జపాన్‌లో డబ్బులిచ్చి ఉద్యోగాలు మానేస్తున్నారు.. ఎందుకు?

  • 29 డిసెంబర్ 2019
ఉద్యోగం ఊడిపోవాలా Image copyright ALAMY STOCK PHOTO

ఉద్యోగం దొరకడం అందరికీ అంత సులువు కాదు, కానీ కొంతమంది ఉద్యోగం వదలడానికి కూడా అష్టకష్టాలు పడతారు. దానికోసం వాళ్లు చిత్ర, విచిత్రమైన పనులకు కూడా సిద్ధమవుతారు.

చేసే ఉద్యోగాన్ని వదిలించుకోడానికి కొంతమంది తాము చనిపోయామనే వార్తలను కూడా ప్రచారం చేస్తారు.

కొంతమంది ఉద్యోగులు బాస్‌కు తమ గురించి అబద్ధాలు చెప్పడానికి కిరాయి మనుషులను ఏర్పాటు చేసుకుంటారు.

కొంతమంది అసలు ఏం చెప్పకుండా ఆఫీసు నుంచి మాయమైపోతారు. ఇలాంటి వాటి వల్ల ప్రమాదాలు కూడా ఉంటాయి.

తక్షణం ఉద్యోగం వదిలేయడంలో యుఇషిరో ఓకాజాకీ, తొషియుకీ నినోలను మించిన వారు ఎక్కడా ఉండరు. గత 18 నెలల్లో వాళ్లు 1500 ఉద్యోగాలకు మంగళం పాడారు.

టోక్యోలో ఉండే ఈ ఇద్దరూ స్వయంగా తమ ఉద్యోగాలు వదులుకోలేదు. వాళ్లు రూపొందించిన ఒక స్టార్టప్ కంపెనీ ఉద్యోగాలు వదిలేయాలనే వారికి సాయం చేస్తుంటుంది.

"ఉద్యోగులు ఎక్కువగా జనం తమ బాస్‌కు భయపడతారు. బాస్ దానికి ఒప్పుకోడేమో అని వణికిపోతారు" అని ఓకాజాకీ చెప్పారు.

Image copyright Getty Images

జపాన్‌లో ఉద్యోగం వదలడం తప్పు

జపాన్ సంస్కృతిలో ఏదైనా ఒక పనిని, ఉద్యోగాన్ని వదిలిపెట్టడం చాలా తప్పుగా భావిస్తారు. దాంతో, ఎవరైనా ఉద్యోగం వదిలేయాలని అనుకున్నా, అలా చేస్తే అందరి ముందు తప్పు చేసినవాడిలా తల దించుకోవాలేమో అని భయపడతారు.

టోక్యోలోని ఎగ్జిట్(EXIT) కంపెనీ ఇలాంటి వారికోసమే పనిచేస్తుంది. వారికి 50 వేల యెన్(దాదాపు 33 వేలు) ఫీజ్ చెల్లిస్తే చాలు అన్నీ వాళ్లే చూసుకుంటారు. కంపెనీ ఎగ్జిక్యూటివ్ మీ బాస్‌కు ఫోన్ చేస్తారు. మీ తరఫున రాజీనామా కూడా ఇచ్చేస్తారు. కొన్ని విషయాల్లో మీరు ఎక్కడకూ ఫోన్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు.

చాలాసార్లు కంపెనీలు ఎగ్జిట్‌తో ఒప్పందం చేసుకోవాలని అనుకోవు. ఉద్యోగం వదిలేసే విషయం ఉద్యోగి స్వయంగా వచ్చి చెప్పాలని పట్టుబడతాయి.

ఏదేమైనా, పని పూర్తైపోయి, ఉద్యోగం నుంచి విముక్తి కలిగితే వారి క్లయింట్ హాయిగా ఊపిరి పీల్చుకుంటారు.

"ఒకసారి నా క్లయింట్ నాతో 'మీరు నిజంగా దేవుడు' అన్నారు. ఆయన పదేళ్ల నుంచీ ఉద్యోగం వదిలేయాలని అనుకున్నారు. ఆ పనిలో తను నిజంగా చాలా కష్టాలు పడ్డారు" అని ఓకాజాకీ చెప్పారు.

