డబ్బుతో పని లేకుండా వేల మందికి కొత్త మూత్రపిండాలు దక్కేలా చేసిన ఆర్థికవేత్త

  • 26 డిసెంబర్ 2019
మూత్రపిండాలు Image copyright Getty Images

మూత్రపిండాల మార్పిడి అవసరమైన రోగులకు దాతలు గతంలో కంటే ఇప్పుడు మెరుగ్గా దొరుకుతున్నారు. ఇందుకు కారణం.. నోబెల్ బహుమతి పొందిన ఆల్విన్ రోత్ అనే ఆర్థికవేత్త.

ప్రపంచవ్యాప్తంగా మూత్రపిండాల లభ్యత పెరిగడానికి ఆయనే కారణం.

మూత్రపిండాల దానం మిగతా అవయవాల దానం కంటే భిన్నమైనది. శరీరంలో రెండు మూత్రపిండాలు ఉన్నప్పటికీ ఒక్క మూత్రపిండంతోనూ హాయిగా బతికే అవకాశం ఉండడంతో బతికి ఉన్నవారూ ఒక మూత్రపిండాన్ని దానం చేయొచ్చు.

మూత్రపిండం అవసరమైన రోగులకు కుటుంబసభ్యులు, బంధువులలో ఎవరైనా దానమిచ్చేందుకు ముందుకొచ్చినా అది ఆ రోగికి నప్పని పరిస్థితి ఉండొచ్చు.

చిత్రం శీర్షిక ప్రొఫెసర్ ఆల్విన్ రోత్

కానీ, ప్రొఫెసర్ ఆల్విన్ దాతలు, గ్రహీతలతో నెట్‌వర్క్ ఏర్పాటుచేసిన తరువాత ఇలాంటి పరిస్థితులు మారిపోయాయి.

ఈ నెట్‌వర్క్‌లో కిడ్నీలు సరిపోలని దాత-గ్రహీతల జోడీలు ఉంటాయి. ఈ నెట్‌వర్క్‌లోని దాత-గ్రహీతల జోడీలు బదిలీ చేసుకోవడం వల్ల కిడ్నీలు సరిపోలే దాత-గ్రహీతల కొత్త జోడీలు కుదురుతాయి.

ఈ క్రమంలో కిడ్నీలు సరిపోలడం ప్రాతిపదికగా కొత్త దాత-గ్రహీతలు ఏర్పడతాయి. అప్పుడు ఎక్కువ మంది రోగులకు మూత్రపిండాలు లభ్యమవుతాయి.

ప్రపంచంలో ఇరాన్ మినహా మిగతా దేశాల్లో మూత్రపిండాలు విక్రయించడం చట్టవిరుద్ధం. ప్రజల్లో ఎవరైనా రకరకాల కారణాల వల్ల తమ అవయవాలను డబ్బుకోసం విక్రయించుకునే ప్రమాదం ఉంటుందన్న ఉద్దేశంతో దాదాపు అన్ని దేశాల్లో అవయవాలు అమ్ముకోవడం చట్టవిరుద్ధం.

''ప్రపంచంలో దాదాపు ఎక్కడా ఇలాంటి కిడ్నీ మార్పిడి విధానంలో ధరలకు ప్రమేయం లేకుండా ఉండాలన్నదే మా ఉద్దేశం'' అని ప్రొఫెసర్ ఆల్విన్ చెప్పారు.

ఈ విధానం వల్ల అమెరికాలో ఏటా వెయ్యి మంది గ్రహీతలు తమకు నప్పే కిడ్నీలున్న దాతలను గుర్తించగలుగుతున్నారని చెప్పారాయన.

Image copyright Nobel
చిత్రం శీర్షిక 2012లో ప్రొఫెసర్ ఆల్విన్ రోత్‌కు ఆర్థిక శాస్త్రంలో నోబెల్ బహుమతి వచ్చింది

జర్మన్ ఎక్స్చేంజ్

ఆరోగ్య సేవల రంగం భవిష్యత్తుపై చర్చించేందుకు కొందరు నోబెల్ ప్రైజ్ విజేతలు, ఇతర దిగ్గజాలు బెర్లిన్‌లో సమావేశమైనప్పుడు అక్కడ ప్రొఫెసర్ ఆల్విన్‌ను కలిశాం. ''మూత్రపిండాల మార్పిడికి సంబంధించిన అధికారిక నియమనిబంధనలను ప్రతి మార్కెట్‌(దేశం)లో ఎప్పటికప్పుడు సమీక్షించాల''న్నారాయన.

జర్మనీలో దీనిపై నిషేధం ఉండడానికి గల కారణాలను తాను అర్థం చేసుకోగలనని.. మూత్రపిండాల అక్రమ రవాణా జరగొచ్చన్న ఆందోళనలతో అక్కడ నిషేధం విధించారని ప్రొఫెసర్ ఆల్విన్ అన్నారు.

Image copyright Getty Images

మూత్రపిండాలు అమ్ముకుంటున్నారా?

భవిష్యత్తులో ప్రజలు మూత్రపిండాలు దానం చేసినందుకు ప్రతిఫలం పొందే మార్గాన్నీ యోచిస్తున్నారు.

అధికాదాయ దేశాల్లోని గ్రహీతలకు అల్పాదాయ దేశాల దాతల నుంచి కిడ్నీలు అందించి అందుకు వైద్య ఖర్చులు చెల్లించే ఒక పైలట్ ప్రోగ్రామ్‌ను ప్రపంచ ఆరోగ్య సంస్థ వ్యతిరేకించింది.

'అధికారిక నిబంధనల అడ్డంకి వల్ల రోగులు చనిపోతే అది సిగ్గుచేటు'' అని ఇలాంటి కార్యక్రమానికి మద్దతు పలుకుతున్న ప్రొఫెసర్ ఆల్విన్ అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు

భారత్-పాక్ ఉద్రిక్తతల సమయంలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన పాకిస్తాన్ సైన్యం ప్రతినిధి బదిలీ

సానియా మీర్జా: క్రీడల్లో సత్తా చాటిన మరో అమ్మ

అసదుద్దీన్ ఒవైసీ: 'ఇద్దరు పిల్లల విధానం' అసలు సమస్యలను పక్కదోవ పట్టించడానికే

వినోదం కోసం ఇంట్లో చిరుతల్ని పెంచుకుంటున్నారు

కరీమ్ లాలా: ఈ ముంబయి మాఫియా డాన్‌ను ఇందిరా గాంధీ ఎందుకు కలిశారు?

చైనా కొత్త వైరస్: 'ఇప్పటికే వందలాది మందికి సోకింది... ఇతర దేశాలకు విస్తరిస్తోంది'

అమరావతి ఆందోళనల్లో మహిళలు: ‘వంట చేసి, నేరుగా దీక్షా శిబిరాలకే వస్తున్నాం’

ఓయూ ప్రొఫెసర్ కాశిం అరెస్ట్... నాలుగేళ్ల కిందటి కేసులో అదుపులోకి తీసుకున్న గజ్వేల్ పోలీసులు