మెక్సికో వీధుల్లో బయటపడ్డ అస్థిపంజరం... అసలేం జరిగింది

మెక్సికో సిటీ వీధిలో అట్టతో చేసిన అతిపెద్ద అస్థిపంజరం

ఫొటో సోర్స్, EPA

ఫొటో క్యాప్షన్,

మెక్సికో సిటీ వీధిలో అట్టతో చేసిన అతిపెద్ద అస్థిపంజరం

మెక్సికో నగరంలోని తలావాక్ పరిసరాల్లోని ఒక వీధి నుంచి పెద్ద అస్థిపంజరం బయటపడింది.

ఈ భారీ అస్థిపంజరాన్ని చూసి పిల్లలందరూ ఆనందిస్తున్నారు.

ఫొటో సోర్స్, AFP

ఎందుకంటే ఇది నిజమైన అస్థిపంజరం కాదు. దీన్ని అట్టతో తయారు చేశారు.

చనిపోయిన తమ పెద్దలకు గుర్తుకు నవంబర్ 1, 2 తేదీలలో ఇక్కడ వేడుకల నిర్వహిస్తారు. దానికంటే ముందు ఇలా నగర వీధిలో ఈ పెద్ద అస్థిపంజరాన్ని ఉంచారు.

ఫొటో సోర్స్, AFP

స్థానిక కళాకారులు దీన్ని నిర్మించారు. తారు రోడ్డు నుంచి బయటకు వస్తున్నట్లుగా ఈ అస్థిపంజరం కనిపిస్తుంది.

ఇందుకోసం అస్థిపంజరం పక్కన నిర్మాణ శిధిలాలను ఉంచారు.

ఫొటో సోర్స్, AFP

శనివారం వందలాది మంది స్థానికులు రకరకాల దుస్తులు ధరించి కాట్రినా పేరిట పిలిచే పరేడ్‌లో పాల్గొనడానికి వచ్చారు.

100 ఏళ్ల కిందట మెక్సికన్ కార్టూనిస్ట్ జోస్ గ్వాడాలుపే పోసాడా తాను గీసిన అస్థిపంజరానికి కాట్రినా అని పేరు పెట్టారు. అప్పటి నుంచి ఈ పరేడ్‌ను ఆ పేరుతోనే పిలుస్తున్నారు.

ఫొటో సోర్స్, Reuters

ఈ పెరేడ్‌లో కుటుంబాలకు చెందిన అన్ని తరాల వారు కలుస్తుంటారు.

మెక్సికో నగరంలో అతిపెద్ద పెరేడ్ జరిగింది. ఉత్తరాన ఉన్న మోంటెర్రే నగరాలు కూడా ఈ సందర్భంగా అనేక కార్యక్రమాలను నిర్వహించాయి.

ఫొటో సోర్స్, Reuters

ఫొటో సోర్స్, Reuters

ఫొటో సోర్స్, Reuters

ఫొటో సోర్స్, EPA

ఈ పండుగ మూలాలు ప్రాచీన హిస్పానిక్ కాలంలో ఉన్నాయి. ఈ వేడుకల్లో ధరించే దుస్తుల తీరు హిస్పానిక్ సంస్కృతిని తెలియజేస్తాయి.

అయితే, ఈ పెరేడ్‌లో పాల్గొనే వారందరూ అస్థిపంజరాలను ధరించరు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)