భూమి మీద నివసించిన అతి పెద్ద కోతి రహస్యాలు.. చైనాలోని ఒక గుహలో 20 లక్షల ఏళ్ల కిందటి ఏప్ పంటి శిలాజం

  • 15 నవంబర్ 2019
శిలాజం Image copyright PROF WEI WANG

భూమిపై నివసించిన అతి పెద్ద ఏప్(తోక లేని కోతి) పంటి శిలాజం ఇప్పుడు వాటి పరిణామక్రమానికి సంబంధించిన పరిశోధనలను కొత్త దారులు పట్టిస్తోంది.

జైగాంటోపిథికస్ బ్లాకి అనే ఈ ఏప్ మూడు మీటర్ల ఎత్తు, 600 కేజీల బరువు ఉండేదని శాస్త్రవేత్తలు భావిస్తారు.

చైనాలోని ఒక గుహలో లభించిన 20 లక్షల ఏళ్ల కిందటి ఏప్ పంటి శిలాజంలో దానికి సంబంధించిన కణ ఆధారాలను శాస్త్రవేత్తలు సంపాదించగలిగారు.

జైగాంటోపిథికస్ బ్లాకి, ఒరాంగుటాన్‌లు ఒకే జాతికి చెందినవిగా చెప్తారు. ఈ రెండు జంతువులకు మూల ప్రాణి కోటి ఇరవై లక్షల సంవత్సరాల కిందట ఒక్కటేనని అంచనా వేస్తున్నారు.

''ప్రస్తుతం మనుగడలో ఉన్న జంతువుల్లో జైగాంటోపిథికస్ బ్లాకి జాతికి సమీపంగా పోలినవి ఒరాంగుటాన్‌లు కావొచ్చు. మిగతా ఏప్ జాతి జంతువుల్లో గొరిల్లాలు, చింపాంజీలు, మనుషులతో పోల్చితే ఒరాంగుటాన్‌లకే వీటితో ఎక్కువ పోలికలున్నాయి'' అని కోపెన్‌హాగన్ యూనివర్సిటీకి చెందిన డాక్టర్ ఫ్రిడో వెకర్ చెప్పారు.

Image copyright IKUMI KAYAMA

మానవ పరిణామ రహస్యాలు

ఈ పంటి శిలాజంలోని ప్రోటీన్ సీక్వెన్స్‌తో ప్రస్తుతం భూమిపై నివసించే ఏప్ జాతికి చెందిన పలు జంతువులతో పోల్చుతూ చేసిన అధ్యయన వివరాలు నేచర్ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి.

20 లక్షల ఏళ్ల కిందటి పురాతన శిలాజాల నుంచి ప్రోటీన్ పొందడం చాలా అరుదు. వేడి ప్రాంతాలలో నివసించిన మానవులు సహా ఇతర అత్యంత పురాతన జీవులపై పరిశోధనకు ఇది అవకాశమేర్పరుస్తుందన్న ఆశలు పెంచాయి.

ఉష్ణ మండలాల్లో సేకరించిన పురాతన నమూనాల నుంచి డీఎన్ఏ, ప్రోటీన్ సీక్వెన్స్ కనుక్కోవడం కష్టం. అక్కడి నమూనాలు శిథిలమై అందుకు అనుకూలంగా ఉండవు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు