టీనేజ్ అమ్మాయిల ఫొటోలు పంపించి ఇజ్రాయెల్ సైనికుల ఫోన్లు హ్యాక్ చేసిన మిలిటెంట్లు

  • 18 ఫిబ్రవరి 2020
ఇజ్రాయెల్ సైనికులకు అమ్మాయి ఫొటోలు Image copyright Idf

ఇజ్రాయెల్ సైన్యంలోని చాలా మంది సైనికుల స్మార్ట్ ఫోన్లకు అమ్మాయిల ఫొటోలు పంపించిన హమాస్ మిలిటెంట్ సంస్థ, వాటిని హ్యాక్ చేసిందని ఆ దేశ ఆర్మీ చెప్పింది.

"మా సైనికులకు మొదట టీనేజీ అమ్మాయిల ఫొటోలు పంపించారు. ఒక అప్లికేషన్ డౌన్‌లోడ్ చేసుకునేలా వారిని ఊరించారు" అని సైనిక ప్రతినిధి చెప్పారు.

కానీ, ఆ అప్లికేషన్ తమ ఫోన్లను హ్యాక్ చేస్తుందని ఇజ్రాయెల్ సైనికులు తెలుసుకోలేకపోయారు. ఈ హ్యాకింగ్ వెనుక హమాస్‌కు సంబంధించిన వారు ఉన్నారని ఇజ్రాయెల్ ఆర్మీ ఆరోపించింది.

గాజాపై అదుపు సాధించిన మిలిటెంట్ గ్రూప్ హమాస్‌కు, ఇజ్రాయెల్‌కు మధ్య పురాతన శత్రుత్వం ఉంది.

"మా సైనికుల ఫోన్లను హ్యాక్ చేయడానికి హమాస్ మూడో ప్రయత్నం చేసింది. కానీ, అన్నిటికంటే ఇది అత్యాధునికమైనది" అని ఇజ్రాయెల్ సైనిక ప్రతినిధి కల్నల్ జోనాథన్ కార్నికస్ చెప్పారు.

వాళ్లు సరికొత్త సాంకేతికతను నేర్చుకుని, హ్యాకింగ్‌తో తమపై పైచేయి సాధించారని ఆయన తెలిపారు.

హమాస్ హ్యాకర్లు పొడిపొడిగా హిబ్రూ మాట్లాడే, వలస వచ్చిన యువతుల్లా నటించారని కల్నల్ కార్నికస్ చెప్పారు.

Image copyright Reuters
చిత్రం శీర్షిక హమాస్ మద్దతు ఉన్న పాలస్తీనా పోలీసుల శిక్షణ

కుట్ర గురించి ముందే తెలుసు: ఇజ్రాయెల్ సైన్యం

సైనికులతో స్నేహం చేసిన తర్వాత ఆ యువతులు వారికి కొన్ని లింక్స్ పంపించారు. వాటిని క్లిక్ చేస్తే పరస్పరం ఫొటోలు పంపించుకోవచ్చని చెప్పారు.

కానీ, అది నిజానికి ఒక వైరస్. స్మార్ట్ ఫోన్లను, సిస్టంలను హ్యాక్ చేసేంత ప్రమాదకరమైనది.

ఒక్కసారి క్లిక్ చేయగానే ఆ లింక్ స్మార్ట్ ఫోన్లలోని డేటా, లొకేషన్, ఫొటోల యాక్సెస్‌ను హ్యాకర్ల చేతికి అందిస్తుంది.

అంతే కాదు, ఆ తర్వాత హ్యాకర్లు సైనికుల ఫోన్‌ను తమ అదుపులోకి తీసుకోగలరు. ఫోన్ ఉపయోగించేవారికి తెలీకుండానే ఫొటోలు తీయచ్చు, వారి మాటలు రికార్డ్ చేయవచ్చు.

"ఈ కుట్ర గురించి మాకు నెలల క్రితమే తెలిసింది. మా నిఘాలో దానిని కొనసాగించాం. తర్వాత ఎక్కువ నష్టం జరగకముందే వాటిని ఆపివేశాం" అని కల్నల్ కార్నికస్ చెప్పారు.

స్మార్ట్ ఫోన్లు ఉపయోగించేటపుడు అప్రమత్తంగా ఉండాలని ఇజ్రాయెల్ ఆర్మీ ఇంతకు ముందే తమ సైనికులను హెచ్చరించింది.

ఇజ్రాయెల్, హమాస్ మధ్య దశాబ్దాలుగా ఘర్షణ జరుగుతోంది. రెండు ఒకదానిపై ఒకటి నిఘా పెట్టుకుంటున్నాయి. ప్రత్యర్థి వ్యూహాలను తెలుసుకోడానికి ప్రయత్నిస్తున్నాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు

భారతదేశం లాక్ డౌన్‌ని ఎందుకు పొడిగిస్తుంది.. తొలగిస్తే ఎదురయ్యే ప్రమాదాలేంటి

కరోనా లాక్‌డౌన్: ఈ కార్మికుడు భార్యను ఎక్కించుకుని సైకిల్‌పై 750 కిలోమీటర్లు ప్రయాణించాడు

కరోనావైరస్: 24 గంటల్లో 549 కొత్త కేసులు.. 17 మరణాలు.. ఇండియాలో మొత్తం కేసులు 5,734

హైదరాబాద్: మణిపూర్ విద్యార్థులపై వివక్ష.. సూపర్ మార్కెట్‌లోకి వెళ్లకుండా అడ్డుకున్న సెక్యూరిటీ గార్డు

కరోనావైరస్ లాక్‌డౌన్ ఎఫెక్ట్: భూమి కంపించటం తగ్గిపోయింది

కరోనావైరస్ హాట్‌స్పాట్లు: ఈ ప్రాంతాల్లో ఏం జరగబోతుంది.. లాక్‌డౌన్‌కు, దీనికి తేడా ఏంటి

వుహాన్‌లో లాక్‌ డౌన్ ఎత్తేసిన చైనా ప్రభుత్వం.. రైళ్లు, విమానాల్లో మొదలైన ప్రయాణాలు

దిల్లీ హింస: అద్దాలు పగిలిన రాత్రి

కరోనావైరస్ వ్యాక్సీన్ కనిపెట్టినా... అది పేద దేశాలకు అందుతుందా