థాయిలాండ్: చనిపోయిన జింక కడుపులో 7 కేజీల ప్లాస్టిక్ వ్యర్థాలు

  • 27 నవంబర్ 2019
చనిపోయిన జింక Image copyright THE PROTECTED AREA REGIONAL OFFICE 13 (PHRAE)

థాయిలాండ్‌లోని ఒక జాతీయ వన్యప్రాణి సంరక్షణ కేంద్రంలో మరణించిన మగ జింక కడుపులో 7 కేజీల వ్యర్థాలను గుర్తించారు.

ప్లాస్టిక్ సంచులు, పురుషుల అండర్‌వేర్‌లు, ఖాళీ కాఫీ ప్యాకెట్లు, ప్లాస్టిక్ తాళ్ల ముక్కలు వంటివన్నీ అందులో ఉన్నాయి.

ఖున్ సతాన్ నేషనల్ పార్క్‌కి చెందిన అధికారులు మాట్లాడుతూ.. ఈ జింక చనిపోవడానికి చాలాకాలం ముందునుంచే ఇలా ప్లాస్టిక్ వ్యర్థాలను తింటోందని చెప్పారు.

ఇంతకుముందు ఈ ఏడాదిలోనే పిల్ల డుగాంగ్ ఒకటి ప్లాస్టిక్ తినడం వల్ల మరణించింది.

తొలుత మరియం అనే ఆ పిల్ల డుగాంగ్‌ను రక్షించినప్పుడు ఆ ఫొటోలు థాయిలాండ్ అంతటా వైరల్ అయ్యాయి. కానీ, అక్కడికి కొద్ది రోజుల్లోనే అది మరణించింది.

ఖున్ సతాన్ నేషనల్ పార్క్‌లో పెట్రోలింగ్ చేస్తున్న ఓ ఉద్యోగి నవంబరు 25న ఈ మగ జింక చనిపోయి ఉండడాన్ని చూశారు. దాని కడుపులో రబ్బరు గ్లోవ్స్, చిన్న టవల్స్ వంటివీ ఉన్నాయి.

Image copyright THE PROTECTED AREA REGIONAL OFFICE 13 (PHRAE)

''అది చనిపోవడానికి చాలా ముందు నుంచే ఇలాంటి వస్తువులను తింటోంది అనుకుంటున్నాం'' అని నేషనల్ పార్క్ డైరెక్టర్ క్రియాంగ్షక్ థనోంపన్ 'బీబీసీ థాయ్'తో చెప్పారు.

ప్లాస్టిక్ పదార్థాలు దాని ఆహార వాహికను మూసుకుపోయేలా చేశాయని భావిస్తున్నామని, దర్యాప్తులో అసలు కారణం తెలుస్తుందని చెప్పారు.

జింక మరణంపై సోషల్ మీడియాలో ప్రజల నుంచి విమర్శలు వస్తున్నాయి. పార్కుకు వెళ్లేవారు నానా చెత్త అక్కడ విసిరేయడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని నెటిజన్లు ఆరోపిస్తున్నారు.

''ఇలాంటి చోటికి వెళ్లేటప్పుడు మీ వల్ల పోగయిన చెత్తను మళ్లీ మీతో పాటు బయటకు తెచ్చేయండి. బాధ్యతగా ఉండండి'' అంటూ ఫేస్ బుక్ యూజర్ కామెంట్ చేశారు.

ఇలాంటివి చిన్నప్పటి నుంచే నేర్పించాలి. లేదంటే, పెద్దయ్యాక అలవాటు కాదు అని మరో యూజర్ కామెంట్ చేశారు.

ఈ నేషనల్ పార్కు ఏరియాలో పోగవుతున్న చెత్తను పూర్తిగా ఏరివేయడానికి, చెత్త పోగు కాకుండా చేయడానికి మూడు దశల్లో చర్యలు తీసుకోనున్నట్లు అధికారులు చెబుతున్నారు.

థాయిల్యాండ్‌లో ప్లాస్టిక్ వాడకం చాలా ఎక్కువ. థాయిల్యాండ్‌లో ఏటా 7,500 కోట్ల ప్లాస్టిక్ సంచుల ముక్కలు విసిరేస్తున్నట్లు గ్రీన్ పీస్ సంస్థ తెలిపింది.

దేశంలో 2020 జనవరి నుంచి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ సంచులను రిటైలర్లు ఇవ్వబోరని థాయిలాండ్ పర్యావరన మంత్రి రెండు నెలల కిందట చెప్పారు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు

భారతదేశం లాక్ డౌన్‌ని ఎందుకు పొడిగిస్తుంది.. తొలగిస్తే ఎదురయ్యే ప్రమాదాలేంటి

కరోనా లాక్‌డౌన్: ఈ కార్మికుడు భార్యను ఎక్కించుకుని సైకిల్‌పై 750 కిలోమీటర్లు ప్రయాణించాడు

కరోనావైరస్: 24 గంటల్లో 549 కొత్త కేసులు.. 17 మరణాలు.. ఇండియాలో మొత్తం కేసులు 5,734

హైదరాబాద్: మణిపూర్ విద్యార్థులపై వివక్ష.. సూపర్ మార్కెట్‌లోకి వెళ్లకుండా అడ్డుకున్న సెక్యూరిటీ గార్డు

కరోనావైరస్ లాక్‌డౌన్ ఎఫెక్ట్: భూమి కంపించటం తగ్గిపోయింది

కరోనావైరస్ హాట్‌స్పాట్లు: ఈ ప్రాంతాల్లో ఏం జరగబోతుంది.. లాక్‌డౌన్‌కు, దీనికి తేడా ఏంటి

వుహాన్‌లో లాక్‌ డౌన్ ఎత్తేసిన చైనా ప్రభుత్వం.. రైళ్లు, విమానాల్లో మొదలైన ప్రయాణాలు

దిల్లీ హింస: అద్దాలు పగిలిన రాత్రి

కరోనావైరస్ వ్యాక్సీన్ కనిపెట్టినా... అది పేద దేశాలకు అందుతుందా