బిజినెస్ ట్రిప్‌లో శృంగారం చేస్తూ ఉద్యోగి మరణం... ఇది ఇండస్ట్రియల్ యాక్సిడెంట్, పరిహారం చెల్లించాలన్న కోర్టు

  • 11 సెప్టెంబర్ 2019
సెక్స్ Image copyright Getty Images

ఫ్రాన్స్‌లో బిజినెస్ ట్రిప్‌పై వెళ్లిన ఓ ఉద్యోగి అపరిచితురాలితో శృంగారంలో పాల్గొంటూ మృతి చెందారు. ఆ ఉద్యోగిని నియమించుకున్న సంస్థ ఆయన కుటుంబానికి పరిహారం చెల్లించాల్సిందేనని అక్కడి కోర్టు తీర్పు చెప్పింది.

ఘటన జరిగిన సమయంలో ఉద్యోగ సంబంధమైన విధుల్లో లేనందున ఆ ఉద్యోగికి పరిహారం ఎందుకు ఇవ్వాలని ఈ కేసులో సదరు సంస్థ కోర్టు ముందు వాదించింది.

అయితే , ఆ ఉద్యోగి మృతిని 'ఇండస్ట్రియల్ యాక్సిడెంట్'గానే పరిగణించాలని న్యాయమూర్తులు స్పష్టం చేశారు.

జేవియర్ ఎక్స్ అనే వ్యక్తి మరణం విషయంలో పారిస్‌లోని ఓ కోర్టు ఈ తీర్పు చెప్పింది.

ఫ్రాన్స్‌లో రైల్వే సంబంధిత సేవలు అందించే టీఎస్‌ఓ అనే సంస్థలో ఆయన ఉద్యోగం చేసేవారు.

Image copyright Getty Images

2013లో జేవియర్ తన ఉద్యోగంలో భాగంగా బిజినెస్ ట్రిప్‌పై మధ్య ఫ్రాన్స్‌కు వెళ్లారు.

అక్కడ ఓ అపరిచిత మహిళ‌ను ఆయన కలిశారు. ఆమె ఉంటున్న హోటల్ గదిలోకి పోయారు.

అయితే, ఆమెతో శృంగారంలో పాల్గొంటున్న సమయంలో జేవియర్‌కు కార్డియాక్ అరెస్టు వచ్చింది. ఆయన అక్కడే మరణించారు.

ఈ ఘటనను 'వర్క్‌ప్లేస్ యాక్సిడెంట్'గా పరిగణిస్తూ జేవియర్ కుటుంబానికి పరిహారం ఇవ్వాలని ప్రభుత్వ బీమా సంస్థ టీఎస్‌ఓను ఆదేశించింది.

ఫ్రాన్స్ చట్టాల ప్రకారం బిజినెస్ ట్రిప్ సమయంలో ఉద్యోగికి జరిగే ఏ ప్రమాదానికైనా, సంస్థే బాధ్యత వహించాల్సి ఉంటుంది.

ఆ సంస్థ దీనిపై కోర్టుకు వెళ్లింది. 'అపరిచితురాలితో వివాహేతర సంబంధం' పెట్టుకోవడం వల్ల జేవియర్ మరణించారని వాదించింది.

తినడం, స్నానం చేయడం లాగే సెక్స్ కూడా సాధారణ చర్యేనంటూ ప్రభుత్వ బీమా సంస్థ తమ నిర్ణయాన్ని సమర్థిస్తూ వాదనలు వినిపించింది.

కోర్టు కూడా ఈ వాదనతో ఏకీభవించింది.

బిజినెస్ ట్రిప్‌పై వెళ్లిన ఉద్యోగికి పరిస్థితులతో సంబంధం లేకుండా ఆ మొత్తం సమయమూ సామాజిక భద్రత వర్తిస్తుందందటూ తీర్పు చెప్పింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)

ముఖ్యమైన కథనాలు

గోదావరిలో వ‌రుస పడవ ప్ర‌మాదాలు... ఎందుకిలా జ‌ర‌ుగుతోంది? ఎవరు బాధ్యులు?

పాకిస్తాన్‌లో హిందూ విద్యార్థిని అనుమానాస్పద మృతి

కశ్మీర్: పీఎస్ఏ చట్టం కింద ఫారూక్ అబ్దుల్లా నిర్బంధం... ఏమిటీ చట్టం? ఎంత కఠినం?

దక్షిణ కొరియా నాయకులు ఎందుకు గుండు కొట్టించుకుంటున్నారు?

ధోనీ మళ్లీ ఆడతాడా... భారత క్రికెట్‌కు అతడి అవసరం ఇంకా ఉందా?

ఏరియా 51: అమెరికాలో రెండు పట్టణాలను గడగడలాడిస్తున్న 'ఏలియన్స్ జోక్'..

గుజరాత్ 2002 అల్లర్ల ముఖ చిత్రాలైన వీళ్లను గుర్తుపట్టారా.. వీళ్లు ఇప్పుడేం చేస్తున్నారు

గోదావరి బోటు ప్రమాదం: 20కి చేరిన మృతులు.. మరో 27 మంది ఆచూకీ గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు చర్యలు