#100Women: 'పోర్న్‌ను పురుషులే కాదు, మహిళలూ ఎంజాయ్ చేసేలా చేయాలి': దర్శకురాలు ఎరిక్ లస్ట్

  • 23 అక్టోబర్ 2019
ఎరికా లస్ట్ Image copyright Erika
చిత్రం శీర్షిక ఎరికా లస్ట్

"మహిళలకూ సెక్స్ అవసరమే. వాళ్లు కూడా సెక్స్ కోరికలు ఉండే మనుషులే" అని అంటున్నారు ప్రముఖ పోర్న్ చిత్రాల దర్శకురాలు ఎరికా లస్ట్.

ఆమె సొంతంగా ఓ ప్రొడక్షన్ సంస్థను నడుపుతున్నారు.

"మనం ఈ భూమి మీద ఉన్నామంటే కారణం సెక్స్" అని ఎరికా అంటున్నారు.

"పురుషుల మాదిరిగానే మహిళలు కూడా పోర్న్‌ను ఆస్వాదించాలని కోరుకుంటారు. కానీ, పోర్న్ చిత్రాలను చాలావరకు పురుషులే తీస్తారు. వాళ్లు మహిళల అభిరుచులను ఏమాత్రం పట్టించుకోరు" అని ఆమె అన్నారు.

"మనం ఇన్నాళ్లూ చూసిన పోర్న్‌కు భిన్నంగా ఉండే ప్రత్యామ్నాయ చిత్రాలు తీసేందుకు నేను ప్రయత్నిస్తున్నాను" అని ఆమె చెప్పారు.

ప్రపంచంలోనే అతిపెద్ద పోర్న్ వెబ్‌సైట్ పోర్న్‌హబ్‌లో వీడియోల కోసం ప్రతి సెకనుకు 1,000 మందికి పైగా శోధిస్తున్నారు (పోర్న్‌హబ్ 2018 రివ్యూ డేటా ప్రకారం).

అయితే, ఇంటర్నెట్‌లో దొరికే పోర్న్ వీడియోలలో మహిళ ఆనందాన్ని, గౌరవాన్ని ఏమాత్రం పట్టించుకోకుండా పురుషుడు సుఖాన్ని పొందుతున్నవే ఎక్కువగా ఉంటాయి.

"ఏ పోర్న్ వెబ్‌సైట్ చూసినా, మహిళలను అత్యంత హీనంగా చూపిస్తూ, కించపరిచే విధంగా, వావివరుసలు లేకుండా శీర్షికలు పెడుతుంటారు. వాటిని సెక్స్ అంటామా? అలాంటి వాటికి అడ్డుకట్ట వేయాలి" అని ఎరికా లస్ట్ అంటున్నారు.

"ఆ వెబ్‌సైట్లలో ఉండే చాలా పోర్న్‌ వీడియోలలో స్త్రీ, పరుషులు ఇద్దరూ సెక్సును ఆస్వాదిస్తున్నట్లుగా ఉండదు. నేను తీసే చిత్రాలలో ఇద్దరూ సెక్స్‌ను ఒకే విధంగా ఆనందించడాన్ని చూపించేందుకు ప్రయత్నిస్తున్నాను" అని ఆమె చెప్పారు.

Image copyright Erika Lust Productions
చిత్రం శీర్షిక మహిళల అనుభూతిని ప్రతిబింబించేలా పోర్న్ ఉండాలని దర్శకురాలు ఎరికా లస్ట్ అంటున్నారు

సెక్స్ అంటే, ఇద్దరు కలిసిపోయి, ఆ సమయాన్ని ఇద్దరూ ఆస్వాదించేలా ఉండాలని ఆమె అభిప్రాయపడ్డారు.

ఎరికా అభిప్రాయంతో 'మోర్ ఆర్గాసమ్స్ ప్లీజ్' అనే పుస్తక సహ రచయిత, ది హాట్‌ బెడ్ పాడ్‌కాస్ట్ వ్యాఖ్యాత లీసా విలియమ్స్ కూడా ఏకీభవిస్తున్నారు.

