మహిళ అంగీకారంతో సెక్స్ చేసినా మగాడి మీద 'రేప్' కేసు పెట్టవచ్చా?

  • 16 అక్టోబర్ 2019
కండోమ్ చిత్రం Image copyright Getty Images

ఒక మహిళ తనతో ఇష్టపూర్వకంగానే శృంగారంలో పాల్గొంటే, ఆమెపై అత్యాచారం చేశానంటూ అన్యాయంగా శిక్ష వేశారంటూ బ్రిటన్‌ కోర్టు తీర్పును ఓ వ్యక్తి సవాలు చేస్తున్నారు.

మరి, ఒక పురుషుడు తన భాగస్వామి అంగీకారంతో శృంగారంలో పాల్గొన్నా కూడా, ఏయే సందర్భాలలో అతడు అత్యాచార నేరస్థుడు అయ్యే అవకాశం ఉంటుంది? ఈ కేసులో ఎలాంటి చిక్కుముడులు ఉంటాయి?

యూకేకు చెందిన శాలీకి (పేరు మార్చాం) ఓ డేటింగ్ వెబ్‌సైట్‌ ద్వారా జాసన్ లారెన్స్‌ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. కొన్నాళ్లకు ఆ పరిచయం కాస్తా శారీరక సంబంధంగా మారింది.

అప్పటికే తల్లి అయిన 42 ఏళ్ల శాలీ, మరో సంతానం వద్దనుకున్నారు. అయితే, తాను వాసెక్టమీ (పురుషులకు చేసే కుటుంబ నియంత్రణ ఆపరేషన్ ) చేయించుకున్నానని, తనతో సెక్సులో పాల్గొంటే గర్భం రాదని లారెన్స్‌ ఆమెకు చెప్పాడు.

అతని మాటలు నమ్మి కండోమ్ లేకుండానే అతనితో సెక్సులో పాల్గొనేందుకు శాలీ అంగీకరించారు. కానీ, ఆమె గర్భం దాల్చారు. అతడు అబద్ధం చెప్పాడని ఆమెకు అప్పుడు అర్థమైంది. అతడు సీరియల్ రేపిస్టు అన్న విషయం కూడా తెలిసింది.

Image copyright Derbyshire Police
చిత్రం శీర్షిక శాలీ మీద అత్యాచారం కేసులో తనను దోషిగా పేర్కొంటూ కోర్టు ఇచ్చిన తీర్పును లారెన్స్ సవాల్ చేస్తున్నారు.

వాళ్లు రెండుసార్లు సెక్సులో పాల్గొన్నారు. కాబట్టి, ఆ మహిళపై రెండు సార్లు అత్యాచారానికి పాల్పడ్డాడంటూ లారెన్స్‌ను దోషిగా పేర్కొంటూ న్యాయస్థానం తీర్పు వెలువరించింది.

"వాసెక్టమీ గురించి అబద్ధం చెప్పడం ద్వారా బాధితురాలిని అతడు మోసం చేశాడు" అని ఈ కేసులో లారెన్స్‌కు వ్యతిరేకంగా వాదించిన సీనియర్ స్యూ మాథ్యూస్ అన్నారు.

"ఈ శిక్షను సమర్థిస్తే, చట్టం దృష్టిలో ఇన్నాళ్లూ నేరస్థులుగా పరిగణించబడని అనేక మంది (మగ, ఆడ) తీవ్రమైన లైంగిక నేరాలకు పాల్పడ్డారన్న కేసుల్లో చిక్కుకునే ప్రమాదం ఉంది" అని లారెన్స్ తరఫు న్యాయవాది షాన్ డ్రేకాట్ అంటున్నారు.

లారెన్స్ మాదిరిగా భాగస్వాములకు అబద్ధాలు చెప్పినవారు చాలామందే ఉంటారు. మరి, వాళ్లు కూడా ఇప్పుడు శిక్షను ఎదుర్కోవాల్సి వస్తుందా?

Image copyright Getty Images
చిత్రం శీర్షిక సెక్స్‌ను మరింత ఆహ్లాదకరంగా మార్చాలన్న ఆలోచనే కండోమ్‌లను వాడకపోవడానికి ప్రధాన కారణమని చాలామంది పురుషులు చెబుతారు

కండోమ్ లేకుండా చేస్తే అత్యాచారమేనా?

