మెసేజ్‌లలో వచ్చే నగ్నచిత్రాలను తొలగించే ఫిల్టర్ తీసుకొచ్చిన ట్విటర్

  • 15 ఫిబ్రవరి 2020
సైబర్‌ఫ్లాషింగ్, ఫోన్ వాడుతున్న మహిళ

డైరెక్ట్ మెసేజ్‌ల రూపంలో అవాంఛిత నగ్నచిత్రాలు రాకుండా అడ్డుకొనేందుకు తన యూజర్ల కోసం ట్విటర్ ఒక కొత్త ఫిల్టర్‌ తీసుకొచ్చింది.

డైరెక్ట్ మెసేజ్ రూపంలో పంపే పురుషాంగం చిత్రాలను అడ్డుకొని తొలగించే 'సేఫ్‌ డీఎం' అనే ప్లగ్‌ఇన్‌ ట్విటర్ యూజర్లకు శుక్రవారం అందుబాటులోకి వచ్చింది.

డెవలపర్ కెల్సీ బ్రెస్లర్‌కు ఈ ఫిల్టర్ ఆలోచన వచ్చింది. ఒక పురుషుడి నుంచి తనకు ఓ నగ్నచిత్రం వచ్చిన తర్వాత ఇలాంటి వాటిని అడ్డుకొనే దిశగా ఆమె ఆలోచన చేశారు.

అవాంఛిత, అసభ్యకర నగ్నచిత్రాలు, వీడియోలు యూజర్లకు రాకుండా అడ్డుకొనేందుకు సోషల్ మీడియా సంస్థలు మరిన్ని చర్యలు చేపట్టాలని కెల్సీ చెప్పారు.

మరో ప్రధాన సోషల్ మీడియా వేదికలోనూ ఈ ఫిల్టర్‌ను అందుబాటులోకి తెచ్చే విషయమై సేఫ్ డీఎం చర్చలు జరుపుతోందని, ఇవి ప్రాథమిక దశలో ఉన్నాయని ఆమె బీబీసీతో తెలిపారు. ఇతర సోషల్ మీడియా వేదికలకూ ఈ ఫిల్టర్‌ను అందించాలనుకొంటున్నామని చెప్పారు.

సేఫ్ డీఎం 'ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (కృత్రిమ మేధ)' సాయంతో పనిచేస్తుంది.

Image copyright Twitter

ఈ ఫిల్టర్‌కు అవసరమైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను అభివృద్ధి చేసేందుకు పురుషాంగాల చిత్రాలు పంపాలని కెల్సీ నిరుడు సెప్టెంబరులో ట్విటర్లో కోరారు.

ఆమెకు నాలుగు వేల చిత్రాలు వచ్చాయి.

ఫిల్టర్ 99 శాతం సందర్భాల్లో పనిచేస్తోందని సేఫ్ డీఎం బృందం చెబుతోంది.

Image copyright Twitter
చిత్రం శీర్షిక ఫిల్టర్‌కు అవసరమైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను అభివృద్ధి చేసేందుకు పురుషాంగాల చిత్రాలు పంపాలని కెల్సీ సెప్టెంబరులో ట్విటర్లో కోరారు.

పురుషాంగాల చిత్రాలను గుర్తించి తొలగించడంలో ఫిల్టర్‌కు సంబంధించిన సాఫ్ట్‌వేర్ చాలా కచ్చితత్వంతో పనిచేస్తున్నట్లు బజ్‌ఫీడ్ న్యూస్ నిర్వహించిన ఓ పరీక్షలో తేలింది. ఫిల్టర్ ఈ పని పూర్తిచేయడానికి కొన్ని నిమిషాల సమయం తీసుకొంటున్నట్లు వెల్లడైంది.

సేఫ్ డీఎం వాడాలనుకొనే ట్విటర్ యూజర్లు తమ ఖాతాకు ఓ ప్లగ్ఇన్ జోడించి, డైరెక్ట్ మెసేజ్‌లను చూసేందుకు దానిని అనుమతించాల్సి ఉంటుంది.

Image copyright Getty Images

సాఫ్ట్‌వేర్ ఈ మెసేజ్‌లలోని చిత్రాలను పరిశీలించి, పురుషాంగాల చిత్రాలు ఉంటే గుర్తించి తొలగిస్తుంది. సదరు మెసేజ్ అనుచితమైనదని, అందుకే తొలగించానంటూ మెసేజ్ పంపిన యూజర్‌కు, మెసేజ్ వచ్చిన యూజర్‌కు సందేశం పంపిస్తుంది.

సాఫ్ట్‌వేర్‌లోని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మెసేజ్‌లను చదవదని, అక్కడ వచ్చిన చిత్రాలను మాత్రమే పరిశీలిస్తుందని కెల్సీ వివరించారు.

2017 నాటి ప్యూ రీసర్చ్ సెంటర్ అధ్యయనం ప్రకారం 18 నుంచి 29 ఏళ్ల మధ్య వయసున్న మహిళల్లో 53 శాతం మందికి కనీసం ఒక్కటైనా అవాంఛిత చిత్రం వచ్చింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు

దిల్లీ హింస: అల్లరిమూకలను శర్మ, సైఫీ కలిసి ఎలా అడ్డుకున్నారంటే

లీపు సంవత్సరం ఎప్పుడు మొదలైంది? దీని అవసరం ఏంటి?

పిల్లల్ని కనడానికి సరైన వయసు ఏది?

దిల్లీ హింస: అల్లర్లు చెలరేగిన వీధుల్లో ఐదు గంటల ప్రత్యక్ష అనుభవం ఇది...

అఫ్ఘానిస్తాన్: తాలిబాన్లతో చర్చలు జరిపిన మహిళ ఫాజియా కూఫీ కథ ఇదీ...

కన్హయ్య కుమార్‌పై దేశ ద్రోహం కేసు విచారణకు అనుమతి మంజూరు చేసిన దిల్లీ ప్రభుత్వం

సీఎం కేసీఆర్ ఇంట్లో రోజూ చికెన్, గుడ్లే తింటున్నాం: కేటీఆర్

కరోనావైరస్: చైనాలో ఇళ్లకే పరిమితమైన కోట్ల మంది ఏం చేస్తున్నారు

దిల్లీ హింస: సరిహద్దులు దాటి.. అల్లరి మూకను ఎదిరించి.. ఎన్నో ప్రాణాలు కాపాడిన పోలీస్ హీరో నీరజ్ జాదౌన్