ఆస్ట్రేలియా కార్చిచ్చుతో 113 జంతువుల జాతులు ‘పూర్తిగా అంతరించిపోతున్నాయి’.. అత్యవసర సహాయం అవసరం అంటున్న నిపుణులు

  • 14 ఫిబ్రవరి 2020
అత్యవసర సహాయం అందించాల్సిన జాబితాలో కోలాలు ఒకటి Image copyright Reuters
చిత్రం శీర్షిక అత్యవసర సహాయం అందించాల్సిన జాబితాలో కోలాలు కూడా ఉన్నాయి

ఆస్ట్రేలియాలో ఇటీవల సంభవించిన కార్చిచ్చులతో అనేక జంతు జాతుల ఆవాసాలు కాలిపోయాయి. దీంతో 113 జీవ జాతులకు అత్యవసర సహాయం అందించాల్సిన అవసరం ఉందని ఆస్ట్రేలియా పేర్కొంది.

అయితే, జీవ జాతులేవీ పూర్తిగా అంతరించడం లేదని, ఇది ఆహ్వానించదగిన పరిణామంగా ఆస్ట్రేలియా ప్రభుత్వం పేర్కొంది.

గత వేసవిలో దక్షిణ, తూర్పు ఆస్ట్రేలియాలో తలెత్తిన మంటలతో అధిక సంఖ్యలో జీవ జాతులు 30 శాతం వరకు జీవావరణాన్ని కోల్పోయాయి.

కోలాలు, వాల్లబీలు, పక్షులు, కప్పలు, కొన్ని రకాల మత్స్య జాతులకు తక్షణ సహాయం అందించాల్సిన అవసరం ఉందని నిపుణులు తెలిపారు.

ఆస్ట్రేలియా పచ్చిక బయళ్ళని నాశనం చేసిన ఈ మంటల్లో వంద కోట్ల జంతువులు అంతమై ఉండవచ్చని పరిశోధకులు అంచనా వేశారు.

Yellow-bellied glider
Getty
కార్చిచ్చుకి ప్రభావితమైన జాతులు

  • 13పక్షులు

  • 20సరీసృపాలు

  • 5కీటకాలు, పురుగులు

  • 19 క్షీరదాలు

  • 22 క్రే ఫిష్

  • 17చేపలు

ఆధారం: వైల్డ్ లైఫ్ అండ్ థ్రెటెండ్ స్పీసీస్ బుష్ ఫైర్ రికవరీ ఎక్స్పర్ట్ పానెల్

తక్షణ సహాయం అందించాల్సిన కొన్ని జీవ జాతుల పేర్ల జాబితాని వైల్డ్ లైఫ్ అండ్ థ్రెటెండ్ స్పీసీస్ బుష్ ఫైర్ రికవరీ ఎక్స్పర్ట్ పానెల్ మంగళవారం విడుదల చేసింది.

కొన్ని జంతు జాతుల జీవావరణం పూర్తిగా నాశనం కావడంతో వాటి మనుగడ అంతరించిపోయే ప్రమాదం ఉందని ఈ జాబితా పేర్కొంది. వీటిలో పుగ్స్ ఫ్రాగ్, బ్లూ మౌంటైన్స్ వాటర్ స్కింక్, కంగారు ఐలాండ్ దనార్ట్ ఉన్నాయి.

Image copyright JODY GATES/SA DEPARTMENT FOR ENVIRONMENT AND WATER
చిత్రం శీర్షిక కంగారు ఐలాండ్ దనార్ట్
Image copyright ENVIROGOV/DAVE HUNTER
చిత్రం శీర్షిక పూర్తిగా అంతరించిపోతున్న దశలో ఉన్న నార్తర్న్ కరోబోరీ కప్ప

కోలా, స్మోకీ మౌస్ జాతులు నివసించే ఆవాసాలు ఎక్కువ ప్రభావానికి గురవ్వడంతో వీటి మనుగడకి అత్యవసర ప్రాతిపదికన సహాయం అందించాల్సిన అవసరం ఉంది.

కొన్ని జీవ జాతులని మంటలు తలెత్తక ముందే అంతరించిపోతున్న జాబితాలో చేర్చడం వలన అదనంగా చేపట్టిన చర్యలు వాటికి రక్షణ కల్పించగలిగాయి

ఇంకా చాలా జీవజాతులు సురక్షితం అని తేల్చినప్పటికీ అవి నివసించే జీవావరణాన్ని మాత్రం చాలా వరకు ఈ కార్చిచ్చుల్లో కోల్పోయాయని నివేదిక పేర్కొంది.

తదుపరి విడుదల చేసే జాబితాలో మరిన్ని వృక్ష , జీవ జాతులని చేర్చే అవకాశం ఉందని ఆస్ట్రేలియా పర్యావరణ మంత్రి సూసన్ లే తెలిపారు.

ఇంకా అక్కడక్కడా చెలరేగుతున్న మంటలు, కాలుతున్న భూముల వలన, విధ్వంసపు నష్టాలని పూర్తి స్థాయిలో అంచనా వేసేందుకు వీలు కాలేదని ఆమె అన్నారు.

ఆస్ట్రేలియా గత నెలలో వన్య ప్రాణ సంరక్షణ, జీవావరణ పునరుద్ధరణ కోసం 239 కోట్ల రూపాయిల నిధుల్ని సేకరిస్తామని ప్రకటించింది. ఈ నిధుల్ని జీవరాసుల వైద్యం, ఆహారం, జంతువులకి చీడ నివారణ చర్యల కోసం ఉపయోగిస్తామని తెలిపింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు

కరోనావైరస్: కరోనావైరస్‌పై విజయం సాధించిన 101 ఏళ్ళ వృద్ధుడు

కరోనావైరస్‌పై పోరాటానికి సిద్ధమైన భారతీయ రైల్వే

ప్రెస్ రివ్యూ: తెలంగాణ లాక్‌డౌన్‌లో బ్లాక్ మార్కెట్... దడ పుట్టినస్తున్న ధరలు

కరోనా లాక్‌డౌన్: ఈ కార్మికుడు భార్యను ఎక్కించుకుని సైకిల్‌పై 750 కిలోమీటర్లు ప్రయాణించాడు

భారతదేశం లాక్ డౌన్‌ని ఎందుకు పొడిగిస్తుంది.. తొలగిస్తే ఎదురయ్యే ప్రమాదాలేంటి

కరోనావైరస్: 24 గంటల్లో 549 కొత్త కేసులు.. 17 మరణాలు.. ఇండియాలో మొత్తం కేసులు 5,734

కరోనావైరస్ వ్యాక్సీన్ కనిపెట్టినా... అది పేద దేశాలకు అందుతుందా

కరోనావైరస్ లాక్‌డౌన్ ఎఫెక్ట్: భూమి కంపించటం తగ్గిపోయింది

కరోనావైరస్ హాట్‌స్పాట్లు: ఈ ప్రాంతాల్లో ఏం జరగబోతుంది.. లాక్‌డౌన్‌కు, దీనికి తేడా ఏంటి