అరిజోనా స్టేట్ యూనివర్శిటీలో అసోసియేట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న కెల్లీ డేవిస్... కండోమ్‌ల వాడకం విషయంలో ఎంతమంది మోసపోతున్నారు? లేదా మోసం చేస్తున్నారు? అన్నది అంచనా వేసేందుకు 21-30 ఏళ్ల వయసు స్త్రీ, పురుషులను సర్వే చేశారు.

ఈ సర్వేలో పాల్గొన్న 313 మంది పురుషులలో, 23.4% మంది తాము 14 ఏళ్ల వయసు నుంచి కనీసం ఒక్కసారైనా భాగస్వామిని "మోసం" చేశామని అంగీకరించారు.

తమ భాగస్వాములకు నమ్మించేందుకు ఎలాంటి అబద్ధాలను ఎక్కువగా చెబుతారన్న విషయాలు కూడా ఈ సర్వేలో తెలిశాయి.

19.9 శాతం మంది కండోమ్ లేకుండా సెక్సులో పాల్గొని, స్ఖలనానికి ముందు సెక్సును విరమించుకుంటామని అబద్ధం చెప్పి భాగస్వామిని మోసం చేస్తారు. తమకు ఎలాంటి సుఖ వ్యాధులు లేవని పరీక్షల్లో తేలిందని 9.6 శాతం మంది అబద్ధం చెబుతారని ఈ సర్వేలో తేలింది.

సర్వేలో పాల్గొన్న 530 మంది మహిళల్లో 6.6 శాతం మంది తాము 14 ఏళ్ల వయసు నుంచి కనీసం ఒక్కసారైనా భాగస్వాములను మోసం చేశామని అంగీకరించారు. ఎక్కువగా కుటుంబ నియంత్రణ పాటిస్తున్నామని తాము అబద్ధం చెబుతామని తెలిపారు.

కొందరు ముందుగా కండోమ్ ధరిస్తారు కానీ, సరిగ్గా సెక్సు మొదలుపెట్టే సమయానికి లేదా మధ్యలో దానిని తొలగించేస్తారు. ఈ సర్వేలో పాల్గొన్న 626 మంది 21- 30 ఏళ్ల వయసు పురుషుల్లో దాదాపు 10 శాతం మంది తాము 14 ఏళ్ల వయసు నుంచి కనీసం ఒక్కసారి అయినా అలా చేసి ఉంటామని చెప్పారు.

"ఈ విషయం తెలిసి షాకయ్యాం. వాళ్లు ఒక్కసారే కాదు, అనేకమార్లు అలాగే తమ భాగస్వాములను మోసం చేస్తున్నారు. నమ్మక ద్రోహం చేస్తున్నారు. ఇది ఆందోళనకరమైన విషయం" అని డాక్టర్ డేవిస్ అన్నారు.

12 శాతం మంది మహిళలు ఇలా మోసపోయామని చెప్పారు. కొందరు తాము మోసపోయామన్న విషయాన్ని ఎప్పుడూ గ్రహించలేదని తెలిపారు.

చాలామంది ఇలా సెక్సు మధ్యలో కండోమ్‌ను తొలగించి నమ్మకద్రోహానికి పాల్పడటాన్ని రేప్‌గా భావించడంలేదు. కానీ, యూకే చట్టం ప్రకారం, అలా చేయడం నేరమని లైంగిక నేరాల కేసులను వాదించడంలో అనుభవం ఉన్న శాండ్రా పాల్ చెప్పారు.

వికీలీక్స్ వ్యవస్థాపకుడు జూలియన్ అసాంజే‌పై నమోదైన అత్యాచార ఆరోపణల కేసులో న్యాయమూర్తులు ఇచ్చిన తీర్పు ప్రకారం, కండోమ్‌‌తో కూడిన సెక్సుకు మాత్రమే అంగీకారం తెలిపిన మహిళతో, కండోమ్ లేకుండా సెక్సు చేయడం యూకేలో నేరం అవుతుంది.

Image copyright Getty Images

మధ్యలో మాట తప్పితే?

