Tik Tok డేటాను చైనా ప్రభుత్వం సేకరిస్తోందా? వీడియో కంటెంట్‌లోనూ జోక్యం చేసుకుంటోందా? యాజమాన్యం ఏమంటోంది?

ఫొటో సోర్స్, Getty Images
తమ వీడియో షేరింగ్ యాప్‌లోని సమాచారంపై చైనా ప్రభుత్వం జోక్యం చేసుకుంటుందనే వాదనలను టిక్ టాక్ తోసిపుచ్చింది.
చైనా కారణంగా తమ యాప్‌లోని కంటెంట్‌ను తొలగించమని బీజింగ్ కేంద్రంగా పనిచేసే బైట్‌డ్యాన్స్ యాజమాన్యంలోని ఈ వీడియో షేరింగ్ యాప్ తెలిపింది.
బీజింగ్ ప్రభుత్వం యాప్ డేటాను సేకరించడం, యాప్‌లోని సమాచారంపై ఆంక్షలు విధించడం చేస్తుందని అమెరికా చట్టసభ సభ్యులు ఆందోళన వ్యక్తం చేయడంపై టిక్ టాక్ యాజమాన్యం స్పందించింది.
''మేం చాలా స్పష్టంగా ఉన్నాం. చైనాతో ఉన్న సున్నితత్వం కారణంగా టిక్‌టాక్ తన కంటెంట్‌ను తొలగించదు. చైనా ప్రభుత్వం ఏ కంటెంట్‌ను తొలగించమని మమ్మల్ని ఎప్పుడూ అడగలేదు. అడిగినా మేం అలా చేయం'' అని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది.
''చైనా ప్రభుత్వంతో సహా ఏ విదేశీ ప్రభుత్వం మాపై ప్రభావం చూపదు. టిక్‌టాక్ చైనాలో పనిచేయదు, భవిష్యత్తులో అలా చేయాలనే ఉద్దేశం కూడా మాకు లేదు'' అని అది పేర్కొంది.
ఫొటో సోర్స్, Getty Images
ఈ సంస్థ చైనాలో టిక్ టాక్ తరహాలోనే డౌయిన్ పేరుతో ఒక యాప్‌ను నడపుతోంది.
అమెరికా యూజర్ల డేటా అంతా అమెరికాలోనే భద్రపరిచి ఉంటుందని, సింగపూర్‌లో దీనికి బ్యాకప్ ఉందని టిక్‌టాక్ తెలిపింది.
''మా డేటా కేంద్రాలు పూర్తిగా చైనా బయటే ఉన్నాయి. మా డేటా ఏదీ చైనా చట్టానికి లోబడి ఉండదు'' అని పేర్కొంది.
వేగంగా వృద్ధి చెందుతున్న ఈ సోషల్ మీడియా యాప్‌ను ఇప్పటికే సుమారు 50 కోట్ల మంది డౌన్లోడ్ చేసుకున్నారు. అయితే టిక్‌టాక్ తన యూజర్ల సంఖ్యను ఇప్పటి వరకు వెల్లడించలేదు. ఈ యాప్ ప్లే స్టోర్‌లో 100 కోట్ల కంటే ఎక్కువ సార్లు డౌన్లోడ్ చేశారని అంచనా.
ఫొటో సోర్స్, Getty Images
భద్రతపై ఆందోళనలు
టిక్‌టాక్‌తో సహా ఇతర చైనా కంటెంట్ ప్లాట్‌ఫాంలతో జాతీయ భద్రతకు కలిగే ముప్పుపై అంచనా వేయాలని అమెరికా సెనెటర్స్ టిమ్ కాటన్, చంక్ షుమెర్ ఆ దేశ ఇంటెలిజెన్స్ అధికారులను కోరారు.
టిక్ టాక్ వల్ల జాతీయ భద్రత, సైబర్ సెక్యూరిటీకి ప్రమాదాల జరగొచ్చనే ఆందోళన పెరగడంతో ఇంటెలిజెన్స్‌ను దీనిపై అంచనా వేయాలని కోరినట్లు సెనెటర్లు తెలిపారు.
''ఒక్క అమెరికాలోనే కోటి 10 లక్షల డౌన్లోడ్లు ఉన్నందున, టిక్‌టాక్ అనేది మనం విస్మరించలేని కౌంటర్ ఇంటెలిజెన్స్ ముప్పు'' అని వారు చెప్పారు.
సెన్సార్ షిప్‌కు సంబంధించి ఇటీవల ఫేస్బుక్ అధినేత మార్క్ జుకెర్‌బర్గ్ కూడా టిక్‌టాక్‌పై విమర్శలు చేశారు.
మ్యూజికల్లీ యాప్‌ను బైట్‌డ్యాన్స్ స్వాధీనం చేసుకోవడంపై సమీక్షించాలని అమెరికా జాతీయ భద్రతా బృందాన్ని గతంలో యూఎస్ సెనటర్ మార్కో రుబియో కోరారు.
చైనా ప్రభుత్వాన్ని ఇబ్బందిపెట్టే కంటెంట్‌ను ఈ యాప్ సెన్సార్ చేస్తుందని రుబియో ఆందోళన వ్యక్తం చేశారు.
ఇవి కూడా చదవండి
- ఆర్టీసీ సమ్మెకు ఆర్టీసీ ముగింపే సమాధానమన్న కేసీఆర్, స్పందించిన ఆర్టీసీ జేఏసీ నాయకులు
- కిమ్ జీ-యంగ్, బోర్న్ 1982: దక్షిణ కొరియాలో స్త్రీవాదులు, స్త్రీవాద వ్యతిరేకుల మధ్య ఉద్రిక్తతలు రాజేసిన ఫెమినిస్ట్ సినిమా
- సంస్కృతం - హిందీ - తమిళం - తెలుగు... ఏది ప్రాచీన భాష? ఏ భాష మూలాలు ఏమిటి?
- ఆర్టీసీ బస్ నంబర్ ప్లేట్ మీద Z ఎందుకుంటుందో తెలుసా
- రేప్, డిప్రెషన్ నుంచి కోలుకునేందుకు ఈమెకు యోగా ఎలా ఉపయోగపడింది
- ఆల్కహాల్‌తో చేతులు కడుక్కునే నిరంకుశ నియంత.. నికొలస్ చాచెస్కూ
- ధోనీ రిటైర్మెంట్ ఎప్పుడు... గంగూలీ, ద్రావిడ్‌లకు వర్తించిన లాజిక్ అతనికి వర్తించదా...?
- రాయల్ వశిష్ట: గోదావరిలో 300 అడుగుల లోతులో మునిగిన బోటును ఎలా బయటకు తీశారంటే..
- హాంకాంగ్ ప్రజల నిరసనలకు కారణమైన మర్డర్ స్టోరీ.. ఎందుకింత వివాదాస్పదమైంది? హోటల్లో ఆ రాత్రి ఏం జరిగింది?
- ఏపీలో ఈ ఏడాదిలో మూడోసారి వరద.. ప్రకాశం బ్యారేజీ వద్ద గత 20 ఏళ్లలో కొత్త రికార్డు
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)