కరోనా వైరస్ రోగులకు సేవలు అందిస్తున్న గర్భిణీ - చైనా ప్రభుత్వ మీడియాపై తీవ్ర విమర్శలు

  • 25 ఫిబ్రవరి 2020
కరోనా వైరస్ Image copyright Getty Images

కరోనా వైరస్ పుట్టిన వుహాన్ నగరంలో గర్భవతిగా ఉన్న ఒక నర్స్ కరోనా వైరస్ సోకిన రోగులకు చికిత్స అందిస్తున్నట్లుగా ప్రచురించిన వీడియో నెటిజన్ల నుంచి తీవ్ర నిరసనలు ఎదుర్కొంది.

చైనా ప్రభుత్వ మీడియా సీసీటీవీ విడుదల చేసిన ఈ వీడియోలో తొమ్మిది నెలల గర్భిణి జావ్ యుని 'హీరో'గా చూపించాలని అనుకుంది. కానీ, నెలలు నిండిన మహిళతో వైరస్ తీవ్రంగా ప్రబలిన పరిసరాల్లో పని చేయించడాన్ని సోషల్ మీడియాలో తీవ్రంగా తప్పు పట్టారు.

ఆమెని ప్రచారానికి వాడుకున్నారని ఒక సోషల్ మీడియా యూజర్ కామెంట్ చేసారు.

కరోనా వైరస్ బారిన పడి చైనాలో 2200 మందికి పైగా ప్రజలు మరణించారు. ఇందులో అత్యధిక మరణాలు హుబె రాజధాని వుహాన్ నగరంలో నమోదయ్యాయి.

ఒక్క చైనాలోనే 75000 పైగా ఇన్ఫెక్షన్ కేసులు నమోదు అయ్యాయి. ప్రపంచ వ్యాప్తంగా 1000 కరోనా వైరస్ కేసులు గుర్తించగా కొన్ని దేశాలలో వైరస్ కారణంగా కొన్ని మరణాలు చోటు చేసుకున్నాయి.

వుహాన్‌లో మిలిటరీ హాస్పిటల్లోని ఎమర్జెన్సీ వార్డులో పని చేస్తున్న జావ్ యు వీడియోని చైనీస్ స్టేట్ మీడియా సీసీటీవీ గత వారంలో విడుదల చేసింది.

Image copyright Weibo/CCTV

ఆ వీడియోలో ఆమె వైరస్ నుంచి రక్షణ కల్పించే సూట్ ధరించి హాస్పిటల్‌లో తిరుగుతూ, రోగులకు వైద్య పరీక్షలు చేస్తున్నట్లుగా కన్పించారు. అక్కడ పని చేయడం ప్రమాదకరమని చికిత్స తీసుకుంటున్న రోగి జావ్ యు ని హెచ్చరించినట్లుగా ఆ వీడియోలో ఉంది.

జావ్ కూడా తన కుటుంబ సభ్యులు తనని పనికి వెళ్లవద్దంటున్నారని కానీ వైరస్‌ని అరికట్టేందుకు తన వంతు బాధ్యత నిర్వర్తిస్తున్నానని చెప్పారు.

జావ్ త్యాగానికి ప్రతీకగా చైనా ప్రభుత్వ మీడియా ఈ వీడియోని చూపించాలనుకున్నప్పటికీ, ప్రజలు మాత్రం ఆమెని ప్రచారానికి వాడుకున్నారని విమర్శించారు.

"ఈ ప్రచారాన్ని ఆపితే బాగుంటుంది. ఈ వీడియో సరైనదని ఎవరు అంగీకరించారు? గర్భిణీలు ఇటువంటి పనులు చేయకూడదు" అని ఇంకొక వ్యక్తి వ్యాఖ్యానించారు.

"ఇది కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం చేస్తున్న పనిలా ఉంది. ఒక తొమ్మిది నెలల గర్భిణీని ఇలాంటి పనికి పంపకండి" అని ఇంకొకరు కామెంట్ చేశారు.

"మహిళల ఆరోగ్యం గురించి దృష్టిలోకి తీసుకోకుండా ఇటువంటి పనుల్లో పెట్టడం సరైనది కాదని" మరో యూజర్ అన్నారు.