స్ఖలనం అయ్యే ముందు సెక్సును విరమించుకుంటానని అబద్ధం చెప్పి భాగస్వామిని మోసం చేయడం అత్యాచారం కిందకు వస్తుందని 'రేప్ క్రైసిస్' సంస్థ ప్రతినిధి కేటీ రస్సెల్ అన్నారు.

అలాంటి కేసును ఇప్పటికే యూకే కోర్టు విచారణకు స్వీకరించింది. ఈ కేసులో ఫిర్యాదు చేసింది భార్య కావడం విశేషం.

"మరో బిడ్డను కనేందుకు ఆమెకు ఇష్టం లేదు. స్ఖలనం అవడానికి ముందే సెక్సును ఉపసంహరించుకోవాలని ఆమె తన భర్తకు షరతు పెట్టింది. అతడు అందుకు అంగీకరించాడు. కానీ, అలా చేయలేదు. దాంతో వారి వివాదం కోర్టు దాకా వెళ్లింది. కిందిస్థాయి కోర్టు భర్తను దోషిగా పరిగణించలేదు. దాంతో భార్య ఎగువ కోర్టుకు వెళ్లారు. ప్రస్తుతం ఆ కేసు పరిశీలన కోసం మళ్లీ దిగువ కోర్టుకు వెళ్లింది" అని పాల్ చెప్పారు.

ఈ కేసులో భర్తను దోషిగా తేల్చారా? అన్న విషయాన్ని నిర్ధరించుకునేందుకు సదరు కోర్టును బీబీసీ సంప్రదించగా, అటువైపు నుంచి ఎలాంటి సమాచారం రాలేదు.

సుఖ వ్యాధుల టెస్ట్ గురించి అబద్ధాలు చెబితే?

ఎస్టీఐ (లైంగిక సంక్రమణ వ్యాధుల) పరీక్షలు చేయించుకోవడం గురించి అబద్ధాలు చెబితే అది మరింత తప్పు అవుతుందని పాల్ అభిప్రాయపడ్డారు.

హెచ్ఐవీ ఉండి, తమ భాగస్వాములకు అది సంక్రమించేలా చేసిన చాలా మంది పురుషులపై ఇప్పటికే కేసులు నమోదయ్యాయి. అయితే, లైంగిక నేరాలకు బదులు వారిపై తీవ్రమైన శారీరక హాని కలిగించినట్లుగా ఆరోపణలు నమోదు చేశారు.

Image copyright Getty Images

గర్భనిరోధక మాత్రలు వేసుకుంటున్నట్లు అబద్ధం చెబితే

లారెన్స్ డిఫెన్స్ లాయర్ డేవిడ్ ఎమాన్యుయెల్ క్యూసీ ఆయన వాసెక్టమీ చేయించుకున్నానని ఒక మహిళకు అబద్ధం చెప్పడాన్ని, ఒక మహిళ గర్భనిరోధక మాత్రలు తీసుకుంటున్నానని అబద్ధం చెప్పడంతో పోల్చారు. తనకు పిల్లలు పుట్టరనే అబద్ధంతో లారెన్స్ చేసింది నేరమే అయితే.. అదే పని చేసిన ఆ మహిళ కూడా లైంగిక నేరం చేసినట్లు భావించాలని వాదించారు.

ఇంగ్లండ్, వేల్స్‌లో ప్రస్తుత చట్టాల ప్రకారం ఒక పురుషుడిపై అత్యాచారం చేసిందని ఒక మహిళను విచారించడం సాధ్యం కాదు. ఎందుకంటే సెక్సువల్ అఫెన్స్ యాక్ట్ 2003 ప్రకారం పురుషాంగాన్ని చొప్పించడాన్నే నేరంగా భావిస్తారు.

స్కాట్లాండ్, నార్తర్న్ ఐలాండ్ చట్టాల్లో అత్యాచారం పురుషాంగంతోనే చేస్తారని పేర్కొన్నారు.

కానీ, వేసక్టమీ- కాంట్రసెప్టివ్ పిల్స్ పోల్చడంలో రసెల్ ఒక సమస్య ఎదుర్కున్నారు.

