పోప్ ఫ్రాన్సిస్: 'ఫోన్లు పక్కన పెట్టండి.. కుటుంబ సభ్యులతో మాట్లాడండి'

  • 30 డిసెంబర్ 2019
పోప్ ఫ్రాన్సిస్ తో సెల్ఫీ దిగుతున్న జంట. 2017 డిసెంబర్ 6వ తేదీన తీసిన చిత్రం Image copyright Getty Images

ఫోన్లు పక్కన పెట్టి ఒకరితో ఒకరు మాట్లాడుకోవాలని ప్రజలకు పోప్ ఫ్రాన్సిస్ పిలుపు ఇచ్చారు. భోజనం చేసేటప్పుడు ఒకరితో ఒకరు మాట్లాడుకోవాలని ఆయన సూచించారు. జీసస్, మేరీ, జోసెఫ్‌ కూడా ఇలాగే చేసేవారని పోప్ చెప్పారు.

"వాళ్లు (జీసస్, మేరీ, జోసెఫ్‌) ప్రార్థించారు, పనిచేశారు, ఒకరితో ఒకరు మాట్లాడుకున్నారు" అని సెయింట్ పీటర్స్ స్క్వైర్‌ వద్ద కిక్కిరిసిన ప్రజలను ఉద్దేశించి చెప్పారు.

"మన కుటుంబంతో మనం మాట్లాడటం తిరిగి ప్రారంభించాలి" అని పోప్ ఫ్రాన్సిస్ అన్నారు.

సోషల్ మీడియా వాడటంలో పోప్ ఫ్రాన్సిస్‌ చాలా ఆసక్తి చూపిస్తారు. ప్రజలు ఆయనతో తరచూ సెల్ఫీలు దిగుతూ ఉంటారు.

Image copyright Reuters

"మీ కుటుంబంతో ఎలా మాట్లాడాలో మీకు తెలుసా? లేదా భోజనం చేసేటప్పుడు కూడా ఫోన్లలో చాటింగ్ చేసే పిల్లల మాదిరిగానే మీరూ ఉన్నారా? అని నన్ను నేను ప్రశ్నించుకున్నాను" అని పోప్ అన్నారు.

"అలాంటి చోట ఎంత మంది ఉన్నా ఎవరూ మాట్లాడరు. మౌనమే రాజ్యమేలుతుంది" అని పోప్ ఫ్రాన్సిస్ చెప్పారు.

తల్లిదండ్రులు, పిల్లలు, సోదరులు, అక్కాచెల్లెళ్లు, చర్చి ఫాదర్లు అందరూ ఇక నుంచి ఫోన్లు పక్కన పెట్టి ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం మొదలుపెట్టాలని పోప్ సూచించారు.

"ఇక్కడ లేదా బసిలికా లోపల ఇలాంటి వేడుకలు జరుగుతున్నప్పుడు కూడా చాలా మంది ప్రజలు, చివరికి చర్చి అధికారులు, బిషప్‌లు కూడా ఫోన్లు పట్టుకుని నాకు కనిపిస్తారు. ఇది చాలా బాధాకరం" అని ఆయన అన్నారు.

ట్విటర్‌లో 18 మిలియన్ల మంది ఫాలోయర్లు ఉన్న పోప్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఇదే తొలిసారి కాదు.

ప్రజలు ఫోన్లుకు అతుక్కుపోవడంపై పోప్ తరచూ మందలిస్తూనే ఉన్నారు.

"వేడుకకు నాయకత్వం వహిస్తున్న ఒక మత పెద్ద ఒక దశలో 'మా మనసులను మెరుగుపర్చండి' అని అంటారు. ఫోటోలు తీసుకోవడానికి మొబైల్స్ పైకి ఎత్తండి అని ఆయన అనరు. ఇలా చేయడం చాలా వికారమైన విషయం" అని 2017లో పోప్ అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు

వైఎస్ జగన్మోహన్ రెడ్డి: 'ఈ పేద రాష్ట్రానికి మండలి అవసరమా'

నిర్భయ దోషులను చివరి కోరిక అడిగిన తీహార్ జైలు అధికారులు

బాంబే డక్: ‘భారతదేశ చేపల్లో అద్భుతమైన చేప’

‘అన్ని రకాల క్యాన్సర్లకూ చికిత్స చేసే టెక్నిక్‌’

'ఇంగ్లిష్ మీడియం బిల్లు'కు రెండోసారి ఏపీ అసెంబ్లీ ఆమోదం.. ఇప్పుడు మండలిలో ఏం జరుగుతుంది..

కరోనా వైరస్‌: చైనాలో మరో నగరానికి రాకపోకలు నిలిపివేత

‘రోహింజ్యాలపై మారణహోమం ఆపేందుకు చర్యలు తీసుకోండి’- మయన్మార్‌కు ఐసీజే ఆదేశం

ఆంధ్రప్రదేశ్: శాసన మండలిలో అసలేం జరిగింది? సెలెక్ట్ కమిటీ ఏం చేస్తుంది

చనిపోయిన వ్యక్తి నుంచి వీర్యం సేకరించి పిల్లలు పుట్టించొచ్చా