హమ్జా బిన్ లాడెన్: అల్ ఖైదా నాయకుడి కుమారుడు చనిపోయాడని ధ్రువీకరించిన ట్రంప్

  • 14 సెప్టెంబర్ 2019
హమ్జా బిన లాడెన్ Image copyright cia
చిత్రం శీర్షిక హమ్జా బిన్ లాడెన్

అల్ ఖైదా వ్యవస్థాపకుడు ఒసామా బిన్ లాడెన్ కుమారుడు హమ్జా చనిపోయాడని అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ ధ్రువీకరించారు.

అమెరికా ఇంటలిజెన్స్ అధికారుల నుంచి లభించిన సమాచారం ప్రకారం హమ్జా బిన్ లాడెన్ చనిపోయాడని ఆ దేశ మీడియా గత నెలలోనే ప్రకటించింది.

హమ్జా అంతర్జాతీయ తీవ్రవాది అని అమెరికా రెండేళ్ళ కిందటే అధికారికంగా ప్రకటించింది.

ఒసామా బిన్ లాడెన్‌కు బలమైన వారసుడిగా గుర్తింపు పొందిన హమ్జా వయసు దాదాపు 30 ఏళ్ళు. అమెరికా తదితర దేశాల మీద అతడు దాడులకు పిలుపునిచ్చాడు.

"అల్ ఖైదా అగ్ర నాయకులలో ఒకరు, ఒసామా బిన్ లాడెన్ కుమారుడైన హమ్జా బిన్ లాడెన్ చనిపోయాడు. అఫ్గానిస్తాన్ - పాకిస్తాన్ ప్రాంతంలో అమెరికా నిర్వహిస్తున్న తీవ్రవాద వ్యతిరేక చర్యలలో అతను మృతిచెందాడు" అని వైట్ హౌస్ విడుదల చేసిన ప్రకటనలో ట్రంప్ పేర్కొన్నారు.

Image copyright Rewards for Justice

అయితే, హమ్జా చనిపోయింది ఎప్పుడు, ఏ ఆపరేషన్‌లో అన్నది ఆ ప్రకటనలో వెల్లడించలేదు.

అమెరికా ప్రభుత్వం ఫిబ్రవరి నెలలో హమ్జా జాడ తెలిపిన వారికి 10 లక్షల బహుమతి ప్రకటించింది.

అమెరికా ప్రత్యేక దళాలు పాకిస్తాన్‌లో 2011 మే నెలలో తన తండ్రిని హతమార్చినందుకు ప్రతీకారం తీర్చుకోవాలని హమ్జా బిన్ లాడెన్ జిహాదీలకు పిలుపునిచ్చాడు.

అరేబియా ద్వీపకల్పంలోని ప్రజలను కూడా ఆయన అదే విధంగా కోరాడు. సౌదీ అరేబియా గత మార్చి నెలలో అతడి పౌరసత్వాన్నిరద్దు చేసింది.

1998లో టాంజానియా, కెన్యాలోని అమెరికా ఏంబసీలపై జరిగిన బాంబు దాడులకు హమ్జా కొత్త మామ అబ్దుల్లా అహ్మద్ అబ్దుల్లా లేదా అబూ ముహమ్మద్ అల్-మస్రీ కారణం అని సూచించాయి.

2001 సెప్టంబర్ 11న వరల్డ్ ట్రేడ్ సెంటర్‌పై జరిగిన దాడి వెనుక అల్ ఖైదా హస్తం ఉంది. కానీ ఇస్లామిక్ స్టేట్ కార్యకలాపాలు పెరగడంతో గత దశాబ్ద కాలంగా ఇది బలహీనమైపోయింది.

Image copyright Getty Images

అల్ ఖైదా-ఆవిర్భావం

  • అమెరికా మద్దతుతో అఫ్గానిస్తాన్‌ను ఆక్రమించిన సోవియట్ యూనియన్‌ను తరిమికొట్టేందుకు పోరాడుతున్న అఫ్గాన్ ముజాహిదీలతో చేతులు కలిపిన అరబ్ వాలంటీర్లుగా 1980లలో ఇది ఆవిర్భవించింది.
  • ఒసామా బిన్ లాడెన్ ఈ వాలంటీర్లకు సాయం చేసేందుకు ఒక సంస్థను ఏర్పాటు చేసాడు. దానిని అల్ ఖైదా లేదా 'ది బేస్' అనేవారు.
  • ఒసామా బిన్ లాడెన్ 1989లో అఫ్గానిస్తాన్ వదిలివెళ్లాడు. వేలాది విదేశీ ముస్లింలకు మిలిటరీ శిక్షణ శిబిరాలు నడిపేందుకు 1996లో మళ్లీ తిరిగి వచ్చాడు.
  • అమెరికన్లు, యూదులు, వారి మిత్రులపై అల్ ఖైదా 'పవిత్ర యుద్ధాన్ని' ప్రకటించింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)

ఈ కథనం గురించి మరింత సమాచారం

ముఖ్యమైన కథనాలు

బోరిస్ జాన్సన్: మళ్లీ ప్రధానిగా కన్జర్వేటివ్ నేత.. బ్రిటన్ ఎన్నికల్లో టోరీల ఘన విజయం

గొల్లపూడి మారుతీరావు (1939-2019): "ఒక్క జీవితంలోనే పది జీవితాలు చూసిన మనిషి"

ఏపీ అసెంబ్లీ: చంద్రబాబును మార్షల్స్ తోసేశారు.. టీడీపీ; మార్షల్స్‌ను పీక పట్టుకుని బెదిరించారు.. వైసీపీ

ఈరోజు మాకు హోలీ, దీపావళి కంటే పెద్ద పండుగ రోజు: పాకిస్తాన్ హిందూ శరణార్థులు

పార్లమెంటుపై దాడికి 18ఏళ్లు: బులెట్లు దూసుకొస్తున్నా, ప్రాణాలకు తెగించి గేటు నంబర్ 1 మూసేశాడు

ముస్లింలలో ఆందోళన కలిగిస్తున్న నరేంద్ర మోదీ సర్కార్ మూడు నిర్ణయాలు

'విజయవాడ, విశాఖపట్నం మెట్రోలపై ఏపీ ప్రభుత్వ అనాసక్తి'

అస్సాంలో ఆందోళనలు: పౌరసత్వ సవరణ బిల్లుపై పెరిగిన నిరసనలు... ఇద్దరు మృతి