కరోనావైరస్ - ‘మహమ్మారిగా మారకముందే ఎదుర్కోండి’ - ప్రపంచ దేశాలకు డబ్ల్యూహెచ్ఓ హెచ్చరిక

  • 25 ఫిబ్రవరి 2020
వెనీస్ కార్నివాల్‌లో ముఖానికి మాస్కుతో ఉన్న వ్యక్తి Image copyright Getty Images

కరోనావైరస్ ప్రపంచవ్యాప్త మహమ్మారిగా మారకముందే దేశాలన్నీ అప్రమత్తమవ్వాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) హెచ్చరించింది.

ఇప్పుడే దీన్ని ప్రపంచవ్యాప్త మహమ్మరి అనడం తొందరపాటు అవుతుందని, కానీ ప్రపంచం అందుకు సన్నద్ధమై ఉండాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించింది.

ప్రపంచవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో ఒకరి నుంచి ఒకరికి అంటువ్యాధి వ్యాపిస్తూ ఉంటే దాన్ని ప్రపంచవ్యాప్త మహమ్మారి అంటారు.

కొరియా, ఇటలీ, ఇరాన్‌ల్లోనూ కరోనా కేసులు నమోదవుతుండటం ప్రస్తుతం ఆందోళన కలిగిస్తోంది.

కరోనావైరస్ పుట్టిన చైనాలోనే దీని తీవ్ర అత్యధికంగా ఉంది. ఆ దేశంలో 77 వేలకుపైగా మంది ఈ వైరస్ బారినపడ్డారు. వారిలో 2,600కు పైగా మంది ప్రాణాలు కోల్పోయారు.

దాదాపు 30 ఇతర దేశాల్లో 1200 దాకా కరోనా కేసులు నమోదయ్యాయి. వీరిలో 20 మంది మరణించారు.

ఇటలీలో కరోనావైరస్ వల్ల సోమవారం నలుగురు మరణించారు. మొత్తంగా ఆ దేశంలో ఆ కరోనా సోకి ప్రాణాలు వదిలినవారి సంఖ్య ఏడుకు చేరింది.

కరోనావైరస్ కారణంగా వచ్చే శ్వాసకోశ వ్యాధికి కోవిడ్-19 అనే డబ్ల్యూహెచ్ఓ పేరు పెట్టింది.

కరోనావైరస్ వ్యాప్తి వల్ల ఆర్థికపరంగా ప్రభావం ఉంటుందన్న ఆందోళనలతో ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లు కూడా పతనమవుతున్నాయి.

కరోనా‌వైరస్‌ను అరికట్టే చర్యలు పూర్తి స్థాయిలో కొనసాగేందుకు వీలుగా వచ్చే నెలలో నిర్వహించాల్సి ఉన్న నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్ వార్షిక సమావేశాన్ని వాయిదా వేస్తున్నట్లు చైనా ప్రకటించింది.

కరోనావైరస్ సోకిన‌వాకరిలో మరణిస్తున్నవారి శాతం ఒకటి నుంచి రెండు మధ్య ఉంటోంది. అయితే, డబ్ల్యూహెచ్ఓ ఇంకా ఈ సమాచారం తెలియదని చెబుతోంది.

సోమవారం ఇరాక్, అఫ్గానిస్తాన్, కువైట్, ఒమన్, బహ్రెయిన్‌ల్లో తొలి సారిగా కరోనాకేసులు నమోదయ్యాయి. బాధితులంతా ఇరాన్ నుంచి వచ్చినవారే.

తమ దేశంలో కరోనావైరస్ సోకిన వ్యక్తి ఓ స్కూల్ బస్ డ్రైవర్‌ అని, ఫలితంగా చాలా పాఠశాలలు మూసేశామని బహ్రెయిన్ అధికారులు తెలిపారు.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక కరోనావైరస్ కొత్త కేసులు పెరగడంపై డబ్యూహెచ్ఓ ఆందోళన

డబ్ల్యూహెచ్ఓ ఏమంటోంది...

ఇరాన్, ఇటలీ, కొరియాల్లో కరోనావైరస్ కొత్త కేసుల సంఖ్య కలవరపాటుకు గురిచేస్తోందని డబ్ల్యూహెచ్ఓ చీఫ్ టెడ్రోస్ అదనమ్ జీబ్రెయెసస్ అన్నారు.

