రష్యా సైన్యంలోకి హస్కీ డాగ్స్: ‘సైనిక వాహనాలు వెళ్లలేని ప్రదేశాలకూ ఇవి వెళ్లగలవు’

  • 10 డిసెంబర్ 2019
సైబీరియన్ హస్కీ శునకం Image copyright RUSSIAN DEFENCE MINISTRY/YOUTUBE

రష్యా ఉత్తర భాగాన ఆర్కిటిక్ ప్రాంతంలో రవాణా కోసం మళ్లీ శునక శక్తిని అక్కడి సైనికులు ఉపయోగించబోతున్నారు.

రష్యా ఉత్తర దళానికి చెందిన మోటార్-రైఫిల్ బలగం తమ నిఘా బృందంతో పనిచేయటానికి సైబీరియన్ హస్కీ శునకాలకు శిక్షణనిస్తోంది. ముర్మాన్‌స్కీ వెస్ట్నిక్ వార్తా పత్రిక కథనం ప్రకారం.. ముర్మాన్స్క్ ప్రాంతంలోని అలాకుర్టి గ్రామంలో ఈ శిక్షణ కార్యక్రమం జరుగుతోంది.

ఇప్పటికే, తూర్పు సైబీరియాలోని చుక్చీ ప్రజలు స్లెడ్లను లాగటానికి ఉపయోగించే హస్కీ శునకాలు పదింటిని సేకరించి ఒక ప్రజనన కొట్టం కూడా ఏర్పాటు చేశారు.

రెండు శునకాలు కలిసి ఒక స్లైడర్‌ మీద ఉన్న ఒక సైనికుడిని లాగటంలో, నాలుగు శునకాలు కలిసి ఒక స్లెడ్‌ మీద మెషీన్‌గన్‌తో ఉన్న సైనికుడిని లాగటంలో సైనిక శునక శిక్షకులు తర్ఫీదు ఇస్తున్నారు.

Image copyright ZVEZDA TV

''జాక్ లండన్‌ ‘అడవి పిలిచింది’ తదితర కథల్లో లాగా మంచు మైదానాలను శునకాల స్లెడ్లతో చీల్చుకుంటూ వెళ్తూ అలాస్కాను జయించిన ధీరుల్లాగా వారు భావిస్తుండాలి'' అని ఆ పత్రిక వ్యాఖ్యానించింది.

ఈ శునకాలకు శిక్షణ ఇవ్వటం, వాటి బాగోగులు చూసుకోవటం గురించి సైనికులు కూడా శిక్షణ పొందుతున్నారు.

ప్రస్తుత కార్యక్రమాలు కేవలం ఈ విషయంలో నైపుణ్యాలు నేర్చుకోవటం కోసమేనని.. అయితే త్వరలో కార్యాచరణ దశలోకి చేర్చటం జరుగుతుందని రక్షణ మంత్రిత్వశాఖ టీవీ చానల్ వెజ్డా చెప్పింది.

Image copyright ZVEZDA TV

ఆరు వారాల శిక్షణ కార్యక్రమంలో మనిషి, శునకం చక్కగా కలిసి పనిచేయటం నేర్చుకోవాల్సి ఉంటుంది. అయితే, ఈ క్రమంలో కొన్ని ఆటుపోట్లు ఎదురయ్యాయి. సైనికులు మంచులో పడిపోవటం, కుక్కలు పరికరాలలో చిక్కుకుపోవటం లేదా తప్పించుకుని పోవటానికి ప్రయత్నించటం వంటి ఘటనలు చోటుచేసుకున్నాయి.

మంచులో హస్కీల ఎంత ఉపయోగకరం అనే విషయంలో తమకు ఎటువంటి సందేహం లేదని సైన్యం చెప్తోంది. ''పూర్తిస్థాయి ఆర్కిటిక్ కిట్‌తో ఉన్న ఒక సాయుధ సైనికుడిని వేగంగా తీసుకెళ్లటానికి రెండు శునకాలు సులభంగా సాయపడతాయి. ముఖ్యంగా సైనిక వాహనాలు వెళ్లలేని చోటుకు ఇవి వెళ్లగలవు'' అని తెలిపింది.

కొన్ని బాలారిష్టాలు ఎలాగూ తప్పవు. ''అయితే, ఇప్పటివరకూ కుక్కలు ఏ సైనికుడినీ కరవలేదు. అవి వారిని చాలా ఇష్టపడుతూ నాకుతున్నాయి'' అని మర్మన్‌స్కీ వెస్ట్నిక్ కథనం వ్యాఖ్యానించింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు

కశ్మీర్‌, దిల్లీలకు చెందిన ఇద్దరు కలం స్నేహితులు రాసుకున్న ఉత్తరాల్లో ఏముంది...

కరోనావైరస్: దక్షిణ కొరియాలో ఒకే రోజులో రెట్టింపైన రోగుల సంఖ్య

ట్రంప్‌కు 70 లక్షల మంది స్వాగతం పలకడం సాధ్యమేనా...

మానసి జోషి: BBC Indian Sportswoman of the Year నామినీ

విశాఖ ఏజెన్సీ: తమ ఊరికి సొంతంగా రోడ్డు నిర్మించుకున్న ఈ గిరిజనులు ఏమంటున్నారో వింటారా...

ఛత్తీస్‌గఢ్ గిరిజనులపై బంగ్లాదేశ్ శరణార్థులు నిజంగానే ఆధిపత్యం చలాయిస్తున్నారా?

200 ఏళ్ల నాటి ఈస్టిండియా కంపెనీ పెయింటింగ్స్‌.. భారత్‌కు నచ్చలేదు, బ్రిటన్‌ ఇబ్బంది పడింది ఎందుకు

‘నగ్నంగా గుంపులుగా నిలబెట్టి, ‘ఫింగర్ టెస్ట్’లు చేశారు’: ఫిట్‌నెస్ పరీక్షల నిర్వహణ తీరుపై మహిళా ఉద్యోగుల అభ్యంతరం