చైనాలో శరవేగంగా వ్యాపిస్తున్న వైరస్, ఆరుగురి మృతి

రాజధాని బీజింగ్, షాంఘై లాంటి ప్రధాన నగరాలు సహా చైనాలో శరవేగంగా వ్యాపిస్తున్న కొత్త వైరస్‌తో ఇప్పటివరకు అంటే జనవరి 22 మధ్యాహ్నం వరకు ఆరుగురు చనిపోయారు.

ఇది కరోనా వైరస్‌లో ఒక కొత్త రకం. ఇది తీవ్రమైన ఊపిరితిత్తుల వ్యాధికి కారణమవుతుంది.

చైనాలో ఇప్పటివరకు 300 మందికి పైగా ప్రజలకు ఇది సోకినట్లు నిర్ధరణ అయ్యింది. గుర్తించని కేసులు చాలానే ఉండొచ్చని నిపుణులు చెబుతున్నారు.

ఈ వైరస్ మనుషుల నుంచి మనుషులకు సంక్రమించగలదని చైనా అధికారులు ప్రకటించారు. చైనాలో మరిన్ని ప్రాంతాలకు వైరస్ వ్యాపించవచ్చనే ఆందోళనలు ఉన్నాయి.

దక్షిణ కొరియా, జపాన్, థాయ్‌లాండ్ దేశాల్లోనూ ఈ వైరస్ కేసులు నమోదయ్యాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)