అత్యధిక చందమామల రికార్డు బ్రేక్ చేసిన శని గ్రహం

  • 12 అక్టోబర్ 2019
శని గ్రహం Image copyright NASA/JPL-CALTECH/SPACE SCIENCE INSTITUTE

అత్యధిక చంద్రుళ్ల విషయంలో బృహస్పతి (జూపిటర్)ను శని గ్రహం మించిపోయిందని అమెరికా ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

శని గ్రహానికి చుట్టూ తిరుగుతున్న 20 కొత్త చంద్రుళ్లను శాస్త్రవేత్తలు గుర్తించారు. దాంతో ఆ గ్రహానికి ఉన్న మొత్తం చంద్రుళ్ల సంఖ్య ఇప్పుడు 82కు చేరింది. బృహస్పతి చుట్టూ ప్రస్తుతం 79 చంద్రుళ్లు తిరుగుతున్నాయి.

శని గ్రహం చుట్టూ తిరిగే ఈ కొత్త ఉపగ్రహాల అన్వేషణకు శాస్త్రవేత్తలు హవాయిలో ఉన్న సుబారూ టెలిస్కోప్ సాయం తీసుకున్నారు.

శని చుట్టూ తిరుగుతున్న ఈ కొత్త ఉపగ్రహాల వ్యాసం 5 కిలోమీటర్లు. వీటిలో 17 ఉపగ్రహాలు శనికి ప్రతికూల దిశలో తిరుగుతున్నాయి.

సైన్స్ భాషలో దీనిని రెట్రోగ్రేడ్ (గ్రహం చుట్టూ వ్యతిరేక దిశలో తిరగడం) అంటారు. మిగిలిన మూడు ఉపగ్రహాలు శని గ్రహం దిశలోనే (ప్రొగ్రేడ్) తిరుగుతున్నాయి.

ఈ మూడింటిలో రెండు ఉపగ్రహాలు శని చుట్టూ ఒకసారి తిరగడానికి రెండేళ్లు పడుతుంది.

సుదూరంగా ఉన్న ఒక రెట్రోగ్రేడ్ ఉపగ్రహం తన కక్ష్యలో శని చుట్టూ తిరగడానికి మూడేళ్ల సమయం పడుతుంది.

వాషింగ్టన్ డీసీలోని కార్నెగీ ఇన్‌స్టిట్యూషన్ ఫర్ సైన్స్‌ చేసిన ఈ అన్వేషణకు డాక్టర్ స్కాట్ షెఫర్డ్ నేతృత్వం వహించారు. "ఈ ఉపగ్రహాల కక్ష్యలను అధ్యయనం చేయడం వల్ల వాటి ఆవిర్భావం గురించి తెలుసుకోవచ్చు. దానితోపాటు శని గ్రహం ఏర్పడిన సమయంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో కూడా వీటి ద్వారా గుర్తించవచ్చు" అని ఆయన చెప్పారు.

"1990 చివరి నుంచి అత్యధిక చంద్రుళ్లు ఉన్న గ్రహం బృహస్పతే అని శాస్త్రవేత్తలు అనుకుంటూ వచ్చారు" అని డాక్టర్ షెఫర్డ్ బీబీసీతో చెప్పారు.

Image copyright Image copyrightCARNEGIE INSTITUTION FOR SCIENCE

కొత్త ఉపగ్రహాలు ఎలా ఏర్పడ్డాయి?

శని గ్రహానికి ఉన్న ఈ చంద్రుళ్లు మూడు వేరు వేరు సమూహాలుగా కనిపిస్తున్నాయి. గ్రహం కక్ష్య వంపు ఆధారంగా ఈ వర్గీకరణ చేశారు.

రెట్రోగ్రేడ్, ప్రోగ్రేడ్ ఉపగ్రహాలు మూడు పెద్ద గ్రహాలు విరిగి ఏర్పడి ఉంటాయని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఈ పెద్ద గ్రహాలు ఒకదాన్నొకటి గుద్దుకోవడం వల్ల అవి వేరు వేరు చంద్రుళ్లుగా మారి ఉంటాయని, లేదంటే బయట నుంచి వెళ్తున్న వేరే గ్రహశకలాలను అవి ఢీకొని ఉంటాయని చెబుతున్నారు.

కొత్తగా కనుగొన్న వాటిలో ఒక రెట్రోగ్రేడ్ ఉపగ్రహం శనికి అత్యంత దూరంగా తిరిగే చంద్రుడు.

"ఈ చంద్రుళ్లు శని కక్ష్యలో వాలి ఉన్నాయి. అవి చాలా దూరంలో ఉన్నాయి. అందుకే అవి అదే గ్రహం వల్ల ఏర్పడ్డాయని మాకు అనిపించడం లేదు" అని డాక్టర్ షెఫర్డ్ బీబీసీతో అన్నారు.

మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.
Media captionవీడియో: ష్.. సూర్యుడు శబ్దం చేస్తున్నాడు!

తర్వాత అవి శని గురుత్వాకర్షణలోకి వచ్చుంటాయని మాకు అనిపిస్తోంది. ఒక గ్రహశకలం దగ్గరి నుంచి వెళ్తున్నప్పుడు, అది దాన్ని పట్టుకోలేదు. ఎందుకంటే దాని శక్తిని అది చెదరగొట్టలేదు. అని ఆయన చెప్పారు.

