వీడియో: పాకిస్తాన్‌లో తినడానికి రొట్టెలు కూడా దొరకడం లేదు.. అల్లాడుతున్న ప్రజలు

వీడియో: పాకిస్తాన్‌లో తినడానికి రొట్టెలు కూడా దొరకడం లేదు.. అల్లాడుతున్న ప్రజలు

పాకిస్తాన్‌లోని కొన్ని ప్రావిన్సుల్లో గోధుమ పిండి కొరత ఏర్పడింది. జనాలకు తినడానికి రొట్టెలు కూడా దొరకడం లేదు.

ఖైబర్ పఖ్తుంఖ్వాలో నాన్‌లు తయారు చేసే చాలా దుకాణాలు పిండి కొరత వల్ల మూతపడ్డాయి. బలూచిస్తాన్, సింధ్, పంజాబ్ ప్రావిన్సుల్లోనూ ఈ సమస్య ఉంది.

ఈ విషయంపై పాకిస్తాన్ ప్రభుత్వం దృష్టి సారించింది.

ప్రావిన్సుల్లోని ప్రభుత్వాలు మాత్రం పిండికి కొరత లేదని, ఇది కృత్రిమ సంక్షోభమని చెబుతున్నాయి.

క్షేత్ర స్థాయిలో మాత్రం ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. చాలా ప్రావిన్సుల్లో నాన్ల అమ్మకాలపై ప్రభావం పడింది.

ఖైబర్ పఖ్తుంఖ్వాలో పరిస్థితి తీవ్రంగా ఉంది. పిండి ధరలు పెరగడంతో చాలా పట్టణాల్లో నాన్లను తయారుచేసే వ్యాపారులు ఆందోళనలు చేపట్టారు. పోలీసులు నలుగురు వ్యాపారులను అరెస్టు చేశారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)