పాకిస్తాన్: 10 ఏళ్ల తర్వాత స్వదేశంలో టెస్ట్ మ్యాచ్: శ్రీలంక జట్టుకు ఎందుకు కృతజ్ఞతలు చెబుతున్నారు?

  • 14 నవంబర్ 2019
శ్రీలంక, పాక్ క్రికెట్ మ్యాచ్ Image copyright Getty Images

పదేళ్ల తర్వాత పాకిస్తాన్ స్వదేశంలో టెస్ట్ మ్యాచ్ ఆడబోతోంది. 2009 డిసెంబర్ లో శ్రీలంకతో టెస్ట్ సిరీస్ ప్రకటన తర్వాత స్వదేశంలో పాక్ ఒక్క టెస్ట్ మ్యాచ్ కూడా ఆడలేదు.

10 ఏళ్ల కిందట పాక్‌లో టెస్ట్ సిరీస్ ఆడటానికి శ్రీలంక జట్టు లాహోర్‌లో అడుగుపెట్టింది. అయితే, లంక ఆటగాళ్ల బస్సుపై దాడి జరగడంతో ఆ టెస్టు మ్యాచ్ రద్దు చేశారు. ఈ ఘటన తర్వాత పాక్ స్వదేశంలో ఇప్పటి వరకు టెస్ట్ మ్యాచ్ ఆడలేదు.

దాడి ఘటనలో ఆరుగురు పాక్ పోలీసులు, ఇద్దరు పౌరులు చనిపోయారు. శ్రీలంక జట్టు సభ్యులు కొంతమంది గాయపడ్డారు.

ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో భాగంగా ఇప్పుడు శ్రీలంక జట్టు పాక్‌తో రెండు మ్యాచ్‌లు ఆడనుంది.

Image copyright AFP

పదేళ్లుగా యూఏఈ వేదికగా..

మొదటి టెస్ట్‌కు రావల్పండి వేదిక కానుంది. ఇక్కడ డిసెంబర్ 11 నుంచి 15 వరకు తొలి టెస్టు ఆడుతారు. రెండో టెస్ట్ డిసెంబర్ 19 నుంచి 23 వరకు కరాచీలో నిర్వహిస్తారు.

''ఇది పాక్‌కు సంబంధించి గొప్ప వార్త. ప్రపంచంలోని ఇతర దేశాల మాదిరిగానే పాక్ సురక్షితమైనదని దీని వల్ల తెలుస్తుంది'' అని పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ డైరెక్టర్ జహీర్ ఖాన్ తెలిపారు.

''వారి జట్టును ఇక్కడ ఆడటానికి పంపుతున్న శ్రీలంక క్రికెట్ బోర్డ్‌కు మేం ధన్యవాదాలు తెలుపుతున్నాం. అంతర్జాతీయ క్రికెట్‌కు పీసీబీ తనదైన పాత్ర పోషించేందుకు చేస్తున్న ప్రయత్నానికి ఇది దోహద పడుతుంది'' అని పేర్కొన్నారు.

2009 దాడి తరువాత పాక్ క్రికెట్ జట్టుకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌ హోంగ్రౌండ్‌గా మారింది. ఇక్కడి నుంచే ఆ జట్టు అనేక అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడింది.

2015లో జింబాబ్వే జట్టును పాక్ ఆహ్వానించింది. ఆ దేశంతో మూడు వన్డేలు, రెండు టీ20లు ఆడింది. అయితే, ఆ సమయంలో లాహోర్ స్టేడియం బయట ఆత్మాహుతి బాంబు దాడి జరగడంతో ఈ మ్యాచ్‌లు వెలుగులోకి రాకుండాపోయాయి.

సెప్టెంబర్, అక్టోబర్‌లలో శ్రీలంక జట్టు పాక్‌లో పర్యటించింది. అక్కడ మూడు వన్డేలు, రెండు ట్వంటీ20లు ఆడింది. అయితే, లంక జట్టుకు సంబంధించిన కొందరు కీలక ఆటగాళ్లు ఈ పర్యటనకు రాలేదు.

''మా గత పర్యటన ఆధారంగా, మళ్లీ పాక్ పర్యటనకు వెళుతున్నామని చెప్పడానికి సంతోషిస్తున్నాం, మేం అక్కడ సౌకర్యంగానే ఉన్నాం. టెస్ట్ క్రికెట్‌కు అనుకూలమైన పరిస్థితులు అక్కడ ఉన్నాయి'' అని శ్రీలంక జట్టు ముఖ్య కార్యనిర్వహణ అధికారి అశ్లే డీ సిల్వా అన్నారు.

