క్రిస్మస్ బహుమతులు రుచిచూసే జంతువులు, పక్షుల ఉత్సాహం కెమెరా కంటితో చూస్తే...

క్రిస్‌మస్ బహుమతి

ఫొటో సోర్స్, EPA

ప్రపంచవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ఉన్న జంతు ప్రదర్శన శాలల్లో జంతువులు, పక్షులు కొన్నిరోజులుగా చాలా ఉత్సాహంగా ఉన్నాయి.

ఈ ఫొటోను కాలీలో తీశారు. ఒక్కొక్క గిఫ్ట్ బాక్సునూ ఓపెన్ చేస్తున్న ఈ సింహం ఒకదాని పనిపట్టాక, ఇంకో దాని దగ్గరకు వెళ్తోంది.

సింహానికి ఈ బహుమతి చాలా నచ్చినట్టుంది, అందుకే ముందు దాన్ని తీరికగా ఖాళీ చేస్తోంది.

ఇవి ఫ్రాన్స్, జర్మనీ, కొలంబియా, న్యూజీలాండ్ జూల నుంచి వచ్చిన కొన్ని ఫొటోలు.

ఫొటో సోర్స్, Getty Images

ఇది నాకు మాత్రమే..

ఓరానాలో తనకు ఇష్టమైన చీజ్ బహుమతిగా ఇవ్వడంతో గొరిల్లా ఈ స్టైల్లో ఫొటోకు ఫోజులిచ్చింది.

మీకు మీ క్రిస్మస్ బహుమతి ఇంకా అందుండకపోవచ్చు. కానీ వీటికి ప్రతి రోజూ గిఫ్ట్ అందుతోంది. ఆ గిఫ్ట్‌లో వాటికి ఇష్టమైన ఆహార పదార్థాలు ఉంటున్నాయి.

ఫొటో సోర్స్, Getty Images

పరుగుకు బ్రేక్...

ఈ ఫొటో కూడా ఓరానాలో తీసిందే.. చిరుతపులులు ఎక్కువగా తాము వేటాడే ప్రాణులను వెంటాడుతూ కనిపిస్తాయి. కానీ ఇలా గిఫ్ట్ ప్యాక్ ఓపెన్ చేస్తుండడం ఎవరూ చూసుండరు.

వాటిని అందంగా ప్యాక్ చేసి ఆయా జంతువులు, పక్షుల ముందు పెడుతున్నారు.

తర్వాత ఆ గిఫ్ట్ ప్యాక్ తెరిచే ప్రయత్నం మొదలవుతుంది. కొన్ని వెంటనే తెరిచేస్తే, మరికొన్ని మాత్రం దానికి బాగా టైం తీసుకుంటాయి.

ఫొటో సోర్స్, Getty Images

ఈ ప్రాణులు వాటిని తెరవడం చూస్తుంటే, మన గిఫ్ట్ ఓపెన్ చేస్తున్నప్పుడు మనకు ఎంత ఉత్సాహంగా ఉంటుందో అలాగే ఉన్నట్టు అనిపిస్తుంది.

వరసగా గిఫ్టుల మీద గిఫ్టులు వచ్చి పడుతుండడంతో ఇవి ఉక్కిబిక్కరి అయ్యాయి.

ఫొటో సోర్స్, AFP

ఉడుత కోతికి పెద్ద బహుమతి...

ఈ ఫొటోలు ఫ్రాన్స్‌లో జూ డే పెష్హెరెలో తీశారు. స్క్విరల్ మంకీస్ తమ గిఫ్టులు తెరుస్తూ కనిపిస్తాయి.

ఫొటో సోర్స్, AFP

గిఫ్ట్ అందుకుంటూ ఇవి ఎంచక్కా ఫొటోలకు ఫోజు కూడా ఇచ్చాయి.

ఫొటో సోర్స్, AFP

ఫ్యామిలీ సెలబ్రేషన్స్

ఈ ఫొటోలను ఉత్తర జర్మనీలోని హాంబర్గ్‌లోని తియర్‌పార్క్ హగన్‌బాక్ జూలో తీశారు.

ఏనుగుల కోసం ఈ గిఫ్ట్ బాక్సుల్లో పండ్లు, డ్రైఫ్రూట్స్ నింపారు.

అవి అందడమే ఆలస్యం ఓపెన్ చేసిన ఈ ఏనుగుల కుటుంబం, వాటిని ఖాళీ చేయడంలో బిజీ అయిపోయింది.

ఫొటో సోర్స్, AFP

స్వీట్ కాండీ..

కొలంబియాలోని కైలీ జూలో ఉన్న ఈ బబూన్ కాండీని రుచిచూస్తోంది.

రుచి బాగుందేమో, ఇది తన్మయత్వంతో దానిని ఆస్వాదిస్తున్నట్టు కనిపిస్తోంది.

ఫొటో సోర్స్, AFP

నాకోసం ఏముంది...

కాలిలో ఈ నల్ల చిరుత కోసం ఈ గిఫ్ట్ బాక్సును ప్రత్యేకంగా పంపించారు.

ఈ జాగ్వార్‌ పోజు చూస్తుంటే ఇందులో ఏముందబ్బా... అని ఆలోచిస్తున్నట్టు ఉంది.

ఫొటో సోర్స్, Getty Images

బహుమతి విప్పుతున్న చిలకమ్మ

ఈ ఫొటో న్యూజీలాండ్ ఓరానా వైల్డ్ లైఫ్ పార్కులో తీసింది.

క్రైస్ట్ చర్చ్‌లో ఉన్న ఈ పార్క్‌లో ఉంటున్న ఈ కియా పారెట్ (ఈ చిలుక జాతి, సాధారణ చిలుక కంటే పెద్దగా ఉంటుంది)కు క్రిస్మస్ బహుమతి అందింది. దాన్ని అది తనదైన శైలిలో తీసింది.

ఫొటో సోర్స్, AFP

ఇక, ఈ కాప్చున్ కోతి తనకంటే పెద్దగా ఉన్న గిఫ్ట్ బాక్సును ఆసక్తిగా చూస్తోంది. అందులో ఏముందా అని ఆలోచిస్తోంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)