"అయితే, సౌరవ్యవస్థలో శని ఏర్పడుతున్న సమయంలో ధూళి, వాయువులు ఒక మేఘం లేదా వలయంలా ఆ గ్రహం చుట్టూ ఏర్పడి ఉంటాయి" అన్నారు.

అందుకే దానికి దగ్గరగా వెళ్లే గ్రహశకలాల శక్తిని అది చెదిరేలా చేయగలిగింది. కానీ ఎక్కువ సందర్భాల్లో ఈ శకలాలు గ్రహానికి చుట్టూ తిరుగుతూ ఉండిపోయాయి. శని గ్రహంలో భాగమయ్యాయి.

"ఈ చంద్రుళ్లు గ్యాస్, ధూళికి తగిలి ఉంటాయి. ఇవి ఆ గ్రహానికి దగ్గరగా వెళ్తున్న తోకచుక్కలు లేదా గ్రహశకలాలు అయ్యుంటాయి" అని షెఫర్డ్ చెప్పారు.

ఎక్కువ గ్రహశకలాలు తిరగడం మొదలెట్టాయి. ఈ గ్రహం నిర్మాణంలో అవి కూడా భాగమయ్యాయి. కానీ గ్యాస్, ధూళి చెల్లాచెదురుగా అవుతున్నప్పుడు ఈ గ్రహశకలాలు దాని చుట్టూ తిరగడం మొదలైందని మేం అనుకుంటున్నాం. అందుకే అవి గ్రహంపై పడ్డానికి బదులు దాని చుట్టూ కక్ష్యలో ఉండిపోయి తిరగడం మొదలుపెట్టాయి. శని గ్రహం దేనితో ఏర్పడిందో ఇవి దాని అవశేషాలు అయ్యుంటాయని మాకు అనిపిస్తోంది.

Image copyright SPL
చిత్రం శీర్షిక సుబారు టెలిస్కోప్

మరిన్ని చంద్రుళ్లు ఉండవచ్చు

ఈ పరిశోధన కోసం 2004 నుంచి 2007 మధ్య క్లిష్టమైన గణాంకాలను విశ్లేషించడానికి ఒక కంప్యూటర్ వ్యవస్థను ఉపయోగించారు. దీనికోసం సుబారూ టెలిస్కోప్ సాయం తీసుకున్నారు.

ఉపగ్రహాలుగా చెప్పిన వాటిని గుర్తించడానికి ఈ గణాంకాలను, పాత గణాంకాలతో పోల్చి చూశారు.

మేం అవి శని చంద్రుళ్లని అనుకున్నాం. కానీ, దానిని ధ్రువీకరించుకునేందుకు మా దగ్గర మొత్తం కక్ష్య గురించి సమాచారం లేదు అని షెపర్డ్ చెప్పారు.

కొత్త కంప్యూటర్ వ్యవస్థ వల్ల మేం ఈ 20 కొత్త గ్రహాలు, వాటి కక్ష్యల వివరాలు తెలుసుకోవడంలో విజయవంతం అయ్యాం.

ఈ శాస్త్రవేత్తల్లో లాస్ ఏంజిలిస్ కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం డేవిడ్ జెవిట్, హవాయి విశ్వవిద్యాలయం జాన్ క్లేయనా కూడా ఉన్నారు.

శని చుట్టూ ఇంకా ఎన్నో చంద్రుళ్లు తిరుగుతూ ఉండచ్చు. కానీ వాటి అన్వేషణకు మరింత పెద్ద టెలిస్కోప్ అవసరం అని ఖగోళ శాస్త్రవేత్తలు అంటున్నారు. ఒక కిలోమీటర్ వ్యాసం ఉన్న గ్రహాలను కూడా గుర్తించగలిగే టెలిస్కోప్ కావాలని చెబుతున్నారు.

శాస్త్రవేత్తల టీమ్ ఈ కొత్త చంద్రుళ్లకు పేర్లు పెట్టడానికి ఒక పోటీ కూడా ప్రారంభించింది. ప్రస్తుతం మూడు సమూహాలకు నార్స్, గాల్లిక్, ఇన్యుట్ అనే పేర్లు పెట్టింది.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు

భారత సైన్యం దాడిలో ‘ఉగ్రవాదులు’, పాక్ సైనికులు మృతి: ఇండియన్ ఆర్మీ చీఫ్ ప్రకటన

తండ్రి శవాన్ని తీసుకెళ్లడానికి నిరాకరిస్తున్న కొడుకులు.. కారణమేంటి

సంతాన నిరోధక మాత్రలు మగాళ్లకు ఎందుకు లేవు

మెట్రో రైలు చార్జీల పెంపుపై నిరసన: చిలీలో హింస.. ముగ్గురి మృతి

‘డియరెస్ట్ మోదీజీ... దక్షిణాది సినీ కళాకారులకు స్థానం లేదా?’ - ఉపాసన కొణిదెల

వాట్సాప్‌పై పన్ను వేసేందుకు లెబనాన్‌లో ప్రయత్నం.. ప్రజాగ్రహంతో వెనక్కు తగ్గిన ప్రభుత్వం

టర్కీ అధ్యక్షుడి హెచ్చరిక: 'కుర్దు ఫైటర్లు ఉత్తర సిరియా నుంచి వెనక్కి వెళ్లకపోతే తలలు చిదిమేస్తాం’

బ్రెగ్జిట్: బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్‌కు ఎదురుదెబ్బ