వైరల్ వీడియో: సిరియా యుద్ధం.. బాంబులు పడుతున్నా నవ్వుతున్న చిన్నారి

వైరల్ వీడియో: సిరియా యుద్ధం.. బాంబులు పడుతున్నా నవ్వుతున్న చిన్నారి

సిరియాలో ప్రతి రోజూ వైమానిక దాడులు జరుగుతున్నాయి. బాంబుల వర్షం కురుస్తోంది. ఈ పరిస్థితుల్లో తన కూతుర్ని సంతోషంగా ఉంచేందుకు అబ్దుల్లా మొహమ్మద్ ఒక ఉపాయంతో ముందుకొచ్చారు. బాంబుల శబ్దం వినిపించినప్పుడల్లా నవ్వాలని తన కూతురు సల్వాకు చెప్పారు.

సిరియా వాయువ్య ప్రాంతంలోని సరాకిబ్‌కు చెందిన అబ్దుల్లా మొహమ్మద్ ఎన్నో ఏళ్లుగా కొనసాగుతున్న అంతర్యుద్ధం కారణంగా సర్మదా పట్టణంలోని తన స్నేహితుడి ఇంటికి భార్య, కుమార్తెతో సహా మారాల్సి వచ్చింది.

సిరియా ప్రభుత్వ అనుకూల దళాలు ప్రత్యర్థులపై చేస్తున్న దాడుల నేపథ్యంలో గత డిసెంబర్ నుంచి ఇప్పటి వరకూ 8 లక్షల మంది నిరాశ్రయులయ్యారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)