కరోనావైరస్; ఇరాన్‌లో పెరిగిన మరణాలు, ఇటలీలో విద్యా సంస్థల మూసేసే అవకాశం... బ్రిటన్‌లో 85, భారత్‌లో 28 కేసులు, ప్రపంచ బ్యాంకు సాయం 1200 కోట్ల డాలర్లు

కరోనావైరస్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్,

ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనావైరస్

కరోనావైరస్ ప్రపంచ దేశాల్ని వణికిస్తోంది. ఇరాన్‌లో ఇవాళ మరో 15 మంది కోవిడ్ -19 వైరస్ కారణంగా ప్రాణాలు కోల్పోయారు. దీంతో అక్కడ మొత్తం మరణించిన వారి సంఖ్య 92కు చేరుకుంది.

అటు ఇటలీలో పాఠశాలలకు, కాలేజీలకు, యూనివర్శిటీలకు మార్చి మూడోవారం వరకు సెలవులు ప్రకటించాలని యోచిస్తోంది ఆ దేశ ప్రభుత్వం.

భారత్‌లో 28 కరోనావైరస్ కేసులు

ఇక భారత్‌లో కరోనావైరస్ కేసుల సంఖ్య 28కి చేరుకుందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ తెలిపారు. బ్రిటన్‌లో కోవిడ్ -19 బాధితుల సంఖ్య 85కి చేరినట్టు బ్రిటన్ ఆరోగ్య శాఖ వెల్లడించింది.

దక్షిణ కొరియాలోనూ పరిస్థితి అంతకంతకు విషమమవుతోంది. ఇవాళ మరో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా... మొత్తం మరణించిన వారి సంఖ్య 35కి చేరుకుంది.

పారిస్‌కు చుట్టు పక్కల ఉన్న 120 పాఠశాలలకు ఫ్రాన్స్ ప్రభుత్వం సెలవులు ప్రకటించింది.

ఫొటో సోర్స్, AFP/Getty Images

1200కోట్ల డాలర్ల సాయం

కరోనావైరస్ భయంతో ముందు జాగ్రత్త చర్యల్ల భాగంగా లండన్, పారిస్, పొలండ్‌లలో ఉన్న కార్యాలయాలను మూసేసింది సోని పిక్చర్స్.

అభివృద్ధి చెందుతున్న దేశాల్లో కరోనావైరస్‌ బాధిత దేశాలకు 1200 కోట్ల డాలర్ల సాయాన్ని ప్రపంచ బ్యాంకు ప్రకటించింది.

చిలీ, అర్జెంటీనా దేశాల్లో తొలి కరోనావైరస్ కేసు నమోదైనట్టు ఆయా దేశాల ప్రభుత్వాలు వెల్లడించాయి.

వూహాన్ నుంచి తమ పౌరులను స్వదేశానికి రప్పించేందుకు హాంకాంగ్ 2 చార్టెడ్ విమనాలను పంపింది.

ఫొటో సోర్స్, Reuters

అటు రష్యాలో ఆరుగురికి మాత్రమే వైరస్ సోకిందని ప్రభుత్వం ప్రకటించినప్పటికీ ఒక్క మాస్కోలోనే 20 వేల మంది బాధితులు ఉన్నారన్న వార్తలు సామాజిక మాధ్యమాల్లో హల్ చల్ చేస్తున్నాయి.

అయితే ఈ వార్తలపై ఆ దేశాధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తీవ్రంగా మండిపడ్డారు. ఇవన్నీ రష్యన్లలో భయాందోళనల్ని సృష్టించేందుకు విదేశాల నుంచి తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)