జపాన్‌లో ఎగ్జిట్ లాగే దాదాపు 30 కంపెనీలు ఇలాంటి సేవలు అందిస్తున్నాయని ఓకాజకీ చెప్పారు.

జపాన్ సంప్రదాయం ప్రకారం ఒక ఉద్యోగి తన మొత్తం జీవితం ఒకే యజమాని దగ్గరే పనిచేస్తారు. కానీ, ఇటీవల కొన్నేళ్లుగా చాలా మంది ఉద్యోగాలు మార్చేస్తున్నారు. సంప్రదాయాన్ని పక్కన పెట్టేస్తున్నారు.

Image copyright Getty Images

అనుకోగానే సీట్లోంచి మాయమైపోతే...

కార్మికుల సంఖ్య తగ్గిపోతుండడం అనేది, జపాన్‌లో కొత్త ఉద్యోగాలు వెతుక్కునేవారికి ఆ పనిని మరింత సులభంగా మార్చింది.

"జనం మారుతున్నారు. కానీ సంస్కృతి మారడం లేదు. దానితోపాటు కంపెనీలు కూడా మారడం లేదు. అందుకే జనాలకు మా సాయం అవసరం అవుతోంది" అంటారు ఓకోజాకీ.

'ఉద్యోగం వదిలేస్తున్నాను' అనే నోటీసు వేరే వాళ్ల చేతికి ఇవ్వడం, సాధారణంగా రాజీనామా ఇచ్చే పద్ధతి కాదు. కానీ ఉద్యోగం ఎలా వదలాలి? అనే సందేహం చాలా మందిని తొలిచేస్తోంది అని ఆయన చెప్పారు.

బాస్‌తో మాట్లాడడం అనేది ఇప్పటికీ చాలా మంచి ప్రత్యామ్నాయం. కానీ ఉద్యోగం వదిలేయాలని అనుకున్నప్పుడు ఆ నిర్ణయం చాలా పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది.

మనం వెంటనే ఉద్యోగం వదలాల్సిన అవసరం ఏదైనా ఉంటే, లేదా మనం కోరుకున్న ఉద్యోగం దొరక్కపోతే, లేదా మనం అసలు చేయలేని పనిలో కొనసాగాల్సి వస్తుంటే.. అలాంటప్పుడు ఏం చేస్తారు?

ఇష్టం లేని ఉద్యోగంలో పనిచేస్తూ కొన్ని రోజుల్లోనే గందరగోళంగా వింత భాషలో మాట్లాడక ముందే మీరు ఆ సీట్లో నుంచి మాయమైపోతే ఎలా ఉంటుంది?

ఆఫీసుల్లో ఇలాంటి పరిస్థితిని 'ఘోస్టింగ్' అంటారు. ఈ పదం డేటింగ్ ప్రపంచం నుంచి వచ్చింది. ఏ స్పష్టతా ఇవ్వకుండా, లేదా కారణం చెప్పకుండానే హఠాత్తుగా అన్ని సంబంధాలు తెంచుకోవడమే ఘోస్టింగ్.

Image copyright Thinkstock

ప్రపంచంలో పెరుగుతున్న 'ఘోస్టింగ్'

చాలా ఆఫీసుల్లో ఉద్యోగులు ఇలా చేయడం ఇప్పుడు ఎక్కువవుతోంది.

గత ఏడాది అమెరికా ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ దేశ ఆర్థిక స్థితిపై జారీ చేసిన తన రిపోర్టు (బేస్ బుక్)లో కూడా దీని గురించి ప్రస్తావించింది.

అమెరికా వర్జీనియాలో వెబ్ డిజైన్ కంపెనీ నడిపే క్రిస్ యోకోకు కూడా ఇలాంటిదే చెప్పారు.

యోకో ఒక కాంట్రాక్టర్‌కు డిజిటల్ ప్రాజెక్ట్ పని అప్పగించారు.

కానీ రోజులు గడిచిపోయినా, అతడు ఆ ప్రాజెక్ట్ చేయలేదు. యోకో ఈమెయిల్ పంపించారు. ఫోన్, మెసేజ్ అన్నీ చేశారు. కానీ ఏ సమాధానం రాలేదు.

చివరికి ఆ పని వేరే వాళ్లకు అప్పగించారు. కొన్ని రోజుల తర్వాత యోకోకు ఒక వ్యక్తి ఈమెయిల్ వచ్చింది. అతడు నేను ఆ కాంట్రాక్టర్ ఫ్రెండ్ అని చెప్పారు.

