పాకిస్తాన్: సింహాల సఫారీలో చిక్కిన టీనేజర్

  • 27 ఫిబ్రవరి 2020
లాహోర్ సఫారీ
చిత్రం శీర్షిక పాకిస్తాన్‌లో అతిపెద్ద జూ అయిన లాహోర్ సఫారీలో దాదాపు 40 సింహాలు ఉన్నాయి

పాకిస్తాన్‌లో కనిపించకుండా పోయిన ఒక టీనేజీ యువకుడు.. లాహోర్‌లోని ఒక జూలో సింహాల ఎన్‌క్లోజర్‌లో అస్థిపంజరంలా కనిపించాడు.

ముహమ్మద్ బిలాల్ (17) కంచె దాటి ఎన్‌క్లోజర్‌లోకి ఎలా వెళ్లాడు, అతడి మరణానికి కారణమేమిటి అనే అంశాలపై దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు చెప్పారు.

అయితే.. సిబ్బంది నిర్లక్ష్యం వల్లే బిలాల్ చనిపోయాడని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ వారం ఆరంభంలో జూ కార్యాలయాలపై దాడులు జరిగాయి.

ప్రభుత్వ మద్దతుతో నడిచే లాహోర్ సఫారీని 1982లో స్థాపించారు. ఇది పాక్‌లో అతి పెద్దదైన, అత్యంత ప్రాచీనమైన పార్కు.

చిత్రం శీర్షిక పశువుల మేత కోసం ముహమ్మద్ బిలాల్ ఇల్లువదిలి వెళ్లాడు

యువకుడిని వెదకటానికి సాయం చేయాలని కోరుతూ సమీప గ్రామానికి చెందిన కొంతమంది ప్రజలు మంగళవారం రాత్రి తమ దగ్గరకు వచ్చారని డైరెక్టర్ చౌదరీ షాఫ్ఖాత్ బీబీసీకి చెప్పారు.

''అప్పటికే చాలా రాత్రి అయిందని, సఫారీలో చీకట్లో గాలింపు చేపట్టటం ప్రమాదకరం కావచ్చునని మేం వారికి చెప్పాం'' అని తెలిపారు.

జూ ఉద్యోగులు బుధవారం ఉదయం గాలింపు చేపట్టినపుడు.. రక్తపు మడుగులో పుర్రె, కొన్ని ఎముకలు, దుస్తుల ముక్కలు కనిపించాయి. అవి అదృశ్యమైన బాలుడి దుస్తులుగా బంధువులు గుర్తించారు.

ఆ బాలుడు పశువుల మేత కోసం గడ్డి కోయటానికి మంగళవారం మధ్యాహ్నం ఇల్లు వదిలి వెళ్లాడని అతడి బంధువులు తమకు చెప్పినట్లు అధికారులు తెలిపారు.

మరణానికి కారణం తెలుసుకోవటానికి బిలాల్ అస్తికలను పరీక్షలకు పంపించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు

కరోనావైరస్ - తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రెస్ మీట్; 'లాక్‌డౌన్ కొనసాగించాలని ప్రధానికి చెప్పాను'

కరోనావైరస్: భారత్‌లో 4 వేలు దాటిన కోవిడ్ బాధితులు, 24 గంటల్లోనే 693 కొత్త కేసులు... 109 మృతులు

కరోనావైరస్: కిమ్ జోంగ్ ఉన్ ఉత్తర కొరియాలో వైరస్ వ్యాప్తి చెందకుండా ఏం చేశారు?

ఆంధ్రప్రదేశ్‌లో కరోనావైరస్ అడ్డాగా కర్నూలు... 303 కేసుల్లో 74 ఈ జిల్లాలోనే

కరోనావైరస్... ఈ భూమి మీద ఒక ఆదిమ జాతిని సమూలంగా నాశనం చేస్తుందా?

లక్ష మంది సినీ కార్మికులను ఆదుకుంటా: అమితాబ్ బచ్చన్

కరోనావైరస్: కోవిడ్-19 రోగి చనిపోతే అంత్యక్రియలు ఎలా చేయాలి?

అమెరికాలో ఓ ఆడపులికి కరోనావైరస్

కరోనావైరస్: 5జీ టెక్నాలజీతో కోవిడ్-19 వ్యాధి వ్యాపిస్తుందా?