మహాతిర్ మొహమ్మద్ : ప్రపంచంలో అత్యంత వృద్ధ ప్రధాని రాజీనామా

  • 24 ఫిబ్రవరి 2020
మహాతిర్ Image copyright Getty Images
చిత్రం శీర్షిక మలేషియా ప్రధాని మహాతిర్ మొహమ్మద్

మలేషియా ప్రధానమంత్రి మహాతిర్ మొహమ్మద్ సోమవారం తన పదవికి రాజీనామా చేశారు.

ఆయన తన రాజీనామా గురించి ట్వీట్ ద్వారా ప్రకటించారు. 94 ఏళ్ల మహతిర్ మొహమ్మద్‌ ప్రపంచంలో అత్యంత వృద్ధ ప్రధానమంత్రిగా పేరు పొందారు.

మహాతిర్ గత నాలుగు దశాబ్దాలుగా మలేషియా రాజకీయాలకు కేంద్రంగా ఉన్నారు. 1981 నుంచి 2003 వరకూ ఆయన వరసగా మలేసియా ప్రధానమంత్రి పదవిలో ఉన్నారు.

తర్వాత 2018లో నజీబ్ రజాక్‌ను ఓడించి ఆయన మళ్లీ అధికారంలోకి చేజిక్కించుకున్నారు.

గత కొంతకాలంగా 94 ఏళ్ల మహాతిర్ మొహమ్మద్, 72 ఏళ్ల అన్వర్ ఇబ్రహీమ్ మధ్య టగ్ ఆఫ్ వార్ నడుస్తోందని చెబుతున్నారు. పదవి నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన మహాతిర్ మొహమ్మద్ తన రాజీనామా లేఖను మలేషియా సుల్తాన్ అబ్దుల్లా సుల్తాన్ అహ్మద్ షాకు అప్పగించారు.

72 ఏళ్ల అన్వర్ ఇబ్రహీం ఆయనతోపాటూ సహచరుడుగా కూటమిలో చేరారు. సమయం వచ్చినపుడు తన ప్రధాని పదవిని అప్పగిస్తానని మహాతిర్ ఆయనకు భరోసా ఇచ్చారు. కానీ మహాతిర్ మొహమ్మద్ ఇప్పుడు కొత్త కూటమి ఏర్పాటు చేసి మళ్లీ అధికారంలోకి రావచ్చని ఊహాగానాలు సాగుతున్నాయి.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక మహాతిర్, అన్వర్

మహాతిర్, అన్వర్ మధ్య గొడవ

స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం ఒంటి గంటకు మహాతిర్ తన రాజీనామా లేఖను సుల్తాన్‌కు సమర్పించారని ప్రధానమంత్రి కార్యాలయం చెప్పింది. అందులో వేరే వివరాలు ఏవీ ఇవ్వలేదు.

మలేసియా తర్వాత ప్రధాని ఎవరు అనేదానిపై ఇంకా స్పష్టత రాలేదు.

ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ఏ పార్టీకీ తగిన సంఖ్యలో ఎంపీలు లేకపోవడంతో మలేసియా రాజు ఇందులో కీలక పాత్ర పోషించనున్నారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు ఆయన రాజకీయ పార్టీలను ఆహ్వానించడం, అది విఫలమైతే మళ్లీ ఎన్నికలకు పిలుపునివ్వడంగానీ చేస్తారు.

మహాతిర్ తను అధ్యక్షుడుగా ఉన్న బెర్సటు పార్టీకి కూడా రాజీనామా చేశారు.

మలేసియాలో ప్రస్తుత ప్రభుత్వం ఏర్పాటు చేసిన పకటన్ హరపన్ అలయన్స్‌లో బెర్సటు పార్టీ భాగం. 2018లో ఆయన అన్వర్‌తో కలిసి అందులో చేరారు. అది 2018 ఎన్నికల్లో గెలిచింది. ఆరు దశాబ్దాలకు పైగా అధికారంలో ఉన్న బీఎన్ సంకీర్ణ ప్రభుత్వానికి తెరదించింది.

అన్వర్ ఆదివారం మాట్లాడుతూ, మహాతిర్, ఆయన పార్టీ దేశద్రోహులని ఆరోపించారు. తను లేకుండా వారు కొత్త ప్రభుత్వం ఏర్పాటుచేసే ప్రణాళికల్లో ఉన్నారని చెప్పారు.

మలేసియా రాజకీయాల్లో గత కొన్ని దశాబ్దాలుగా అన్వర్, మహాతిర్ మధ్య గొడవలు, మళ్లీ కలుసుకోవడం సర్వ సాధారణంగా మారింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

సంబంధిత అంశాలు

ముఖ్యమైన కథనాలు

కరోనావైరస్: నిజాముద్దీన్ తబ్లీగీ జమాత్ కేంద్రం ‘హాట్ స్పాట్’ ఎలా అయ్యింది?

కరోనావైరస్: రుణాల చెల్లింపులపై ఆర్‌బీఐ మారటోరియం - ఈఎంఐ కట్ అవుతుందా? వాయిదా వేయటం ఎలా?

కరోనా లాక్‌డౌన్: కోవిడ్-19 మరణాల సంఖ్యలో చైనాను దాటేసిన అమెరికా

కరోనావైరస్: వృద్ధులు చేయాల్సిన, చేయకూడని పనులు

కరోనావైరస్‌తో పోరాటం కోసం ఏర్పాటైన PM CARES ఫండ్‌పై ప్రశ్నలు

కరోనావైరస్: భారత సైన్యం రాత్రికి రాత్రే 1,000 పడకల ఆస్పత్రి నిర్మించిందా? ఏది నిజం? - BBC FactCheck

కరోనావైరస్: ప్రభుత్వం, సమాజం స్పందించే తీరులో వర్ణ వ్యవస్థ ఛాయలు - అభిప్రాయం

కరోనావైరస్‌లో ఏముంది... అది ఎందుకంత ప్రమాదకరం?

కరోనా లాక్‌డౌన్ కుటుంబ సంబంధాల ప్రాధాన్యాన్ని గుర్తు చేసిందా?