యోకో పని ఒప్పుకున్న కాంట్రాక్టర్ కారు యాక్సిడెంటులో చనిపోయాడని చెప్పారు. కానీ, అనుమానంతో ఆ కాంట్రాక్టర్ ట్విటర్ అకౌంట్ చెక్ చేసిన యోకోకు అతను సజీవంగా ఉన్నట్టు తెలిసింది. కొన్ని రోజుల ముందే అతను ఒక పార్టీకి సంబంధించి ట్వీట్ కూడా చేశారు.

Image copyright Getty Images

కొత్తకు వెల్‌కమ్ .. పాతకు బై బై

వేరే ఉద్యోగం దొరికితే, ముందు ఉద్యోగం వదిలేస్తారు.

ఉద్యోగం వదిలేయడానికి చనిపోయినట్లు అబద్ధం చెప్పించడం అనేది చాలా దారుణమైన ఉదాహరణ.

కానీ, ఆఫీస్ నుంచి వెళ్లిపోవడం, బాస్‌తో అన్ని కాంటాక్ట్స్ కట్ చేసుకోవడం కూడా పెరుగుతోంది.

బ్రిటన్ రీటెయిల్ సెక్టార్‌లో పనిచేసే ఒక మేనేజర్ చెప్పకుండానే ఉద్యోగం వదిలేశారు. అతని కాంట్రాక్టులో 3 నెలల నోటీస్ పిరియడ్ పూర్తి చేయాలనే షరతు ఉంది. కానీ ఆయనకు కొత్త ఉద్యోగం వచ్చింది, అక్కడ తన అవసరం చాలా ఉంది. దాంతో, అతను వెంటనే వెళ్లిపోయారు.

ఇది అతని కెరీర్ ప్రారంభంలో జరిగింది. అప్పట్లో మాంద్యం ఉండేది. ఉద్యోగం వదలడం అనేది యజమానితో ఉన్న సంబంధాలు ఎంత అభద్రతతో, అస్థిరంగా ఉన్నాయి అనేదానిపై ఆధారపడి ఉంటాయని అతను చెప్పారు.

"ఏడాది చివర్లో జరిగే రివ్యూలో నా కొలీగ్స్ ఉద్యోగాలు పోవాల్సింది. కానీ వాళ్లు నాకు ఎప్పుడూ కనిపించలేదు. ఎందుకంటే వారిని టీమ్ నుంచి ముందే తీసేశారు" అని చెప్పారు.

కొన్ని సంస్థల యజమానులు ఎంత నిరాసక్తతతో ఉంటారంటే, ఒక ఉద్యోగిగా "రేపు నేను నిజానికి ఆఫీసుకు రావాల్సిన అవసరం లేదు" అని ఆలోచించాల్సి ఉంటుంది.

ఇక్కడ ఉద్యోగి మాత్రమే చెప్పకుండా మాయమైపోరు. ఉద్యోగాలు ఇచ్చే వారి నుంచి కూడా ఎలాంటి సంకేతాలు రావు.

ఎక్కువ మందికి ఇలాంటి అనుభవం ఉంటుంది. ఉద్యోగం కోసం వేసిన అప్లికేషన్‌ అసలు ఏమయ్యిందో తెలీదు. ముఖాముఖి ఇంటర్వ్యూ తర్వాత చాలా మందికి సమాధానం కూడా అందదు.

Image copyright AFP

యజమాన్యం కూడా అంతే

ఒక యాజమాన్యం తన దగ్గర పత్రాలు కూడా రాయించుకుందని, రిటన్ పరీక్ష కూడా ఇచ్చానని, మూడు రౌండ్ల ఇంటర్వ్యూ కూడా అయ్యాక, తనను అసలు పట్టించుకోలేదని ఒక వ్యక్తి బీబీసీతో చెప్పారు.

పనిచేసేవారి గురించి సొంత శైలిలో నిర్ణయం తీసుకోవడం అనేది అభివృద్ధి చెందిన దేశాల జాబ్ మార్కెట్ మెరుగుదలకు సంకేతం అని రిక్రూట్‌మెంట్ కంపెనీ మైన్ పావర్ బ్రిటన్ ఎండీ క్రిస్ గ్రే అన్నారు.