‘‘ఇప్పటికైతే అదుపుతప్పి ప్రపంచవ్యాప్తంగా ఇదేమీ వ్యాపించడం లేదు. పెద్ద సంఖ్యలో మరణాలు నమోదు కావడం లేదు. కానీ, దీనికి ప్రపంచవ్యాప్త మహమ్మారిగా మారే శక్తి ఉందా అని అడిగితే, కచ్చితంగా ఉందనే చెబుతా. కానీ, మా విశ్లేషణలు మనం ఇంకా ఆ స్థాయికి చేరలేదనే సూచిస్తున్నాయి’’ అని ఆయన అన్నారు.

కరోనావైరస్‌ను కట్టడి చేయొచ్చన్న ధైర్యాన్ని అన్ని దేశాలకు ఇవ్వడం ఇప్పుడు ముఖ్యమని, అలా చాలా దేశాలు చేయగలుగుతున్నాయని టెడ్రోస్ వ్యాఖ్యానించారు.

ప్రపంచవ్యాప్త మహమ్మారి (పాన్‌డెమిక్) అంటే...

  • ప్రపంచవ్యాప్తంగా ఓ కొత్త వ్యాధి వ్యాపించడం
  • 2009లో హెచ్1ఎన్1 (స్వైన్ ఫ్లూ) వ్యాపించి లక్షల్లో జనం చనిపోయారు. దీన్ని డబ్ల్యూహెచ్ఏ పాన్‌డెమిక్‌గా ప్రకటించింది.
  • డబ్ల్యూహెచ్ఓ అధికారికంగా ఇప్పుడు ఏ వ్యాధి వ్యాప్తినీ ‘పాన్‌డెమిక్’గా పేర్కొనడం లేదు. ఈ పదాన్ని ‘వ్యవహారికంగా’నే ఉపయోగిస్తోంది.
Image copyright AFP
చిత్రం శీర్షిక చైనా తర్వాత దక్షిణ కొరియాలోనే అత్యధిక కరోనావైరస్ కేసులు

కరోనా ఏయే దేశాలకు విస్తరించింది...

చైనా తర్వాత కరోనాకేసులు అత్యధికంగా నమోదైంది దక్షిణ కొరియాలోనే. సోమవారం నాటికి 830 మందికి ఈ ఇన్‌ఫెక్షన్ సోకినట్లు నివేదికలు అందాయి. ఇప్పటివరకూ ఆ దేశంలో కరనావైరస్ వల్ల ఎనిమిది మంది మరణించారు.

యూరప్‌లో అత్యధికంగా ఇటలీలో కరోనాకేసులు నమోదయ్యాయి. 229 మందికి ఈ వైరస్ సోకింది.

లాంబార్డీ ప్రాంతంలో ముగ్గురు మరణించారని ఇటలీ దేశపు మీడియాలో కథనాలు వచ్చాయి.

ఇరాన్‌లో ఆదివారం ఒక్కరోజే కొత్తగా 61 కరోనాకేసులు నమోదయ్యాయి. ఖూమ్ నగరంలో 50 మంది మరణించారని, ప్రభుత్వం ఈ విషయాన్ని దాచి పెడుతోందని ఓ ఎంపీ వ్యాఖ్యానించారు. కానీ, ప్రభుత్వ ఆరోగ్యశాఖ సహాయ మంత్రి ఈ ఆరోపణను తోసిపుచ్చారు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు

కరోనావైరస్‌: రెండు వ్యాక్సీన్లపై పరీక్షలు మొదలుపెట్టిన శాస్త్రవేత్తలు

కరోనావైరస్: ఒకే రోజు అమెరికాలో 884 మంది, స్పెయిన్‌లో 864 మంది మృతి.. ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న పాజిటివ్ కేసులు, మరణాలు

కరోనావైరస్: భారత మీడియా చైనాను ఎందుకు లక్ష్యంగా చేసుకుంది.. చైనా కుట్ర సిద్ధాంతంపై ఏమంటోంది

కరోనా లాక్‌డౌన్: ఉత్తరప్రదేశ్‌లో వలస కార్మికులపై రసాయనాలు చల్లిన వీడియోలో ఏముంది

కరోనా ఎఫెక్ట్: నారింజ రసం ధరలు పైపైకి

కరోనా లాక్‌డౌన్: మూడు నెలలు ఈఎంఐ వాయిదా వేసుకోవడం మంచిదేనా

కరోనావైరస్: దేశ వ్యాప్తంగా వర్క్ ఫ్రమ్ హోం ప్రయోగం చైనాలో ఇప్పుడు ఎలా ఉంది

కరోనా వైరస్‌: కోవిడ్‌-19 ఒక జ్వరం వంటిదే - వైఎస్ జగన్

కరోనావైరస్: చైనా కిట్లను, మాస్కులను తిరస్కరిస్తున్న యూరప్ దేశాలు