రోహిత్ శర్మ : టెస్టుల్లో తొలి డబుల్ సెంచరీ సాధించిన హిట్ మ్యాన్.. భారత్ 497/9, దక్షిణాఫ్రికా 9/2

  • 20 అక్టోబర్ 2019
రోహిత్ శర్మ Image copyright AFP/GETTY IMAGES

భారత క్రికెటర్ రోహిత్ శర్మ తన టెస్టు కెరీర్‌లో తొలి డబుల్ సెంచరీ సాధించాడు. అంతేకాకుండా, దక్షిణాఫ్రికాతో ఒక టెస్ట్ సిరీస్‌లో 500లకు పైగా పరుగులు సాధించిన తొలి భారత క్రికెటర్‌గా కూడా రికార్డ్ నమోదు చేశాడు.

భారత్, దక్షిణాఫ్రికా మధ్య జరుగుతున్న టెస్టు సిరీస్‌ చివరి మ్యాచ్‌లో తొలి రోజు శతకం కొట్టిన అతడు.. రెండో రోజైన ఆదివారం అదే జోరును కొనసాగిస్తూ 212 పరుగులు చేశాడు.

ఈ సిరీస్‌తోనే రోహిత్ టెస్టుల్లో ఓపెనర్‌గా మారాడు. తొలి మ్యాచ్‌లో రెండు సెంచరీలు (176, 127) కొట్టి.. భారత్ విజయంలో కీలకపాత్ర పోషించాడు.

రెండో మ్యాచ్‌లో 14 పరుగులకే ఔటైనా, మూడో మ్యాచ్‌లో మళ్లీ విజృంభించాడు.

భారత జట్టు 224/3 ఓవర్‌నైట్ స్కోరుతో ఆదివారం ఆట ప్రారంభించింది.

117 పరుగులతో బ్యాటింగ్ కొనసాగించిన రోహిత్, అజింక్య రహానే (115) ధాటిగా ఆడుతూ నాలుగో వికెట్‌కు మొత్తంగా 267 పరుగులు జోడించారు.

జట్టు స్కోరును 300 దాటిన తర్వాత కొద్దిసేపటికే రహానే ఔటయ్యాడు. అతడి స్థానంలో రవీంద్ర జడేజా వచ్చాడు.

లంచ్ విరామ సమయానికి 199 పరుగులకు చేరుకున్న రోహిత్.. విరామం తర్వాత ఎంగిడి బౌలింగ్‌లో ఓ సిక్సర్ బాది ద్విశతకం పూర్తి చేసుకున్నాడు.

అయితే, ఆ తర్వాతి ఓవర్‌లోనే (88.1) రబాడా బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించి ఎంగిడికి క్యాచ్ ఇచ్చాడు.

అతడు ఔటయ్యే సమయానికి భారత్ స్కోరు 370-5.

తన ఇన్నింగ్స్‌లో రోహిత్ మొత్తం 28 ఫోర్లు, 6 సిక్సర్లు బాదాడు.

వన్డేల్లో రోహిత్ పేరిటే అత్యధిక డబుల్ సెంచరీల రికార్డు ఉంది. పరిమిత ఓవర్లలో అతడు మూడు ద్విశతకాలు సాధించాడు.

రోహిత్ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన సాహా (24) ఎక్కువ సేపేమీ నిలబడలేదు.

జట్టు స్కోరు 417 పరుగులుండగా లిండే అతడిని బౌల్డ్ చేశాడు.

భారత్ 9 వికెట్ల నష్టానికి 497 పరుగులు చేసి డిక్లేర్ చేసింది.

అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన దక్షిణాఫ్రికా రెండో రోజు ఆట ముగిసే సమయానికి రెండు వికెట్లు కోల్పోయి 9 పరుగులు చేసింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.

ఈ కథనం గురించి మరింత సమాచారం

ముఖ్యమైన కథనాలు

పౌరసత్వ సవరణ బిల్లు: భారతదేశ కొత్త 'ముస్లిం వ్యతిరేక' చట్టం మీద ఆందోళనలు ఎందుకు

సీరియల్ రేపిస్టుకు 33 యావజ్జీవ శిక్షలు

మిస్ యూనివర్స్ 2019 జోజిబిని తుంజీ: ఫైనల్ రౌండ్‌ ప్రశ్న, సమాధానం ఏంటి

రష్యా సైన్యం కోసం హస్కీ శునకాలకు ప్రత్యేక శిక్షణ

'అతడి నీడ పడిన చోట మృత్యువు కాటేస్తుంది'.. బాలీవుడ్ సినిమాపై పొరుగు దేశంలో ఆగ్రహం

వీడియో: న్యూజీలాండ్‌లో పేలిన అగ్నిపర్వతం.. ‘గల్లంతైనవారు బతికే ఉన్నారనేందుకు ఎలాంటి సంకేతాలు లేవు’

పౌరసత్వ సవరణ బిల్లు: అస్సాం ఎందుకు రగులుతోంది.. ప్రజల్లో భయం దేనికి

హైదరాబాద్ ఎన్‌కౌంటర్ మృతుల్లో ఇద్దరు మైనర్లని చెప్తున్న 'బోనఫైడ్' సర్టిఫికెట్లు.. ఎన్‌హెచ్‌ఆర్సీకి అందించిన కుటుంబ సభ్యులు