యూఎస్ఎస్ గ్రేబ్యాక్: 75 ఏళ్ల తర్వాత దొరికిన రెండో ప్రపంచ యుద్ధం నాటి జలాంతర్గామి

  • 12 నవంబర్ 2019
ముందు భాగంలో శిధిలావస్థలో ఉన్న పరికరాల ద్వారా ఈ జలాంతర్గామి యూఎస్ఎస్ గ్రేబ్యాక్ అని గుర్తించారు. Image copyright TIM TAYLOR-LOST 52 PROJECT
చిత్రం శీర్షిక ముందు భాగంలో శిధిలావస్థలో ఉన్న పరికరాల ద్వారా ఈ జలాంతర్గామి యూఎస్ఎస్ గ్రేబ్యాక్ అని గుర్తించారు.

రెండో ప్రపంచ యుద్ధ సమయంలో కనిపించకుండా పోయిన అమెరికా జలాంతర్గామి ఆచూకీ 75 ఏళ్ల తర్వాత లభ్యమైంది.

తూర్పు చైనా సముద్ర గర్భంలో ఉన్న యూఎస్ఎస్ గ్రేబ్యాక్ ఆచూకీని ఇప్పుడు పరిశోధకులు గుర్తించారు.

1944లో రెండో ప్రపంచ యుద్ధంలో 80 మంది సిబ్బందితో వెళ్తున్న యూఎస్ఎస్ గ్రేబ్యాక్ సబ్‌మెరైన్‌పై జపాన్ యుద్ధవిమానాలు దాడి చేశాయి. ఆ తర్వాత దాని ఆచూకీ తెలియలేదు.

జపాన్‌లోని ఒకినవా తీరంలోని సాగరగర్భంలో దీని ఆచూకీ లభ్యమైందని ఓ అండర్‌వాటర్ ఎక్స్‌ప్లొరేషన్ ప్రాజెక్ట్ వెల్లడించింది. మిలిటరీ పత్రాల్లోని సమాచారాన్ని తీసుకుని, దానితో సరైన స్థానాన్ని గుర్తించామని వారు తెలిపారు.

జలాంతర్గామి మునిగిపోయిన ప్రదేశాన్ని మిలిటరీ పత్రాల్లో తప్పుగా గుర్తించారని తెలిపారు.

అప్పట్లో ఈ జలాంతర్గామిలో ప్రయాణిస్తున్న 80 మంది సిబ్బంది కుటుంబాలకు దీని ఆచూకీ దొరికిందన్న సమాచారాన్ని అందించారు.

కేథీ టేలర్ అంకుల్ జాన్ పాట్రిక్ కింగ్ ఈ జలాంతర్గామిలో ఉన్నారు. ఆమెకు ఈ సమాచారం కొంత బాధ కలిగించినా, ఎంతో ఉపశమనాన్నిచ్చింది.

"నేను చిన్న పిల్లగా ఉన్నప్పటి నుంచి ఆయన జాడ కనిపెట్టగలనని, ఆయనను వెతికి పట్టుకోగలమని లేదంటే కనీసం ఆయన గుర్తులైనా తీసుకురావాలని అనుకునేదాన్ని" అని ఆమె ఏబీసీ న్యూస్‌తో అన్నారు.

అదృశ్యమైన జలాంతర్గామిని ఎలా గుర్తించారు?

రెండో ప్రపంచ యుద్ధంలో అదృశ్యమైన అమెరికా జలాంతర్గాముల జాడ కనిపెట్టడమే 'లాస్ట్ 52' ప్రాజెక్ట్ ఉద్దేశం. ఈ బృందమే యూఎస్ఎస్ గ్రేబ్యాక్ ఆచూకీనీ కనిపెట్టేందుకు ఒకినవా తీరంలో తమ అన్వేషణ ప్రారంభించింది.

యూఎస్ఎస్ గ్రేబ్యాక్ మునిగిన ప్రదేశానికి సంబంధించిన వివరాలను సరైన రీతిలో నమోదు చేయలేదని వారు గుర్తించారు. ఆ సంఖ్యల్లో ఒక సంఖ్య మిస్సవడంతో కనీసం 100 మైళ్ల దూరం (160 కిలోమీటర్లు) తేడా వచ్చిందని వారన్నారు.

ఆధునిక డ్రోన్ టెక్నాలజీ ఉపయోగించడం ద్వారా 1400 అడుగులు (430 మీటర్లు) లోతులో ఉన్న దాని సరైన స్థానాన్ని గుర్తించగలిగారు.

"ఈ ప్రాంతంలో అమెరికా నౌకా దళ నౌక ఒకటి మునిగిపోయిందనే గుర్తింపు కూడా నీటి అడుగున ఉన్న జలాంతర్గామి చెక్కుచెదరకుండా ఉండడానికి తోడ్పడింది" అని ఈ ప్రాజెక్ట్ సారథి టిమ్ టేలర్ తెలిపారు.

Image copyright TIM TAYLOR-LOST 52 PROJECT
చిత్రం శీర్షిక 1941లో ప్రారంభమైన యూఎస్ఎస్ గ్రేబ్యాక్.. ఆస్ట్రేలియా, జపాన్ దేశాలకు కూడా ప్రయాణించింది.

యుద్ధం సమయంలో గ్రేబ్యాక్ కనీసం 14 ఓడలపై దాడి చేసి, వాటిని నీట ముంచి, ఆ తర్వాత అది కనిపించకుండా పోయింది.

అది రెండు నేవీ యూనిట్ కమెండేషన్స్, 8 బ్యాటిల్ స్టార్స్ పొందింది.

ఇవి కూడా చదవండి.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

సంబంధిత అంశాలు

ముఖ్యమైన కథనాలు

మోదీ నీడ నుంచి బయటపడి అమిత్ షా తనదైన ఇమేజ్ సృష్టించుకున్నారా?

అత్యాచారాలు, హత్యలకు రవాణా సౌకర్యాలు సరిగా లేకపోవడం కూడా ఒక కారణమా...

ఓ గుహలో దొరికిన 44 వేల ఏళ్ళ నాటి అతి పురాతన పెయింటింగ్ ఏం చెబుతోంది...

బోరిస్ జాన్సన్: బ్రిటన్ ప్రధానిగా మళ్ళీ కన్సర్వేటివ్ నేత... ఎన్నికల్లో టోరీల ఘన విజయం

'పౌరసత్వ సవరణ బిల్లును వ్యతిరేకించే వారితో చర్చలకు సిద్ధం' - అస్సాం సీఎం

ఆంధ్రప్రదేశ్: 'దిశ' బిల్లులకు శాసనసభ ఆమోదం

ఈరోజు మాకు హోలీ, దీపావళి కంటే పెద్ద పండుగ రోజు: పాకిస్తాన్ హిందూ శరణార్థులు

ఏపీ అసెంబ్లీ: చంద్రబాబును మార్షల్స్ తోసేశారు.. టీడీపీ; మార్షల్స్‌ను పీక పట్టుకుని బెదిరించారు.. వైసీపీ