చైనాలో 5జీ నెట్‌వర్క్ ప్రారంభం... ప్రపంచ టెక్నాలజీలో భారీ ముందడుగు

  • 1 నవంబర్ 2019
చైనాలో 5జీ నెట్‌వర్క్ ప్రారంభం Image copyright Getty Images

చైనాలో 5జీ సేవలు ప్రారంభమయ్యాయి. దీనితో చైనా ప్రపంచస్థాయిలో టెక్నాలజీ పరంగా ఒక పెద్ద ముందడుగు వేసినట్లయింది.

చైనాలోని ప్రభుత్వ మొబైల్ ఆపరేటర్లు చైనా మొబైల్, చైనా యూనికామ్, చైనా టెలీకామ్ గురువారం నుంచి తమ 5జీ డేటా ప్లాన్లు ప్రకటించాయి.

ట్రేడ్, టెక్నాలజీ అంశాల్లో చైనా-అమెరికా ఢీ అంటే ఢీ అంటున్న సమయంలో ఈ ప్రకటన వచ్చింది.

చైనా కంటే ముందు దక్షిణ కొరియా, అమెరికా, బ్రిటన్ తమ దేశాల్లో ఈ ఏడాది 5జీ నెట్‌వర్క్ ప్రారంభించాయి.

5జీ అయిదో జనరేషన్ మొబైల్ నెట్‌వర్క్. 5జీలో ఇంటర్నెట్ స్పీడ్ చాలా వేగంగా ఉంటుందని చెబుతున్నారు.

Image copyright Getty Images

5జీ డేటా ప్లాన్ ధర ఎంత?

మొదట్లో వచ్చే ఏడాది నుంచి 5జీ సేవలు ప్రారంభిస్తామని చెప్పిన చైనా, తర్వాత ఆ చర్యలను వేగం చేసి, ఇదే ఏడాది 5జీ సేవలు అందించింది.

ఈ సూపర్ ఫాస్ట్ సేవలు చైనాలోని 50 నగరాల్లో ప్రారంభమయ్యాయి. వీటిలో బీజింగ్, షాంఘాయ్ ఉన్నాయి. 5జీ డేటా ప్లాన్ ధరలు 128 యువాన్ల( దాదాపు 1300 రూపాయలు) నుంచి 500 యువాన్ల(6 వేల రూపాయలు) వరకూ ఉన్నాయని చైనా ప్రభుత్వ సమాచార సంస్థ షిన్హువా చెప్పింది.

చైనాలో 5జీ సేవలు ప్రారంభించే నెట్‌వర్క్‌కు సంబంధించిన ఎక్కువ పరికరాలను హువావే కంపెనీ సరఫరా చేసింది. మిగతా చాలా దేశాల్లో 5జీ నెట్‌వర్క్ ఏర్పాటు చేయడంలో ఈ కంపెనీ కీలక పాత్ర పోషిస్తోంది.

హువావే కంపెనీని అమెరికా బ్లాక్‌లిస్టులో పెట్టడం అనేది ఇక్కడ గమనించాల్సిన విషయం. ఆ కంపెనీ వల్ల తమ జాతీయ భద్రతకు ముప్పు ఉందని అమెరికా చెప్పింది.

హువావే స్వయంగా తమపై వచ్చిన అన్ని ఆరోపణలను ఖండించింది. అమెరికా చర్యలను చైనాలో కూడా ట్రేడ్ వార్‌లా చూస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు

హిందూ, ముస్లిం, క్రైస్తవుల తీర్థయాత్రలకు ప్రభుత్వం ఎలా ఆర్థిక సహాయం అందిస్తోంది...

శ్రీలంకతో సంబంధాలకు భారత్‌కు ఆంత తొందర దేనికి?

స్త్రీవాదంపై చర్చలో సభ్యులంతా పురుషులే... ఆగ్రహంతో ఆందోళనకు దిగిన మహిళలు

ఉద్ధవ్ ఠాక్రే: రాజ్ ఠాక్రేను కాదని బాల్ ఠాక్రే వారసుడిగా ఎలా ఎదిగారు...

రూ. 2.5 కోట్లు చెల్లించలేదని బాలుడి మృతదేహాన్ని ఇవ్వని హాస్పిటల్‌పై ట్యాక్సీ డ్రైవర్ల దాడి

రజనీకాంత్, కమల్ హాసన్‌ కలిసి తమిళ రాజకీయాల్లో మార్పు తీసుకురాగలరా

కొందరికి మరో చేగువేరా, మరికొందరికి ఆవేశపరుడు.. ఇంతకీ ఎవరీ జార్జిరెడ్డి?

ఇన్‌స్టాగ్రామ్‌లో ఫేక్ ఫాలోవర్లు: లైకులు, ఫాలోవర్లు, కామెంట్లు ఎలా కొంటున్నారు