ఏనుగు ఈ స్టార్‌ హోటల్‌కు రెగ్యులర్ కస్టమర్.. చూడండి ఏం చేస్తోందో

  • 21 జనవరి 2020
నట్ట కోట - ఏనుగు Image copyright Jetwing
చిత్రం శీర్షిక నట్ట కోట అని పిలిచే ఈ ఏనుగు ఇప్పుడు హోటల్‌లోనే ఉంటోంది

శ్రీలంక చూడ్డానికి వెళ్లే చాలామంది పర్యటకులు.. అక్కడ ఏనుగును చూడాలని కోరుకుంటుంటారు.

కొందరు మాత్రం లగ్జరీ హోటల్‌లో ఉండి, గది తలుపు తెరవగానే కారిడార్లో ఏనుగు తిరగాలని ఆశిస్తారు.

మరీ అతిగా ఆశిస్తున్నారు అనుకుంటున్నారా. శ్రీలంకలోని జెట్‌వింగ్ యాలా హోటల్లో తరచూ జరిగేది అదే మరి.

స్థానికంగా నట్ట కోట (కురచ తోక) అని పిలిచే ఏనుగు ఈ స్టార్ హోటల్‌లో కలియదిరుగుతూ, కనిపించిన వస్తువుల్ని తన తొండంతో కదుపుతూ ఉంది. ఈ వీడియో ఇప్పుడు వైరల్ అయ్యింది.

చాలామంది ఆశ్చర్యపోతూ ఈ వీడియోను షేర్ చేశారు. అయితే, యాలా జాతీయ పార్కు సమీపంలో ఉన్న ఈ హోటల్ సిబ్బంది మాత్రం ఇదంతా తమకు మామూలే అంటున్నారు. ఈ ఏనుగు 2013 నుంచి 'మా విశ్వసనీయమైన కస్టమర్' అని చెబుతున్నారు.

''మొదట్లో ఏడాదికి కొన్ని సార్లు మాత్రమే నట్ట కోట మా హోటల్‌కి వచ్చేవాడు.. సీజనల్‌ విజిటర్‌లాగా. తర్వాత పొదల్లోకి వెళ్లిపోయేవాడు. ఇప్పుడు మాత్రం బీచ్ పక్కన ఉన్న మిగతా రిసార్టులను కూడా తరచూ సందర్శిస్తున్నాడు'' అని జెట్‌వింగ్ హోటల్ అధికార ప్రతినిధి బీబీసీతో అన్నారు.

''కొన్నేళ్ల కిందట మా హోటల్‌లో శాశ్వతంగా మకాం పెట్టాడు. మేం కూడా నట్ట కోటను ఇబ్బంది పెట్టలేదు. చెట్ల నీడలో పడుకునేవాడు, హోటల్‌ మొత్తం తిరిగేవాడు'' అని ఆ ప్రతినిధి తెలిపారు.

Image copyright facebook/JetwingYala

అయితే, నట్ట కోట ఎల్లప్పుడూ ఇంత మంచిగా ఉండేవాడు కాదు. కార్లలోంచి పండ్లను, కిచెన్‌లో నుంచి ఆహార పదార్థాలను దొంగిలించేవాడు.

అయితే, తాము అతడిని ఎప్పుడూ కొట్టలేదని, ఇలాంటి 'చిలిపి పనులు' చేసినా వదిలేసేవాళ్లమని తెలిపారు.

హోటల్‌కు వచ్చే పర్యటకులకు మాత్రం.. 'మీ పండ్లు, కూరగాయలకు మీరే బాధ్యత' అని చెప్పేవారు.

Image copyright facebook/JetwingYala

ఇప్పుడు కిచెన్‌ తలుపుకు అడ్డంగా ఒక విద్యుత్ కంచె వేశారు. అలా అక్కడున్న ఆహార పదార్థాల జోలికి వెళ్లకుండా ఏనుగును అడ్డుకుంటున్నారు.

''ప్రశాంతంగా ఉండే నట్ట కోట వైఖరి అతిథులను కూడా అలరిస్తుంటుంది. అతని వీడియోలను తీస్తూ వాళ్లు కూడా ఆనందిస్తుంటారు'' అని హోటల్ చెబుతోంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు

పిల్లల ఆరోగ్యం: 131వ స్థానంలో భారత్.. ఉత్తర కొరియా, భూటాన్, మయన్మార్‌‌‌ల కంటే దిగువన

కరోనా వైరస్: అన్ని దేశాలూ వణుకుతున్నా, థాయిలాండ్ మాత్రం చైనీయులకు తమ తలుపులు తెరిచే ఉంచింది.. ఎందుకు

ట్రంప్ భారత పర్యటన: ప్రవాస భారతీయుల ఓట్లు రాబట్టుకోవాలన్న కోరిక నెరవేరుతుందా

స్కేటర్ సాయి సంహిత: "క్రీడల్లోకి రావడానికి అమ్మాయిలు భయపడకూడదు"

వైరల్ వీడియో: సిరియా యుద్ధం.. బాంబులు పడుతున్నా నవ్వుతున్న చిన్నారి

జర్మనీలో రెండుచోట్ల తుపాకీ కాల్పులు, తొమ్మిది మంది మృతి

తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం, 19 మంది బస్సు ప్రయాణికులు మృతి

కమల్ హాసన్ 'భారతీయుడు-2' సినిమా సెట్లో ప్రమాదం, ముగ్గురు మృతి