సముద్ర తీరంలో మంచు బంతులు.. ఎలా వచ్చాయంటే..

  • 11 నవంబర్ 2019
ఫిన్లాండ్‌లో మంచు బంతులు Image copyright Risto Mattila

ఫిన్లాండ్‌లోని ఓ తీర ప్రాంతంలో అరుదైన దృశ్యం కనిపించింది. హేల్యుటో ద్వీపంలో మంచు బంతులు కుప్పులు కుప్పలుగా పేరుకుపోయి దర్శనమిచ్చాయి.

ఫిన్లాండ్, స్వీడన్‌ల మధ్యలోని బోత్నియా గల్ఫ్‌లో హేల్యుటో ఉంది.

తీరంలో ఏర్పడిన మంచు బంతుల కుప్పలను రిస్టో మటీలా అనే వ్యక్తి ఫొటోలు తీశారు.

గాలి, నీటి ప్రవాహం కారణంగా మంచు ఉండలుగా చుట్టుకుని ఇలా బంతులుగా ఏర్పడుతుందని నిపుణులు అంటున్నారు.

తాను జీవితంలో ఇలాంటి దృశ్యమెప్పుడూ చూడలేదని మటీలా బీబీసీతో అన్నారు. ఆయన ఇక్కడికి సమీపంలోనే ఉన్న ఔలూ నగరం నుంచి హేల్యుటోకి వచ్చారు.

‘‘మర్జానీమీ బీచ్‌లో నా భర్యతోపాటు ఉన్నా. వాతావరణం పొడిగానే ఉంది. ఉష్ణోగ్రత -1 డిగ్రీ సెంటీగ్రేడ్ వరకూ ఉంది. గాలులు ఎక్కువగా వీచాయి. తీరంలో ఈ అద్భుత దృశ్యం కనిపించింది. తీరం పొడవునా మంచు బంతులు కుప్పులుగా ఉన్నాయి’’ అని మటీలా వివరించారు.

‘‘ఈ మంచు బంతులు విస్తరించి ఉన్న ప్రాంతం వైశాల్యం దాదాపు 30 మీటర్లు ఉంటుంది. కోడి గుడ్డు నుంచి ఫుట్‌బాల్ వరకూ రకరకాల పరిమాణాల్లో అవి ఉన్నాయి’’ అని ఆయన అన్నారు.

‘‘పాతికేళ్లుగా ఈ చుట్టుపక్కలే నేను నివాసముంటున్నా. ఎన్నడూ ఇలాంటిది చూడలేదు. ఎంతో మనోహరంగా అనిపించిన దృశ్యం అది. నాతోపాటు కెమెరా ఉంది. ఈ దృశ్యాలను అలాగే బంధించి పెట్టుకోవాలనుకున్నా’’ అని మటీలా చెప్పారు.

మంచు బంతులు ఏర్పడాలంటే చల్లటి వాతావరణం, గాలులు ఉండాలని బీబీసీ వాతావరణ నిపుణుడు జార్జ్ గుడ్‌ఫెల్లో అన్నారు.

‘‘సముద్ర ఉపరితలంలోని నీరు గడ్డకట్టినప్పుడు ఇవి ఏర్పడతాయి. అలల ప్రభావానికి గుండ్రంగా తిరుగుతూ ఇలా బంతుల్లా తయారవుతాయి. తీరానికి కొట్టుకువచ్చి అక్కడే పేరుకుపోతాయి’’ అని వివరించారు.

ఇదివరకు రష్యాలో, షికాగోకు సమీపంలోని మిచిగన్ సరస్సులో ఇలాంటి మంచు బంతులు కనిపించాయి.

2016లో సైబీరియాలోని నైడాలో 18 కి.మీ. మేర ఉన్న తీరం పొడవునా ఈ మంచు బంతులు ఏర్పడ్డాయి. వాటిలో కొన్ని దాదాపు 1 మీ. వ్యాసంతో ఉన్నాయి.

Image copyright Ekaterina Chernykh
చిత్రం శీర్షిక నైడాలో కనిపించిన మంచు బంతులు

ఇవి కూడా చదవండి.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు

గోటాబయ రాజపక్ష: "ఆయన విజయంతో భారత్-శ్రీలంక సంబంధాల్లో మార్పేమీ రాదు"

‘హైదరాబాద్‌ను దేశానికి రెండో రాజధాని చేసే ఆలోచన లేదు’

అయోధ్య తీర్పుపై రివ్యూ పిటిషన్ వేస్తామన్న ముస్లిం పర్సనల్ లా బోర్డు

ఒకప్పుడు కరడుగట్టిన నేరస్థుల కారాగారం... నేడు పర్యటకుల స్వర్గధామం

లవ్ జిహాద్ కేసు: ఇబ్రహీం-అంజలి జంట తమ ఇష్టప్రకారం జీవించవచ్చన్న హైకోర్టు

శ్రీలంక ఎన్నికలు: అధ్యక్షుడిగా ఎన్నికైన రక్షణ శాఖ మాజీ కార్యదర్శి గోటాబయ రాజపక్ష

రంజన్ గొగోయ్: భారత రాజకీయాల్లో అయోధ్యకాండకు 'ముగింపు' పలికిన చీఫ్ జస్టిస్

పంజాబ్, హ‌రియాణా పొలాల పొగ దిల్లీని క‌మ్మేస్తుంటే ఏపీ రైతులు ఏం చేస్తున్నారు