వీడియో: సెక్స్ కోరికలు ఎక్కువైన ఈ ప్లేబాయ్ తాబేలు 800 తాబేళ్లను పుట్టించింది

ఈక్వెడార్‌లోని గాలాపాగోస్ ద్వీపాల్లో ఉండే డియాగో అనే ఈ భారీ తాబేలు కామోద్దీపనలు తమ జాతి అంతరించిపోకుండా కాపాడాయి.

గాలాపాగోస్ ద్వీపాల్లో ఒకటైన శాంటా క్రూజ్ ద్వీపంలోని పార్కులో తాబేళ్ల పెంపకం కార్యక్రమం కోసం ఎంపిక చేసిన 14 మగ తాబేళ్లలో డియాగో ఒకటి.

1960ల నుంచి ప్రారంభమైన ఈ కార్యక్రమం విజయవంతమైది. ఇప్పటి వరకూ రెండు వేలకు పైగా భారీ తాబేళ్లు ఇక్కడ పుట్టి, పెరిగాయి.

దీనికి ప్రధాన కారణాల్లో ఒకటి డియాగో సెక్స్ కోరికలేనని కార్యక్రమ నిర్వాహకులు అంటున్నారు.

వందేళ్ల వయసున్న ఈ తాబేలు సుమారు 800 మందికి తండ్రి అయ్యింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)