బెర్లిన్ గోడ ఎందుకు కట్టారు?
మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.

బెర్లిన్ గోడ నిర్మాణానికి కారణాలు ఏమిటి?

  • 8 నవంబర్ 2019

బెర్లిన్ గోడ బెర్లిన్‌ను మాత్రమే విడదీయలేదు. పరస్పర విరుద్ధమైన రెండు సిద్ధాంతాలను దాదాపు 30 ఏళ్లు ఇది వేరుచేసింది.

రెండో ప్రపంచయుద్ధంలో విజేతలుగా నిలిచిన తర్వాత అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్, సోవియట్ యూనియన్.. ఓడిపోయిన జర్మనీని విభజించాలని నిర్ణయించాయి.

బెర్లిన్.. సోవియట్ యూనియన్ నియంత్రణలో ఉండిపోయింది.

రాజధాని కావడంతో బెర్లిన్‌ను కూడా విభజించారు.

పశ్చిమ భాగాన్ని పెట్టుబడిదారీ దేశాలు, తూర్పు భాగాన్ని కమ్యూనిస్టులు తమ నియంత్రణలో పెట్టుకున్నారు.

అప్పట్లో బ్రిటన్ ప్రధాని విన్‌స్టన్ చర్చిల్ ఒక సందర్భంలో- ఐరోపా పరిణామాలను దృష్టిలో ఉంచుకొని, ఐరోపా ఖండం వ్యాప్తంగా ఒక ఇనుప తెర ఏర్పడిందని వ్యాఖ్యానించారు.

ఆ తర్వాత ప్రచ్ఛన్న యుద్ధం మొదలైంది.

పశ్చిమ జర్మనీలో ఫెడరల్ రిపబ్లిక్ ఆఫ్ జర్మనీ, తూర్పు జర్మనీలో జర్మన్ డెమొక్రటిక్ రిపబ్లిక్ ఏర్పడ్డాయి.

తూర్పు జర్మనీ పరిధిలోని బెర్లిన్ పెట్టుబడిదారీ వ్యవస్థకు నిలయంగా మారింది. కమ్యూనిస్టు పాలకులకు ఇది సమస్యగా పరిణమించింది.

అమెరికా, బ్రిటన్ సీక్రెట్ సర్వీసెస్ బెర్లిన్‌ను నిఘా కేంద్రంగా చేసుకున్నాయి.

1949-1961 మధ్య 25 లక్షల మందికి పైగా ప్రజలు మెరుగైన అవకాశాల కోసం తూర్పు జర్మనీని వీడి పశ్చిమ జర్మనీకి చేరుకున్నారు.

తూర్పు జర్మనీ నుంచి ఈ వలసలను అడ్డుకొనేందుకు బెర్లిన్ గోడ నిర్మించాలని కమ్యూనిస్టు పాలకులు ఆదేశించారు. 1961 ఆగస్టు 13 రాత్రి కొన్ని గంటల వ్యవధిలోనే బెర్లిన్ గోడను నిలబెట్టారు.

మూడున్నర మీటర్లకు పైగా ఎత్తైన బెర్లిన్ గోడను స్టీలు కేబుళ్లు వాడి దృఢంగా కట్టారు.

ఐదు వేల మందికి పైగా తూర్పు బెర్లిన్ వాసులు తప్పించుకొని పశ్చిమ బెర్లిన్ చేరుకున్నారు. సరిహద్దులో చాలా మంది చనిపోయారు, లేదా అరెస్టయ్యారు.

బెర్లిన్‌ను ఈ గోడ దాదాపు మూడు దశాబ్దాలు విడగొట్టింది. బెర్లిన్ గోడ పతనం ఇరవయ్యో శతాబ్దపు కీలక ఘట్టాల్లో ఒకటి.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)