కరోనావైరస్ వల్ల అప్పుల ఊబిలో కూరుకుపోతున్న చైనా కంపెనీలు

  • 24 ఫిబ్రవరి 2020
చైనా ఆర్థిక వ్యవస్థపై కరోనా వైరస్ ప్రభావం Image copyright Getty Images

కరోనావైరస్‌ దెబ్బకు చైనా కంపెనీలు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నాయి. కొద్ది రోజులుగా తిరిగి కార్యకలాపాలు ప్రారంభించినప్పటికీ కార్మికులకు వేతనాలిచ్చేందుకు, ముడి సరుకును సరఫరా చేసేవారికి చెల్లింపులు చేసేందుకు కటకటలాడుతున్నాయి.

కరోనావైరస్‌ దాడి నేపథ్యంలో చైనా అత్యంత కఠినమైన పరీక్షను ఎదుర్కొంటోందని చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ ఆదివారం వ్యాఖ్యానించారు.

వైరస్ ప్రభావంతో దెబ్బతిన్న ఆర్థిక పరిస్థితిని గాడిలో పెట్టేందుకు ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. అందులో భాగంగా అప్పులు ఇవ్వడంలో మరింత ఉదారంగా వ్యవహరించాలని బ్యాంకులను చైనా సర్కారు విజ్ఞప్తి చేసింది.

మరోవైపు దేశ వ్యాప్తంగా లక్షలాది చిన్న, మధ్య తరహా పరిశ్రమలు సంక్షోభంలో కూరుకుపోయాయి.

Image copyright Getty Images

ప్రస్తుత పరిస్థితుల్లో దేశం మొత్తం మీద 60 శాతం కంపెనీలు తమ దగ్గరున్న నగదు నిల్వలతో మరో రెండు నెలల పాటు మాత్రమే మనుగడ సాగించగలవని 'ది చైనీస్ అసోసియేషన్ ఆఫ్ స్మాల్ అండ్ మీడియం ఎంటర్‌ప్రైజెస్' తెలిపింది. మరో 10 శాతం సంస్థలు ఆరు లేదా అంత కన్నా ఎక్కువ కాలం పాటు ప్రస్తుత సంక్షోభాన్ని మోయగలవు.

అయితే, అదే సమయంలో 60 శాతం కంపెనీలు తిరిగి తమ కార్యకలాపాలను ప్రారంభించాయని పారిశ్రామిక వర్గం చెబుతోంది.

పీపుల్స్ బ్యాంక్ ఆఫ్ చైనా లెక్కల ప్రకారం, చిన్న మధ్య తరహా పరిశ్రమలు దేశ ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. సుమారు 60 శాతం ఆదాయానికి, 80 శాతం ఉద్యోగాలకు ఈ పరిశ్రమలే కేంద్ర బిందువులు.

Image copyright Getty Images

ప్రపంచంలో రెండో అతిపెద్ద ఆర్థికవ్యవస్థగా ఉన్న చైనా ఆర్థిక వృద్ధి తొలి త్రైమాసికంలో భారీగా పడిపోతుందని అనేక దేశాల కేంద్రీయ బ్యాంకులు హెచ్చరిస్తున్నాయని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) మేనేజింగ్ డైరెక్టర్ క్రిస్టలినా జార్జీవా తెలిపారు.

రెండో త్రైమాసికానికి చైనా ఆర్థిక వ్యవస్థ తిరిగి సాధారణ స్థితికి వచ్చే అవకాశం ఉందని ఐఎంఎఫ్ అంచనా వేస్తోంది. అయితే, అంతర్జాతీయంగా కరోనా వైరస్ మరింతగా వ్యాప్తి చెంది, దాని ప్రభావం ఎక్కువ కాలం కొనసాగితే ఆర్థిక వ్యవస్థలపై ప్రభావం మరింత తీవ్రమయ్యే అవకాశం ఉందని జార్జీవా అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు

కరోనావైరస్ వణికిస్తున్నా, మే నెలలోనే ఎన్నికలు జరుపుతామంటున్న పోలాండ్

కరోనావైరస్: కొన్ని దేశాల ప్రజలు మాస్క్‌లు వాడతారు, మరికొన్ని దేశాల ప్రజలు వాడరు, ఎందుకు

ఇండియా లాక్‌డౌన్: ‘‘కరోనా సోకకపోయినా ఇంత శోకాన్ని మిగులుస్తుందని నేను అనుకోలేదు’’

కరోనావైరస్: ప్రాణాలు కాపాడుకోవడానికి డస్ట్ బిన్ కవర్లు వేసుకుంటున్న బ్రిటన్ వైద్య సిబ్బంది

కరోనాపై ప్రభుత్వం ఎలా ‘యుద్ధం’ చేయబోతోంది.. కంటైన్‌మెంట్ ఆపరేషన్‌ ఎప్పుడు మొదలవుతుంది.. ఎప్పుడు ముగుస్తుంది

ప్రజల కదలికలను స్మార్ట్ ఫోన్ల ద్వారా కనిపెడుతున్న గూగుల్.. భారతదేశంలో లాక్‌డౌన్ ప్రకటించాక పరిస్థితిపై రిపోర్ట్

కరోనావైరస్: ఈ మహమ్మారికి ముంబయి కేంద్రంగా ఎలా మారింది

లాక్‌డౌన్ ఎఫెక్ట్: మహారాష్ట్ర నుంచి తమిళనాడు - 1,200 కిలోమీటర్లు కాలినడకన ఇళ్లకు చేరిన యువకులు

ఇంటెన్సివ్ కేర్ అంటే ఏమిటి? ఎలాంటి రోగులకు ఇది అవసరం?