మడగాస్కర్‌: కొత్త రాజధాని నిర్మాణంపై రైతుల ఆగ్రహం.. భూములు ఇవ్వబోమంటూ ఆందోళన

  • 24 నవంబర్ 2019
మడగాస్కర్

మడగాస్కర్‌లో కొత్త రాజధాని నిర్మించాలని ఆ దేశ అధ్యక్షుడు ఆండ్రీ రాజోయెల్ నిర్ణయం తీసుకున్నారు. దీనికి టానా మాసువాండ్రా అని పేరు పెట్టారు.

ఇళ్లు, బ్యాంకులు, వ్యాపార సముదాయాలతో దీన్ని అందంగా నిర్మించేందుకు 60 కోట్ల డాలర్లు (భారత కరెన్సీలో సుమారు రూ.4300 కోట్లు) ఖర్చవుతుందని మడగాస్కర్ ప్రభుత్వం అంచనా వేస్తోంది.

ప్రస్తుత రాజధాని అంటానిరివోకు సమీపంలో ఉన్న వెయ్యి ఎకరాల విస్తీర్ణంలోని వ్యవసాయ క్షేత్రాలను వేరే చోటుకు తరలించి, ఆ స్థానంలో దీన్ని నిర్మించాలని భావిస్తోంది.

అయితే, ఆ భూములు అప్పగించేందుకు రైతులు అంగీకరించడం లేదు.

మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.
Media captionవీడియో: మడగాస్కర్ రాజధాని నగరంపై వివాదం

డబ్బు కోసం తాము భూమిని వదులుకోమని, అక్కడి నుంచి వెళ్లడానికి అంగీకరించబోమని స్థానిక రైతు జోన్ డిజరీ అంటున్నారు.

ఐదు తరాలుగా డిజరీ కుటుంబం ఆ పొలాల్లో ఆయన వ్యవసాయం చేసుకుంటోంది. వీటిని తన పిల్లలకు వారసత్వంగా ఇస్తానని ఆయన భావిస్తూ వచ్చారు.

కానీ, ప్రభుత్వం బలవంతంగానైనా జోన్ డిజరీ లాంటి వాళ్లను వేరే ప్రాంతానికి తరలించాలన్న ఆలోచనతో ఉంది.

''తరతరాలుగా ఈ భూములే మమ్మల్ని పోషిస్తున్నాయి. ఇటుకలు తయారు చేసి అమ్మడం ద్వారా మా రోజు గడుస్తోంది . మా పిల్లల్ని చదివించుకోగలుగుతున్నాం. ఇటుకలు అమ్మడం ఒక్కటే సరిపోదు. వరి పంట చేతికి రాగానే దాన్ని కూడా అమ్ముకోవాల్సిందే'' అని జోన్ డిజరీ చెప్పారు.

చిత్రం శీర్షిక జోన్ డిజరీ

రైతుల దగ్గరి నుంచి తీసుకునే భూమికి తిరిగి ఐదు రెట్ల చొప్పున స్థలాన్ని బెవోయ్ అనే ప్రాంతంలో వారికి కేటాయిస్తామని మడగాస్కర్ అధ్యక్షుడు ఆండ్రీ రాజోయెల్ అంటున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా రాజోయెల్ ఇచ్చిన హామీల్లో 'ఆఫ్రికా ఖండంలోనే అందమైన రాజధాని నిర్మించడం' కూడా ఒకటి.

కానీ, బెవోయ్ ఇప్పుడున్న రాజధానికి 700 కి.మీ.ల దూరంలో ఉంది. అందుకే, అక్కడికి తరలివెళ్లేందుకు రైతులు ఇష్టపడటం లేదు.

చిత్రం శీర్షిక ఆండ్రీ రాజోయెల్

చేపల అమ్మకం ద్వారా రోజుకు తాము 8 డాలర్లు సంపాదిస్తామని, తమ జీవనాధారాన్ని ప్రభుత్వం నాశనం చేయాలనుకుంటుందని మాంగ అనే స్థానికుడు ఆవేదన వ్యక్తంచేశారు.

కొత్త రాజధాని నిర్మాణం వల్ల నష్టపోయే రైతులకు ప్రభుత్వం 2 కోట్ల డాలర్లను కేటాయించింది. మరిన్ని ప్రత్యామ్నాయాల గురించి కూడా ఆలోచిస్తోంది.

''మేం నిరుపయోగంగా ఉన్న వరి పొలాలనే కొనాలని అనుకుంటున్నాం. వరి పండే ప్రాంతాల్లోనే భూములు కావాలనుకునేవాళ్లను అక్కడకు తరలించగలం. రాజధానికి సమీపంలో సోషల్ స్టైల్ హౌసింగ్ నిర్మాణం కోసం తగిన భూముల కోసం మేం చూస్తున్నాం'' అని ప్రభుత్వ అధికారి గెరాడ్ అడ్రిమనోహిసావ్ చెప్పారు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు

భారతదేశం లాక్ డౌన్‌ని ఎందుకు పొడిగిస్తుంది.. తొలగిస్తే ఎదురయ్యే ప్రమాదాలేంటి

కరోనా లాక్‌డౌన్: ఈ కార్మికుడు భార్యను ఎక్కించుకుని సైకిల్‌పై 750 కిలోమీటర్లు ప్రయాణించాడు

కరోనావైరస్: 24 గంటల్లో 549 కొత్త కేసులు.. 17 మరణాలు.. ఇండియాలో మొత్తం కేసులు 5,734

హైదరాబాద్: మణిపూర్ విద్యార్థులపై వివక్ష.. సూపర్ మార్కెట్‌లోకి వెళ్లకుండా అడ్డుకున్న సెక్యూరిటీ గార్డు

కరోనావైరస్ లాక్‌డౌన్ ఎఫెక్ట్: భూమి కంపించటం తగ్గిపోయింది

కరోనావైరస్ హాట్‌స్పాట్లు: ఈ ప్రాంతాల్లో ఏం జరగబోతుంది.. లాక్‌డౌన్‌కు, దీనికి తేడా ఏంటి

వుహాన్‌లో లాక్‌ డౌన్ ఎత్తేసిన చైనా ప్రభుత్వం.. రైళ్లు, విమానాల్లో మొదలైన ప్రయాణాలు

దిల్లీ హింస: అద్దాలు పగిలిన రాత్రి

కరోనావైరస్ వ్యాక్సీన్ కనిపెట్టినా... అది పేద దేశాలకు అందుతుందా