"ప్రస్తుతం ఆన్‌లైన్‌లో దొరికే పోర్న్ చిత్రాలు మహిళల అనుభూతిని ప్రతిబింబించేలా ఉండటం లేదని మా పాఠకులు, శ్రోతలు చెబుతుంటారు. మహిళల ఆనందాన్ని, కోరికలను పట్టించుకోకుండా చేసేది సెక్స్ ఎలా అవుతుంది? అని అడుగుతుంటారు" అని లీసా తెలిపారు.

ప్రధాన స్రవంతి ఆన్‌లైన్ పోర్న్ సైట్లు ఇప్పటికీ పాతకాలపు ఆలోచనలకే పరిమితమయ్యాయని అనిపిస్తోందని ఆమె అన్నారు.

Image copyright Instagram / @cecile_hoodie

ఇన్‌స్టాగ్రామ్‌లో నిషేధం

ఎరికా తన పోర్న్ చిత్రాలను ప్రమోట్ చేసుకునేందుకు సోషల్ మీడియాను వినియోగిస్తారు.

అయితే, తన పోస్టులను సోషల్ మీడియా సంస్థలు పక్షపాత వైఖరితో 'షాడో బ్యాన్' చేస్తున్నాయని ఆమె ఆరోపించారు. తాను పోస్టు చేసిన ఫొటోలతో పాటు, తనలాంటి ఆలోచనలు ఉన్న ఇతరుల పోస్టులనూ ఆ సంస్థలు సెన్సార్ చేస్తున్నాయని ఎరికా అన్నారు.

పోస్టులతో పాటు ఖాతా మీద కూడా ఇన్‌స్టాగ్రామ్ 'షాడో బ్యాన్' విధించిందని ఆమె అంటున్నారు. 'అశ్లీల సమాచారం' ఉన్న పోస్టులు, ఖాతాలపై 'షాడో బ్యాన్' విధిస్తారు. ఆ నిషేధం ఉన్న వారి పోస్టులు, ఖాతా వివరాలు తమ ఫాలోవర్లకు మాత్రమే కనిపిస్తాయి, ఇతరులకు కనిపించవు.

దీనిపై ఎరికా ఫిర్యాదు చేయడంతో, అలాంటి ఆరోపణలతోనే మరికొంతమంది కూడా వచ్చారు.

అయితే, 'షాడో బ్యానింగ్' అనే పరిభాషనే తాము వాడట్లేదని, తమ నిబంధనలకు విరుద్ధంగా ఉండే పోస్టుల మీద తప్పకుండా చర్యలు తీసుకుంటామని ఇన్‌స్టాగ్రామ్ బీబీసీతో చెప్పింది.

తమ నిర్ణయం మీద సదరు ఖాతాదారులకు ఏవైనా అభ్యంతరాలు ఉంటే, అప్పీల్ చేసుకునే వీలు కల్పిస్తున్నామని చెప్పింది.

చిత్రం శీర్షిక ఎరికా లస్ట్

ప్రధానంగా లైంగిక అవగాహన కల్పించే ఉద్దేశంతో ప్రారంభించిన తన ఖాతా @దిహాట్‌బెడ్‌కలెక్టివ్ మీద కూడా 'షాడో బ్యాన్' ప్రభావం ఉందని లీసా విలియమ్స్ అంటున్నారు.

"నిబంధనలకు విరుద్ధమైన సమాచారం ఏమీ లేకున్నా మా పోస్టుల మీద ఫిర్యాదులు వచ్చాయి. కొన్నింటిని తొలగించారు. ఓసారి మహిళల హస్తప్రయోగం మీద ఒక ఇలస్ట్రేషన్ షేర్ చేశాం. దానిని చూస్తుండగానే అప్పటికప్పుడే తొలగించారు" అని లీసా చెప్పారు.

ఆ సంస్థలు ద్వంద్వ వైఖరితో వ్యవహరిస్తున్నట్లు అనిపిస్తోందని ఆమె అన్నారు.

