మియన్మార్‌: పచ్చరాళ్ళ వేట కోసం డ్రగ్స్‌కు బానిసలవుతున్నారు... ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు

  • 15 సెప్టెంబర్ 2019
పచ్చరాళ్ల ఆశలు

ఒకరి ఆడంబరం మరొకరిపాలిట శాపంగా మారుతోంది. ప్రపంచవ్యాప్తంగా పచ్చరాళ్లకు ఉన్న గిరాకీ మియన్మార్ ప్రజల ప్రాణాలను తీస్తోంది.

ప్రపంచంలోనే అతి పెద్ద పచ్చరాళ్ల గనులు మియన్మార్‌లో ఉన్నాయి. వీటి వ్యాపారం ఏటా దాదాపు 2 లక్షల కోట్ల రూపాయలు ఉంటుంది.

వేలాది మంది ప్రజలు ఈ గనుల వ్యర్థాల్లో పచ్చరాళ్ల కోసం వెతుకుతూ ప్రాణాలను పణంగా పెడుతున్నారు.

మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.
Media captionప్రాణాలు తీస్తున్న పచ్చలు

ఇక్కడికి వలసవచ్చిన వాళ్లు, నిరుపేదలు తమ అదృష్టాన్ని పరీక్షించుకునే ప్రయత్నంలో ఆ రాళ్ల కిందే సమాధి అయిపోతున్నారు.

పచ్చలు వెతికేపని కష్టమైనది కావడంతో, ఒళ్లునొప్పులు తెలియకుండా ఉండేందుకు ఇక్కడివారు డ్రగ్స్ కూడా తీసుకుంటున్నారు.

మియన్మార్‌లో ఒక గని దగ్గరకు వెళ్లిన బీబీసీ అక్కడ వ్యర్థాలలో పచ్చల కోసం వెతికే వారితో మాట్లాడింది.

ఆ గని దగ్గర తవ్వకాల్లో మిగిపోయిన పచ్చరాళ్ల ముక్కల కోసం వెతికే వారిలో నెనె విన్ ఒకరు.

'మొదట్లో నేను గనుల దగ్గర ఆహారం, డ్రింక్స్ అమ్మేదాన్ని. ఇప్పుడు ఎక్కువ డబ్బులు సంపాదించడం కోసం నా కూతురితో కలిసి పచ్చరాళ్ల ముక్కలు ఏరుతున్నా. ఇంతవరకు మంచి విలువైన రాయి ఒక్కటీ దొరకలేదు. నేను ఒక పచ్చరాయి ముక్కకు ఎక్కువగా అందుకుంది 5 డాలర్లే. అదృష్టం బాగుండి మంచి రాయి దొరికితే ఇంట్లో వాళ్ల కడుపు నింపచ్చు అని నెన్ విన్ చెప్పారు.

'ఎత్తైన కుప్పల మీద ప్రమాదాలు జరుగుతుంటాయి. ప్రమాదమని తెలిసినా కొందరు కుప్ప కిందకు దిగుతుంటారు. పై నుంచి రాళ్లు, మట్టిపెళ్లలు జారిపడినప్పుడు పైన, కింద ఉండేవాళ్లు తీవ్రంగా గాయపడుతుంటారు.'

ఇక్కడ హెరాయిన్‌కు బానిసలయ్యే వాళ్లు కూడా పెరుగుతున్నారు. ఒక డోసు హెరాయిన్ విలువ ఒక డాలర్ కంటే తక్కువే. టీనేజర్లలో కూడా ఈ వ్యసనం పెరుగుతోంది.

హెరాయిన్ తీసుకునే ఒక కార్మికుడు బీబీసీతో "ఇక్కడ పని చేయడం చాలా కష్టం. ఆ కష్టం నుంచి ఉపశమనం కోసం డ్రగ్స్ తీసుకోవడం మొదలుపెట్టాను. డ్రగ్స్ తీసుకుంటే రేయింబవళ్లు పని చేయొచ్చని ఇక్కడి వాళ్లు చెబుతుంటారు" అన్నారు.

తల్లిదండ్రులు ఆ పని మానేయాలని నెనె విన్ కూతురు విన్ హెట్ హెట్ కా కోరుకుంటోంది.

"అక్కడ జారిపడే రాళ్లు వాళ్లకు తగులుతాయేమోనని భయమేస్తుంది. ఏదో ఒకరోజు వాళ్లు చనిపోతారేమోనని భయం వెంటాడుతుంటుంది" అని హెట్ కా చెప్పింది.

ఆమె తల్లి మాత్రం 'మాకు అదృష్టాన్ని తెచ్చిపెట్టే పచ్చరాయి ఏదో ఒకరోజు దొరుకుతుందనే ఆశతో ఉన్నా అని చెబుతున్నారు".

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)

ముఖ్యమైన కథనాలు

హైదరాబాద్ ఎన్‌కౌంటర్: రేప్ కేసుల విచారణలో ఇతర దేశాలతో పోల్చితే భారత న్యాయవ్యవస్థ పనితీరు ఎలా ఉంది?

హైదరాబాద్ ఎన్‌కౌంటర్: తెలంగాణ పోలీసుల తీరుపై అయిదు సందేహాలు

నిందితులను చంపేస్తే దేశమంతటా ప్రజలు ఎందుకు సంబరాలు చేసుకుంటున్నారు

విషపూరిత కప్పలు... వాటిని నేర్పుగా తినే ఎలుకలు

ఎల్ నినో సరే, మరి 'ఇండియన్ నినో' అంటే ఏమిటో తెలుసా...

పెళ్లి వేడుకలో డాన్స్ మధ్యలో ఆపినందుకు యువతి ముఖంపై తుపాకీతో కాల్చారు

BBC Exclusive: ఎయిర్‌టెల్ సమాచార వ్యవస్థలో లోపం.. 32 కోట్ల మంది సమాచారం లీకయ్యే ప్రమాదాన్ని సరిదిద్దామన్న సంస్థ

ఉన్నావ్ అత్యాచారం: ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బాధితురాలి మృతి