Image copyright Getty Images

‘మా దేశం సురక్షితం’

పాక్‌లో పర్యటించే జట్టుకు జాతీయ స్థాయి భద్రత కల్పిస్తాని పీసీబీ మేనేజింగ్ డైరెక్టర్ వసీమ్ ఖాన్ బీబీసీ ఏసియన్ నెట్‌వర్క్‌కు చెప్పారు. .

ఇంగ్లండ్ జట్టు కూడా 2022లో పాక్‌లో ఆడే అవకాశం ఉందని అన్నారు.

''పాక్ సురక్షితమని చాలా ఏళ్లుగా చెబుతున్నా. ఇక్కడ క్రికెట్ వృద్ధి చెందుతోంది. ఇప్పుడిక్కడ యువత ఎక్కువగా ఉంది, దేశంలో క్రికెట్ మళ్లీ ఆడాలని కోరుకుంటున్నారు'' అని ఆయన తెలిపారు.

''వచ్చే ఏడాది మార్చిలో పర్యటించాల్సిందిగా దక్షిణాఫ్రికా జట్టును కోరాం. మాతో టీ20 సిరీస్ ఆడాలని అడిగాం. వారు వస్తారని ఆశిస్తున్నాను. మెల్‌బోర్న్ క్రికెట్ క్లబ్‌తోనూ చర్చలు జరపుతున్నాం. పాకిస్తాన్ సూపర్ లీగ్ ప్రారంభానికంటే ముందు ఫిబ్రవరిలో వారితో సిరీస్‌కు ప్రణాళిక ఉంది'' అని తెలిపారు.

Image copyright EPA

నేను తప్పకుండా పాక్‌లో పర్యటిస్తా: ఫార్‌బ్రేస్

శ్రీలంక జట్టు ప్రయాణిస్తున్న బస్సుపై బాంబుదాడి జరిగిన ఘటనలో పాల్ ఫార్‌బ్రేస్ కూడా ఉన్నారు.

ప్రస్తుతం వార్‌విక్‌షైర్ స్పోర్ట్ డైరెక్టర్‌గా ఉన్న ఆయన అప్పుడు శ్రీలంక జట్టు సహాయ శిక్షకుడిగా పనిచేశారు.

ఆయన బీబీసీ రేడియో 5 లైవ్‌తో మాట్లాడుతూ, ''పాక్‌లో పర్యటించనున్న కొంతమంది లంక ఆటగాళ్లతో మాట్లాడాను. నేను తప్పకుండా పాక్‌కు వస్తాను'' అని చెప్పారు.

''తిరిగి అక్కడ ఆడటం, పాక్‌లో మళ్లీ క్రికెట్ ఆడటం అనే ఆలోచన ఆ దేశంలోని పిల్లలకు సంబంధించి చాలా ముఖ్యమైనది. ప్రధాన ఆటగాళ్లు లేనప్పటికీ శ్రీలంక జట్టు ఇటీవల అక్కడికి వెళ్లింది. ఇతర దేశాల ఆటగాళ్లు పాక్‌లో పర్యటించడానికి కాస్త సమయం పడుతుంది. అక్కడ పర్యటించే ఆటగాళ్లు అంతా బాగుందని చెబుతారు'' అని పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు

అభిప్రాయం: 'పౌరసత్వ బిల్లును పార్టీలు జాతీయ భద్రత, మానవీయ కోణంలో చూడాలి'

రోహింజ్యాల మారణహోమం ఆరోపణలు అవాస్తవం.. అంతర్జాతీయ న్యాయస్థానంలో ఆంగ్ సాన్ సూచీ

‘చిన్న పాప సార్... సెక్స్ అంటే ఏంటో తెలీదు.. అట్లాంటి బిడ్డను రేప్ చేసి చంపినారు’

రాజ్యసభలో పౌరసత్వ బిల్లుకు వైసీపీ, టీడీపీ మద్దతు

బ్రిటన్ ఎన్నికల్లో కశ్మీర్ ప్రస్తావన ఎందుకు వస్తోంది... మతం ప్రధానాంశంగా ఎలా మారింది?

బాలికపై అత్యాచారం: డబ్బు కోసం కూతురిని రెండేళ్ళుగా రేప్ చేయించిన తండ్రి

నానావతి కమిషన్: గుజరాత్ అల్లర్ల కేసులో నరేంద్ర మోదీకి క్లీన్ చిట్

సనా మారిన్: పదిహేనేళ్ల వయసులో బేకరీలో ఉద్యోగి... 34 ఏళ్లకు దేశ ప్రధాని