పొరుగు దేశాల ముస్లింలను ‘బంధిస్తున్న’ చైనా.. ‘నిర్బంధ క్యాంపుల్లో కొడుతున్నారు, ఏవేవో ఇంజెక్షన్లు చేస్తున్నారు’

వీళ్లంతా ముస్లింలు. కజక్‌స్థాన్ నుంచి, సరిహద్దు దాటి పొరుగునే ఉన్న చైనాలోకి వెళ్లారు. 'చైనా మమ్మల్ని బంధిస్తోంది. చైనీయులుగా మార్చాలని చూస్తోంది' అంటున్నారు వీళ్లు.
చైనా మాత్రం వీరిని ‘ఒకేషనల్ స్కూళ్ల’లో చేరుస్తున్నామని, ఆ స్కూళ్లకు విద్యార్థులంతా తమంతట తాముగా వస్తున్నారని చెబుతోంది.
‘అవి స్కూళ్లు కాదు. క్యాంపులు, జైళ్లు’ అని బాధితులు అంటున్నారు.
ఈ క్యాంపులకు వెళ్లి, నెలల పాటు నిర్బంధంలో ఉండి బయటపడిన కొందరు కజక్ ముస్లింలతో బీబీసీ మాట్లాడింది.
వీడియో: పొరుగు దేశాల ముస్లింలను ‘బంధిస్తున్న’ చైనా
‘వాళ్లు మమ్మల్ని చైన్లతో కట్టేశారు. కొట్టేవారు. ఏవో ఇంజెక్షన్లు చేసేవారు’ అని బాధితులు చెప్పారు.
ముస్లిం మత విధానాల ప్రకారం చేతులు, ముఖం కడుక్కుంటుంటే.. ‘నీళ్లెందుకు తాగుతున్నావు?’ అని అడిగేవారని క్యాంపులో 17 నెలలు బంధీగా ఉన్న టుర్సిన్ బెక్ చెప్పారు.
‘కజక్ భాష మర్చిపోవాలని, చైనీస్ నేర్చుకోవాలని బలవంతం చేశారు. అలా నేర్చుకోకపోతే క్యాంపు నుంచి బయటకు వెళ్లడం కష్టం’ అన్నారని ఒరిన్ బెక్ అనే మరొక బాధితుడు తెలిపారు.
అయితే, ఇప్పుడు అందరినీ వదిలేశామని చైనా ప్రభుత్వం చెబుతోంది. కానీ, తమ వాళ్ల ఆచూకీ లభించట్లేదని వందలాది కుటుంబాలు చెబుతన్నాయి.
తమవాళ్లను ఎప్పుడు, ఎక్కడి నుంచి, ఎలా తీసుకెళ్లిందీ ఆయా కుటుంబాల వారు ఆధారాలతో సహా చెబుతున్నారు.
చైనా చెబుతున్న ‘ఒకేషనల్ స్కూళ్లు’ బాధితులు చెబుతున్న ‘నిర్బంధ క్యాంపులు’ ఇవే
అయితే, ‘ఒకేషనల్ స్కూళ్ల’లో ఉత్తీర్ణులైన అందరికీ పని చూపించడంలో ‘సాయం చేశాం’ అని చైనా వెల్లడించింది.
కానీ, అది ఉపాధి కాదని, బలవంతంగా చాకిరీ చేయించుకోవడం అని చైనా నుంచి బయటపడ్డ టుర్సిన్ బెక్ వివరించారు.
‘చైనా పోలీసులు పెట్టుకునే టోపీ మాకు పెడతారు. షీల్డు, లాఠీ ఇస్తారు. ఉదయం 7 గంటల నుంచి, రాత్రి 10 గంటల దాకా మేం కాపలా కాయాలి. మాకు తిండి పెట్టరు, డబ్బులూ ఇవ్వరు’ అని ఆయన తెలిపారు.
క్యాంపు నుంచి బయటికొచ్చిన తర్వాత అంతా పోలీసుల వద్ద రిజిస్టర్ చేసుకోవాలని, ఎక్కడికి వెళ్లాలన్నా పోలీసుల అనుమతి తీసుకోవాలని, అలా తీసుకోకపోతే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నట్లు చూస్తారని గుల్జీరా అనే ముస్లిం మహిళ తెలిపారు.
తనను చైనీయురాలిగా మార్చినా కూడా తాను మాత్రం తన కజక్, ముస్లిం గుర్తింపును కోల్పోలేదని, అల్లా తనను కాపాడారని ఆమె చెబుతున్నారు.
ఇవి కూడా చదవండి:
- చైనాలో అదృశ్యమైన వీగర్ ముస్లిం ప్రొఫెసర్ ఏమయ్యారు? మరణ శిక్ష విధించారా...
- వీగర్ ముస్లింలను కట్టుదిట్టమైన జైళ్ళలో బంధించి 'బ్రెయిన్‌వాష్' చేస్తున్న చైనా
- ముస్లిం కుటుంబాల నుంచి పిల్లలను మేం వేరు చేయడం లేదు: చైనా
- చైనాలోని ముస్లిం శిబిరాలపై ఓ యువతి చేసిన టిక్‌టాక్ వీడియో వైరల్
- ముస్లిం వీగర్లను వేధించారని 28 చైనా సంస్థలను బ్లాక్‌లిస్ట్‌లో పెట్టిన అమెరికా
- పది లక్షల మంది ముస్లింలను నిర్బంధించిన చైనా.. ఎలాంటి నేరం చేయలేదు.. ఎలాంటి విచారణ లేదు
- సముద్రజీవులను, భారీ తిమింగలాలను సైతం చంపేస్తున్న ‘ఘోస్ట్ గేర్’
- చైనాలో ఇస్లాం వ్యాప్తి చేస్తున్న పాకిస్తాన్ మదరసా విద్యార్థులు
- చైనాలో చర్చిలపై ఉక్కుపాదం... ప్రశ్నార్థకంగా మారిన మత స్వేచ్ఛ
- ముఖంపై ముసుగు ధరించడం ఏయే దేశాల్లో నిషిద్ధం?
- ఇస్లాంను మార్చేస్తున్న చైనా.. ఇందుకోసం పంచవర్ష ప్రణాళిక
- ఆస్ట్రేలియాలో వేల సంఖ్యలో ఒంటెలను చంపేస్తున్నారు... ఎందుకు?
- ఆర్మీ కూలీ తల నరికి తీసుకెళ్లిన పాకిస్తాన్?
- #SatyaNadella: 'విచారకరం - బాధాకరం' - CAAపై మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల స్పందన
- బ్రిటన్ రాజవంశం: ప్రిన్స్ హ్యారీ, మేగన్‌ల ఆస్తుల విలువ ఎంత? వారికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి?
- ఆస్ట్రేలియా కార్చిచ్చు: 'నేల తల్లి బాగుండాలంటే పొదలు కాలిపోవాల్సిందే' అంటున్న ఆదివాసీలు
- ‘47 ఏళ్ల ఈ వ్యక్తి జేఎన్‌యూ విద్యార్థి.. 32 ఏళ్లుగా అక్కడే ఉంటున్నారు’ నిజమేనా? - BBC Fact Check
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)