కరోనావైరస్: "క్రికెట్ మైదానంలో మేం 'షేక్‌ హ్యాండ్' ఇవ్వం" - ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్

ఇంగ్లండ్ క్రికెట్ జట్టు కెప్టెన్ జో రూట్

ఫొటో సోర్స్, Getty Images

శ్రీలంకలో పర్యటించనున్న ఇంగ్లండ్ క్రికెట్ జట్టు ఆ దేశ ఆటగాళ్లకు షేక్ హ్యాండ్ ఇవ్వరాదని నిర్ణయించుకుంది. ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాపిస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్ వెల్లడించారు.

ఇటీవల దక్షిణాప్రికాలో పర్యటించిన ఇంగ్లండ్ జట్టు గాస్ట్రోఎంటరైటిస్, ఫ్లూతో బాధపడింది. ఇప్పుడు శ్రీలంక పర్యటనలో తాము షేక్‌హ్యాండ్‌లకు బదులు పిడికిళ్లతో పలకరించుకుంటామని(ఫిస్ట్ బంప్) జో రూట్ తెలిపారు.

రెండు టెస్టుల ఈ సిరీస్‌కు ముందు నిర్వహించనున్న రెండు వార్మప్ మ్యాచుల్లో మొదటిది శనివారం కటునాయకే స్టేడియంలో జరగబోతోంది.

దక్షిణాఫ్రికాలో జట్టంతా అనారోగ్యం బారిన పడిన తరువాత తక్కువగా కాంటాక్ట్ కావాల్సిన అవసరాన్ని తాము గుర్తించామని రూట్ చెప్పారు.

''మేం క్రమం తప్పకుండా చేతులు కడుక్కుంటున్నాం. మాకు ఇచ్చిన ఇమ్యూనిటీ ప్యాక్‌లలో ఉన్న యాంటీ బాక్టీరియల్ వైప్స్, జెల్స్ ఉపయోగిస్తున్నా''మన్నారు.

ముందు అనుకున్న ప్రకారం ఈ పర్యటన పూర్తిగా కొనసాగుతుందని అనుకుంటున్నామని.. అయితే, తమ జట్టు అధికారుల సలహా, సూచనల ప్రకారం ముందుకుసాగుతామని చెప్పారాయన.

కరోనావైరస్ కారణంగా చైనా కేంద్రంగా జరగాల్సిన కొన్ని క్రీడాకార్యక్రమాలు ఇప్పటికే వాయిదా పడ్డాయి.

కరోనావైరస్ 50 దేశాలపై ప్రభావం చూపింది. 86 వేల మందికిపైగా దీని బారిన పడ్డారు. 3 వేల మందికిపైగా చనిపోయారు.

శ్రీలంకలో ఇంగ్లండ్ టూర్ షెడ్యూల్ ఇదీ..

మార్చ్ 7 - 9 : ఇంగ్లండ్ వర్సెస్ శ్రీలంక బోర్డ్ ప్రెసిడెంట్ XI, కటునాయకె స్టేడియం

మార్చ్ 12 -15 : ఇంగ్లండ్ వర్సెస్ శ్రీలంక బోర్డ్ ప్రెసిడెంట్ XI, కొలంబోలోని పీ సారా ఓవల్ మైదానం

మార్చ్ 19 - 23 : మొదటి టెస్ట్, గాలె

మార్చ్ 27 - 31 : రెండో టెస్ట్, కొలంబోలోని ఆర్. ప్రేమదాస స్టేడియం

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)