గర్భనిరోధక మాత్రలు వాడినా, గర్భం దాల్చినా సమస్య మహిళలకే ఉంటుంది. అలాంటి అబద్ధం చెప్పడం వల్ల ఆ ప్రభావం ఆమె జీవితం, ఆరోగ్యంపై పడుతుంది.

దానికీ, దీనికీ అసలు పోలికనేదే లేదు.. ఎందుకంటే గర్భం కావాలి, వద్దు అనే పరిణామాలను ఆ మహిళే ఎదుర్కోవాల్సి ఉంటుంది. పురుషులపై ప్రభావాలను మనం దానితో పోల్చలేం.

"ఇక్కడ సమస్యేంటంటే, ఆ అబద్ధం వారి మధ్య సమ్మతిని ఏ స్థాయిలో నాశనం చేస్తుంది అనేదే" అని ఆమె చెప్పారు.

ఇలాంటి పరిస్థితుల్లో ఒక పురుషుడు తనను ఒక బిడ్డకు తండ్రిగా గుర్తిస్తే, దాన్నుంచి అన్ని రకాల పరిణామాలూ ఎదురవుతాయి.

"అక్కడ డబుల్ స్టాండర్డ్ ఉందని కూడా వాదించవచ్చు. జీవితంలో చాలా విషయాల్లో మనం పురుషుల్లాగే అదే స్థాయి గౌరవం, సమానత్వం సాధించాం. అలాగే, అబద్ధాల వల్ల జరిగే నేరాల బాధ్యతను కూడా వారితో సమంగా పంచుకోవాలి. మనం మహిళలం కాబట్టి మనల్ని పూర్తిగా సురక్షితంగా ఉండేలా చేసుకోవడం అనేది సమస్య అవుతుందని నాకు అనిపిస్తోంది" అన్నారు.

Image copyright Getty Images

లింగం గురించి ఎవరైనా అబద్ధం చెబితే

కొన్ని కేసుల్లో ఒక మహిళ ఇతర మహిళతో లైంగిక చర్యల కోసం పురుషుల్లా నటించిన ఘటనలు కూడా జరిగాయి. లేదా పురుషులుగా లింగ మార్పిడి చేయించుకున్న వారు దాని గురించి తమ మహిళా భాగస్వాములకు చెప్పలేదు. ఇలాంటి కేసులు చాలా వెలుగు చూశాయి.

ఇలాంటి ఎక్కువ కేసుల్లో పురుషాంగంలా ఉండే టాయ్స్ ఉపయోగించారు. అత్యాచారం అనేది పురుషాంగాన్ని చొప్పించడం వల్లే జరుగుతుంది కాబట్టి.. వాటిని చొప్పించడాన్ని కూడా లైంగిక దాడిగానే ఆరోపించారు. గేల్ న్యూలాండ్ అనే మహిళ తనను పురుషుడుగా చెప్పుకుని తన లైంగిక భాగస్వామి కళ్లకు గంతలు కట్టి సెక్స్ టాయ్ ద్వారా ఆమెతో సెక్స్ చేసేవారు. దీనిని నేరంగానే పరిగణించారు.

అయితే ఇలాంటి కేసులను కొన్నిసార్లు 'జెండర్ ఫ్రాడ్'( లింగం గురించి మోసం చేయడం) చెప్పారు. ఇలాంటి కేసులు లింగ అసౌకర్యం కలిగిన వారి హక్కుల గురించి, లింగమార్పిడి చేయించుకున్న వారు భాగస్వాములకు తమ గురించి చెప్పాలా, వద్దా అనే దానిపై ప్రశ్నలు లేవనెత్తాయి.

లైంగిక మోసం ఆరోపణలపై విచారణ ఎదుర్కున్న ఎక్కువ మంది విరుద్ధ లింగం వారుగానే కనిపించారు.

"అంటే అక్కడ వారు ప్రత్యేకమైన వ్యక్తులుగా బయటపడడం లేదా విచారణ ఎదుర్కునే నేరాలకు పాల్పడడం చేశారు" అని ఆమె చెప్పారు. "పురుషుడుగా మారిన ఒక వ్యక్తి తన మహిళా భాగస్వామితో పురుషుడిలా వ్యవహరిస్తే, అది ఆమెను మోసం చేస్తున్నట్టు కాదు, ఎందుకంటే అతడు పురుషుడే" అని ప్రొఫెసర్ షార్ప్ చెప్పారు.