ఎవరైనా ఒక ఉద్యోగి ఎక్కడైనా దాక్కుంటే, అతడిని మేం ఏం చేయగలం అని గ్రే ప్రశ్నించారు.

"మాయమైపోయిన వ్యక్తికి ఉద్యోగం ఇచ్చి, పని నేర్పించడంతోనే మీరు చాలా టైం ఖర్చు చేశారు. ఇప్పుడు అతడిని వెతకడానికి మరింత సమయం వృథా చేసుకోకూడదు" అంటారు గ్రే.

"ఇలాంటివి తగ్గించడానికి టాలెంట్ పూల్ ఏర్పాటు చేసుకోవాలని గ్రే సలహా ఇస్తారు. ఎంత వీలైతే అంత సంబంధాలు పెంచుకోవాలి. మన అవసరానికి ముందే వారి గురించి తెలుసుకోవాలి".

"ఉద్యోగులు తక్షణ అవసరాలను చూసుకుంటూ అప్పటికప్పుడు ఉద్యోగం వదలడం సరిగానే అనిపిస్తుంది. కానీ వారు దీర్ఘకాలిక పరిణామాల గురించి కూడా ఆలోచించుకోవాలి" అంటారు.

Image copyright Alamy

వీడ్కోలు చెప్పి వెళ్లండి

"డేటింగ్ ప్రపంచం లాగే, వెళ్తూ వీడ్కోలు కూడా చెప్పని వ్యక్తి గురించి ఎవరూ మంచిగా ఆలోచించరు".

ఈ ప్రవర్తనను అన్‌ప్రొఫెషనల్ అని అమెరికాలో ఉపాధి సలహాలు ఇచ్చే రాబర్ట్ హాఫ్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ డాన్ ఫే అంటారు.

"యజమాని అయినా, ఉద్యోగి అయినా నేను ఎవరికైనా ఎప్పుడైనా "ఏం చెప్పకుండా మాయమైపొమ్మని సలహా ఇవ్వను" అని ఆయన అన్నారు.

కంపెనీల్లో భర్తీ ప్రక్రియ వేగవంతం చేసి, దరఖాస్తు చేసినవారితో స్పష్టంగా సంప్రదింపులు జరిపి తమ వంతు పని పూర్తి చేయవచ్చు. కానీ 'ఘోస్టింగ్' మిమ్మల్ని బాధపెడుతుంది.

"మీ కెరియర్ తర్వాత భాగంలో ఆగి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి మళ్లీ తిరిగి ఎదురుపడొచ్చు. ఎవరు ఎక్కడికి వెళ్తున్నారో మీకు ఎప్పటికీ తెలీదు. మీరు వద్దనుకున్న వారే మిమ్మల్ని మళ్లీ కలిస్తే, అందుకే మీకు మీరు ప్రొఫెషనల్‌గా ఉండండి. ఏదేమైనా సరే" అంటారు డాన్ ఫే.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు

RSS 'ఇద్దరు పిల్లల ప్లాన్' వల్ల భారత్‌కు కలిగే లాభమేంటి.. జరిగే నష్టమేంటి

ఓయూ ప్రొఫెసర్ కాశిం అరెస్ట్.. నాలుగేళ్ల కిందటి కేసులో అదుపులోకి తీసుకున్న గజ్వేల్ పోలీసులు

అసలు పుతిన్ ఎవరు.. ఆయన ఏం కోరుకుంటున్నారు?

కీటకాలు అంతరిస్తున్నాయి.. అవి లేకపోతే మనిషి కూడా బతకలేడు

ఎవరి శవపేటికను వాళ్లే ఎందుకు తయారు చేసుకుంటున్నారు

ఆనందం ఏ వయసులో తగ్గిపోతుంది... సైన్స్ ఏం చెబుతోంది?

CAA: కేరళ దారిలో పంజాబ్... పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా తీర్మానం

ఆస్ట్రేలియా కార్చిచ్చు: కంగారూల ద్వీపాన్ని కమ్మేసిన మంటలు

IndVsAus: రాజ్‌కోట్ వన్డేలో ఆస్ట్రేలియాపై భారత్ సూపర్ హిట్... మూడు సెంచరీలు మిస్