కాస్మిక్ క్రిస్ప్: మార్కెట్లోకి ఏడాది పాటు నిల్వ ఉండే కొత్త రకం ఆపిల్

  • 2 డిసెంబర్ 2019
రెడ్ ఆపిల్స్, యాపిల్స్ Image copyright PVM
చిత్రం శీర్షిక ఈ ఆపిల్‌ను మార్కెట్లోకి తెచ్చే వరకూ అయిన ఖర్చు రూ.71 కోట్లకు పైనే

ఫ్రిజ్‌లో పెడితే ఏడాది పాటు నిల్వ ఉంటుందని చెబుతున్న కొత్తరకం ఆపిల్‌ ఆదివారం అమెరికా మార్కెట్లో అమ్మకానికి వచ్చింది. ఈ ఆపిల్‌ను తయారు చేయడానికి రెండు దశాబ్దాలు పట్టింది.

కాస్మిక్ క్రిస్ప్ అని పిలుస్తున్న ఈ కొత్తరకం ఆపిల్‌ను హనీక్రిస్ప్, ఎంటర్‌ప్రైజ్ అనే రెండు ఆపిల్ రకాల మిశ్రమం (క్రాస్ బ్రీడ్)గా అభివృద్ధి చేశారు. 1997లో వాషింగ్టన్ స్టేట్ యూనివర్శిటీలో దీన్ని తొలిసారి సాగు చేశారు.

'గట్టిగా, కరకరలాడుతూ, జూసీగా' ఉండే ఈ ఆపిల్‌ను మార్కెట్లోకి తెచ్చే వరకూ అయిన ఖర్చు 10 మిలియన్ అమెరికన్ డాలర్లు. (రూ.71 కోట్లకు పైనే)

ఈ ఆపిల్స్‌ను సాగు చేసేందుకు వాషింగ్టన్ స్టేట్ యూనివర్శిటీలోని రైతులను మాత్రమే అనుమతించారు. వీరు వచ్చే దశాబ్ది కోసం ఈ పండ్లను సాగు చేశారు.

''మరింత కరకరలాగే, ఎక్కువ గట్టిదనం ఉన్న పండు ఇది. తియ్యదనం, ఆకర్షించే గుణాల చక్కటి కలబోత అయిన ఈ ఆపిల్ చాలా జూసీ కూడా'' అని వాషింగ్టన్ స్టేట్ యూనివర్శిటీలో ఆపిల్స్ సాగు కార్యక్రమానికి నేతృత్వం వహించిన వారిలో ఒకరైన కేట్ ఇవాన్స్ తెలిపారు.

సాధారణంగా ఆపిల్స్ కోసినప్పుడు ఎక్కువ సేపు బయట పెడితే గోధుమ రంగులోకి మారిపోతుంటాయి. అయితే, ఈ ఆపిల్ మాత్రం గోధుమ రంగులోకి చాలా నెమ్మదిగా మారుతుందని ఆమె చెప్పారు. ''రిఫ్రిజిరేటర్‌లో నిల్వ చేస్తే క్వాలిటీ చెక్కు చెదరకుండా ఈజీగా 10 నుంచి 12 నెలల పాటు ఉంటుంది'' అని ఆమె అన్నారు.

కోటీ 20 లక్షలకు పైగా కాస్మిక్ క్రిస్ప్ ఆపిల్ మొక్కల్ని వాషింగ్టన్ స్టేట్ యూనివర్శిటీ రైతులు సాగు చేస్తున్నారు. అయితే, కఠినమైన లైసెన్సింగ్ వ్యవస్థ వల్ల దేశంలోని మరే ఇతర ప్రాంతాల్లో కూడా వీటిని వారు సాగు చేయలేరు.

ఈ ఆపిల్స్‌ని వాస్తవానికి డబ్ల్యుఏ38 పేరుతో పిలిచేవారు. అయితే, రాత్రిపూట ఆకాశాన్ని ప్రతిబింబించేలా.. ముదురు ఎరుపు రంగు ఆపిల్స్ మీద చిన్న చిన్న తెల్లటి చుక్కలు చెల్లా చెదురుగా ఉండటాన్ని స్ఫూర్తిగా తీసుకుని వీటిని కాస్మిక్ క్రిస్ప్ ఆపిల్స్ అని పిలుస్తున్నారు.

అమెరికాలో అత్యధికంగా ఆపిల్స్‌ను అందించేది వాషింగ్టనే. అక్కడ బాగా ప్రాచుర్యం పొందిన గోల్డెన్ డిలీషియస్, రెడ్ డిలీషియస్‌ రకం ఆపిల్స్‌కు పింక్ లేడీ, రాయల్ గాలా రకం ఆపిల్స్‌ నుంచి తీవ్రమైన పోటీ ఎదురవుతోంది.

అమెరికాలో అరటి పండ్ల తర్వాత అత్యధికంగా అమ్ముడయ్యే పండ్లు ఆపిల్స్.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు

క‌రోనావైర‌స్: మేడిన్ ఆంధ్రప్రదేశ్ టెస్టింగ్ కిట్లు.. పీపీఈలు, వెంటిలేటర్లు, మాస్కుల్ని కూడా ఉత్పత్తి చేస్తున్న ఏపీ

కరోనావైరస్: ఇది ఆంక్షలు సడలించే సమయం కాదు - డబ్ల్యుహెచ్ఓ

కరోనా వైరస్‌పై వియత్నాంలోని కమ్యూనిస్ట్ ప్రభుత్వం ఎలా పోరాడుతోంది

కరోనావైరస్-అమెరికా: బాధితుల్లో నల్లజాతీయులు ఎక్కువగా ఉండటానికి కారణాలేంటి

కరోనావైరస్: ఈ వ్యాధి చికిత్సకు క్లోరోక్విన్ పనిచేస్తుందా.. అందుకు ఆధారాలు ఉన్నాయా

తూర్పు గోదావరిలో మొదలైన కరోనావైరస్ రక్షణ సూట్ల తయారీ

కరోనావైరస్-లాక్‌డౌన్ ఎప్పుడు, ఎలా ముగుస్తుంది

కరోనావైరస్: కొన్ని దేశాల ప్రజలు మాస్క్‌లు వాడతారు, మరికొన్ని దేశాల ప్రజలు వాడరు, ఎందుకు

ఇండియా లాక్‌డౌన్: ‘‘చివరి చూపూ దక్కించుకోలేకపోయాం’’