తాము చేసే పోస్టులను సెన్సార్ చేసినట్లుగా, మహిళలను హీనంగా చూపించే ప్రధాన స్రవంతి పోర్న్‌ను ప్రమోట్ చేసే చిత్రాలను సెన్సార్ చేయడం లేదని ఎరికా ఆరోపిస్తున్నారు.

చిత్రం శీర్షిక ఎరికా తీసిన చిత్రాలలో హైదీ నటించారు

సెక్స్ పట్ల అవగాహన ఎలా?

మహిళల్లో మూడింట ఒకవంతు మంది పోర్న్ చూడటం ద్వారా సెక్స్ గురించి అవగాహన పొందుతున్నామని చెప్పారు (బీబీసీ సర్వే 2019, యూకే డేటా ప్రకారం).

పురుషుల్లో 53 శాతం మంది పోర్న్ ద్వారా సెక్స్ గురించి అవగాహన పొందుతున్నామని చెప్పారు (ఎన్‌ఎస్పీసీసీ సర్వే 2017, యూకే డేటా).

"సమాజంలో సెక్స్ గురించి అవగాహన చాలా తక్కువగా ఉంది. కాబట్టి, సహజంగానే యువత పోర్న్ వైపు వెళ్తారు. వాళ్లు సెక్స్ గురించి తెలుసుకోవాలన్న కుతూహలంతో ఉంటారు. సెక్స్‌ను అర్థం చేసుకోవాలని అనుకుంటారు. కాబట్టి, పోర్న్ చూస్తారు. కానీ, ప్రస్తుతం ఆన్‌లైన్‌లో 'నైతికత'తో కూడిన పోర్న్ అంత సులువుగా దొరకడం లేదు. అలాంటి పోర్న్ కోసం కొన్నిసార్లు డబ్బులు చెల్లించాల్సి వస్తోంది" అని లీసా అన్నారు.

నేను 13, 14 ఏళ్ల వయసు నుంచి సెక్స్ గురించి తెలుసుకోవడం ప్రారంభించాను. అందుకు నాకు ఇంటర్నెట్ ఉపయోగపడింది. పోర్న్ ‌ప్రభావానికి గురవుతున్న తొలితరం మాదేనేమో అనుకున్నాను. కానీ, ఇప్పుడు యువతరమే కాదు, అందరి మీదా పోర్న్ ప్రభావం ఉంటోంది" అని ఎరికా తీసిన కొన్ని పోర్న్ చిత్రాలలో నటించిన హైదీ చెప్పారు.

"మహిళలకూ సెక్స్ కోరికలు ఉంటాయి. వాళ్లూ సెక్సును చూస్తూ ఆనందిస్తారు" అని హైదీ అన్నారు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు

ఆంధ్రప్రదేశ్: ఈఎస్ఐ కార్పొరేషన్‌లో అక్రమాలు జరిగాయన్న విజిలెన్స్.. అచ్చెన్నాయుడు పాత్ర ఎంత

‘మత స్వేచ్ఛ మాకు ముఖ్యం... ట్రంప్ ఈ అంశాన్ని లేవనెత్తుతారు’

‘‘పొట్టిగా ఉన్నానని స్కూల్లో ఏడిపిస్తున్నారు.. నాకు చచ్చిపోవాలనిపిస్తోంది’’ అంటూ బాధపడ్డ బాలుడికి అండగా నిలిచిన ప్రపంచం

మానసి జోషి: BBC Indian Sportswoman of the Year నామినీ

200 ఏళ్ల నాటి ఈస్టిండియా కంపెనీ పెయింటింగ్స్‌.. భారత్‌కు నచ్చలేదు, బ్రిటన్‌ ఇబ్బంది పడింది ఎందుకు

పోలవరం గ్రౌండ్‌ రిపోర్ట్: జగన్ ప్రభుత్వంలో ప్రాజెక్టు పనులు ఎలా జరుగుతున్నాయి

ప్రెస్ రివ్యూ: 'ఏపీలో దొరకని మందు.. తెలంగాణకు కాసుల విందు'

మహిళా క్రికెట్ ప్రపంచ కప్: తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియాను ఓడించిన భారత్