇవి కూడా ఒకటి. అద్భుతమైన మ్యాచ్ ఇది. చాలా ఉత్సాహంగా జరిగింది" అని మ్యాచ్ అనంతరం నడాల్ వ్యాఖ్యానించాడు.

మ్యాచ్ పాయింట్ సాధించగానే నడాల్... కోర్టులో నేలపై పడి ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యాడు.

"నేను రఫాను అభినందిస్తున్నా. 19 గ్రాండ్‌స్లామ్ టైటిళ్లు నెగ్గడం అంటే సాధారణ విషయం కాదు" అని రన్నరప్ మెద్వెదేవ్ అన్నాడు.

24000 మంది సామర్థ్యమున్న స్టేడియంలో ప్రేక్షకులంతా వీరిద్దరి ఆటకు ముగ్ధులైపోయారు. మ్యాచ్ ఐదో సెట్ వరకూ దారితీయడంతో ఏమైనా సంచలనం చోటుచేసుకుంటుందేమోనని వారంతా ఉద్విగ్నతతో మ్యాచ్ తిలకించారు.

ప్రస్తుతం స్విస్ ఆటగాడు రోజర్ ఫెదరర్ 20 టైటిళ్లతో అగ్రస్థానంలో ఉండగా నడాల్ రెండో స్థానంలో ఉన్నాడు. 16 టైటిళ్లు సాధించిన నొవాక్ జొకోవిచ్ మూడో స్థానంలో ఉన్నాడు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు

మహారాష్ట్ర, హరియాణా అసెంబ్లీ ఎన్నికలు, హుజూర్ నగర్ ఉప ఎన్నికల పోలింగ్ ప్రారంభం

మలద్వారంలో పెట్టుకుని బంగారం క్యాప్సుల్స్‌ అక్రమ రవాణా.. శంషాబాద్‌లో స్మగ్లర్ అరెస్టు

భారత సైన్యం దాడిలో ‘ఉగ్రవాదులు’, పాక్ సైనికులు మృతి: ఇండియన్ ఆర్మీ చీఫ్ ప్రకటన

చంద్రుడి మీదకు మళ్లీ మనిషిని పంపించటం కోసం కొత్త స్పేస్‌సూట్ ఆవిష్కరణ.. ప్రత్యేకతలివే

తండ్రి శవాన్ని తీసుకెళ్లడానికి నిరాకరిస్తున్న కొడుకులు.. కారణమేంటి

సంతాన నిరోధక మాత్రలు మగాళ్లకు ఎందుకు లేవు

మెట్రో రైలు చార్జీల పెంపుపై నిరసన: చిలీలో హింస.. ముగ్గురి మృతి

‘డియరెస్ట్ మోదీజీ... దక్షిణాది సినీ కళాకారులకు స్థానం లేదా?’ - ఉపాసన కొణిదెల