ప్రాణాలు తీస్తున్న పచ్చరాళ్ల ఆశలు
మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.

మియన్మార్‌లో పేదల ప్రాణాలు తీస్తున్న పచ్చరాళ్ల ఆశలు..

  • 15 సెప్టెంబర్ 2019

ప్రపంచంలోనే అతి పెద్ద పచ్చరాళ్ల గనులు మియన్మార్‌లో ఉన్నాయి. వీటి వ్యాపారం విలువ దాదాపు 2 లక్షల కోట్ల రూపాయలు.

వేలాది మంది ఈ గనుల వ్యర్థాల్లో పచ్చరాళ్ల ముక్కల కోసం వెతుకుతూ ప్రాణాలను కూడా పణంగా పెడుతున్నారు.

ఇక్కడికి వలసవచ్చిన వాళ్లు, నిరుపేదలు తమ అదృష్టాన్ని పరీక్షించుకునే ప్రయత్నంలో ఆ రాళ్ల కిందే సమాధి అయిపోతున్నారు.

పచ్చలు వెతికేపని కష్టమైనది కావడంతో, ఒళ్లునొప్పులు తెలియకుండా ఉండేందుకు డ్రగ్స్ కూడా తీసుకుంటున్నారు.

మియన్మార్‌లో ఒక గని దగ్గరకు వెళ్లిన బీబీసీ అక్కడ వ్యర్థాలలో పచ్చల కోసం వెతికే వారితో మాట్లాడింది.

ఇక్కడ హెరాయిన్‌కు బానిసలయ్యే వాళ్లు కూడా పెరుగుతున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)

సంబంధిత అంశాలు