Image copyright Getty Images

మిగతా అబద్ధాల సంగతేంటి?

లైంగిక సంబంధాల కోసం ఎంతోమంది ఎన్నో రకాల అబద్ధాలు చెబుతారు. అంటే వయసు తప్పు చెప్పడం, వివాహితుడైనా ఒంటరిగా ఉన్నానని చెప్పడం, లేదా బాగా డబ్బుందని చెప్పుకోవడం లాంటివి. అయినా, ఇలాంటి కేసులు కోర్టు వరకూ చేరవు.

కొందరు అండర్ కవర్ పోలీస్ అధికారులకు చాలా మంది మహిళలు లైంగిక సంబంధాలు ఉండేవి. ఈ మహిళల్లో ఒకరు "అధికారుల బృందం తమపై అత్యాచారానికి కుట్ర పన్నిందని" ఆరోపించారు. ఎందుకంటే అక్కడ వారి నుంచి స్పష్టమైన సమ్మతి లేదని అధికారులకు తెలుసు.

పోలీసులు కొంతమంది మహిళలకు పరిహారం ఇవ్వాల్సి వచ్చింది. అయితే అధికారులపై కేసుల నమోదు చేయడానికి కోర్టు నిరాకరించింది. "ఈ కేసు పరిస్థితులను బట్టి, అది ఏ మోసమైనా సమ్మతిని పాడు చేయడం కాదు" అన్నారు.

అబద్ధాలు సమ్మతిని నిరాకరిస్తాయి అనే అంశంలో మరిన్ని మార్గదర్శకాలు అవసరం అని పాల్ భావిస్తున్నారు. ఇప్పుడు లారెన్స్ నేరారోపణలను సవాలు చేస్తుండడంతో, అవి కోర్టు నుంచి తీర్పు రూపంలో వస్తాయనే ఆశిస్తున్నాం అన్నారు.

"చివరికి దీనికి చట్టం అవసరం కావచ్చు" అని ఆమె చెప్పారు. "మీరు చెప్పినపుడు కండోమ్ వేసుకోవడంలో విఫలమైతే, మీరు చట్ట ప్రకారం అలా చేయచ్చు. కానీ ఒక వ్యక్తి చాలాసార్లు తన వయసు గురించి అభద్ధాలు చెబితే అప్పుడు, అది సాధ్యం కాకపోవచ్చు" అన్నారు.

నిర్దిష్ట చట్టం లేనపుడు, ఈ మధ్యలో ఉన్న వాటి గురించి ఎవరు నిబంధనలు రూపొందిస్తారు. న్యాయమూర్తులు ఈ నిర్ణయాలను ఎలా నావిగేట్ చేస్తారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

సంబంధిత అంశాలు

ముఖ్యమైన కథనాలు

ట్రంప్ పదవి ఊడుతుందా.. అసలు అభిశంసన అంటే ఏంటి

‘అయోధ్య తీర్పులో స్పష్టంగా చెప్పారు, రామ జన్మస్థలం మసీదు కిందే ఉంది’ - సి.ఎస్.వైద్యనాథన్

World Kindness Day: ఇతరుల పట్ల ప్రేమ, దయ చూపితే ఎక్కువ కాలం జీవిస్తారు ఎందుకు

అయోధ్య తీర్పు: ‘తప్పు చేసిన దోషికే బహుమతి ఇచ్చారు’ - జస్టిస్ లిబర్హాన్ కమిషన్ న్యాయవాది అనుపమ్ గుప్తా

ట్రంప్‌పై పోటీచేయాలనే ఒత్తిడి వస్తోంది: హిల్లరీ క్లింటన్

ఆర్టీఐ పరిధిలోకి సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి కార్యాలయం

సాంబార్ సరస్సు తీరంలో వెయ్యికి పైగా పక్షుల మృతికి కారణాలేమిటి

తాలిబన్ల వద్ద బందీలైన ప్రొఫెసర్ల విడుదలకు మిలిటెంట్లను విడిచిపెట్టనున్న అఫ్గానిస్తాన్