నెటిజన్లను కోపానికి గురి చేసినది ఈ ఒక్క వీడియో మాత్రమే కాదు

కొంత మంది మహిళా నర్సులు వారి జుట్టుని పూర్తిగా నిర్మూలిస్తుండగా కన్నీరు పెట్టుకున్నవీడియోని చైనా ప్రభుత్వ మీడియా సంస్థలు విడుదల చేశాయి.

Image copyright Weibo

మహిళలకి గుండు చేయడం ద్వారా చికిత్స అందించే సమయంలో హెడ్ గేర్లు వేసుకునేందుకు వీలుగా ఉంటుందని ఆ వీడియోలో పేర్కొన్నారు.

జుట్టు పూర్తిగా తీసివేయకుండా పొట్టిగా కత్తిరించవచ్చు కదా అని కొంత మంది ప్రశ్నించారు. పురుషులకి జుట్టు తీస్తున్న వీడియోలు ఎందుకు లేవని అడిగారు.

కరోనా వైరస్ ప్రబలిన సమయంలో చైనాలో ముందుండి సేవలు అందిస్తున్న మహిళలను గుర్తించమంటూ "#సీఇంగ్ ఫిమేల్ వర్కర్స్" అనే హాష్ టాగ్ చైనీస్ ఆప్ వీబోలో వైరల్ అయింది.

కార్యదక్షత, నమ్మకం, నిజాయితీ, ధైర్యం లాంటి లక్షణాలు గర్వించదగ్గవి కానీ మహిళలు జుట్టుని పూర్తిగా తీసేసుకోవడం కాదని ఒక యూజర్ కామెంట్ చేసారు.

మీడియా మహిళల త్యాగాలని ఎప్పుడూ ఎందుకు ప్రచారానికి వాడుకుంటుంది? ఈ మహిళలు తమకున్న పొడవాటి జుట్టుతో వైద్య సేవలు అందిస్తే గుర్తింపుకి నోచుకోరా? గర్భం ధరించకపోయినా సేవలు అందిస్తున్నవారు లేరా? అని వి చాట్ లో ఒకరు ప్రశ్నించారు.

"మహిళలు అందంగా ఉండాలి. ఒక తల్లిగా, ఒక భార్యగా త్యాగాలు చేయాలి. అప్పుడే వాళ్ళ సేవలని గుర్తిస్తామా?

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు

కరోనావైరస్: తొలి మేడిన్ ఇండియా టెస్టింగ్ కిట్‌ను అందించిన భారత శాస్త్రవేత్త ఈమే.. కిట్ ఇచ్చిన గంటకే బిడ్డకు జన్మనిచ్చిన మీనల్

ఆంథొనీ ఫాచీ: ఆరుగురు అమెరికా అధ్యక్షులకు సలహాలు ఇచ్చిన వైద్యుడు.. ఒకప్పుడు ఎయిడ్స్‌‌తో, ఇప్పుడు కరోనాతో యుద్ధానికి దిగిన సైనికుడు

PMCARESకు బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ విరాళం రూ.25 కోట్లు

కరోనావైరస్: కోవిడ్-19 హాట్‌స్పాట్‌గా మారిన న్యూయార్క్.. ఈ ఒక్క రాష్ట్రంలోనే 52 వేల కేసులు నమోదు

కరోనావైరస్ మీద యుద్ధంలో ముందు నిలిచి పోరాడుతున్న యోధులు ఎవరు.. వారు ఏమంటున్నారు

కరోనావైరస్: సినీ కార్మికులు, సాధారణ ప్రజలకు పెద్ద నటుల సహాయ హస్తం

కరోనావైరస్: పాకిస్తాన్‌ను భయపెడుతున్న కోవిడ్-19.. వైద్యులే వణికిపోతున్నారు

కరోనావైరస్: ఇటలీలో పెరుగుతున్న భయాలు... దక్షిణ ప్రాంతాలపై కోవిడ్-19 విరుచుకుపడితే పరిస్థితి ఏంటి...

కరోనావైరస్: మోదీ ప్రభుత్వ ఆర్థిక ప్యాకేజీతో ప్రజలకు జరిగే మేలు ఎంత