కరోనావైరస్: మీరు మీ పిల్లల్ని వేరే పిల్లలతో ఆడుకోడానికి పంపించవచ్చా?

  • 23 మార్చి 2020
పిల్లలతో ఆడుకోడానికి పంపించవచ్చా? Image copyright Alamy

ప్రపంచవ్యాప్తంగా స్కూళ్లు మూతబడుతున్నాయి. పిల్లలు ఏది చేయాలో, ఏది చేయకూడదో తెలీక తల్లిదండ్రులు తలలు పట్టుకుంటున్నారు.

మన పిల్లలు వారి స్నేహితులతో కలిసి బయటకు వెళ్లవచ్చా... లేక ఇళ్లలోపలే ఉంచేయడం అంటే, వారి ఆటపాటలకు తెర పడినట్లేనా?

"కాలంలో వెనక్కు వెళ్లి ఏదైనా మార్చగలిగే శక్తి ఉంటే, కుటుంబంతో కలిసి పక్కింటికి వెళ్లి ఆ రాత్రి భోజనం చేయకుండా ఉండేదాన్ని" అని కేథరిన్ విల్సన్ చెప్పారు.

రెండు వారాల క్రితం... కోవిడ్-19 ఇటలీ అంతా వ్యాపిస్తోంది. అప్పటికి ప్రజలు తమ ఇళ్లలోనే ఉండాలని ప్రభుత్వం ఎలాంటి ఆదేశాలూ జారీ చేయలేదు.

రోమ్‌లో ఉన్న ఒక తల్లికి తన ఇద్దరు పిల్లలతో కలిసి భోజనానికి రావాలని పొరుగింటి నుంచి ఆహ్వానం వచ్చింది. ఆ విందులో మరో రెండు కుటుంబాలు కూడా పాల్గొన్నాయి.

మా ఆయన, నేను "మనం ఉన్నది, ఒక అపార్టుమెంట్‌లోనే కదా, ఇది భారీగా గుమిగూడడం కాదులే అనుకున్నాం" అని ఆమె బీబీసీకి చెప్పారు.

Image copyright KATHERINE WILSON
చిత్రం శీర్షిక కేథరిన్ విల్సన్ కుటుంబం

లాక్‌డౌన్ మంచిదే

ఇప్పుడు స్కూళ్లు మూసేయడాన్ని తనతో సహా, చాలా మంది తల్లులు సెలవుల్లాగే భావిస్తున్నారని అమెరికన్ రచయిత కేథరిన్ విల్సన్ చెప్పారు.

"ఇది చాలా బాగుంది, ఒక చిన్న సెలవులా ఉంది. మనం ఎప్పుడూ వెళ్లని పార్కుకు వెళ్దాం అనిపించింది".

కానీ, దేశంలో వైరస్ ఎంత వేగంగా వ్యాపిస్తోందో తెలీగానే, కుటుంబం కదలికలను పరిమితం చేసేందుకు తను మరింత చొరవ తీసుకోవాలని అనుకున్నట్లు ఆమె చెప్పారు.

"అలా వెళ్లడం పిచ్చితనమే అవుతుంది. కానీ, వద్దు అనడం కూడా ఏదో పెద్ద తప్పు చేసినట్లు అనిపించింది".

కొన్నిరోజుల తర్వాత ఇటలీ ప్రభుత్వం దేశమంతా లాక్‌డౌన్ చేసింది. అంటే పార్కులకు వెళ్లడం, ఆడుకోడానికి వెళ్లడం కుదరదు.

మీ పిల్లలు, స్నేహితులు సవాలు చేసేలా నిర్ణయాలు తీసుకోవడం కంటే అలా పూర్తిగా లాక్‌డౌన్ చేయడం ఒక విధంగా చాలా మంచిదే అనిపించింది.

Image copyright Getty Images

దూరంగా ఉండడం మంచిదే

వైరస్‌ గురించి తీవ్రంగా ఆందోళన చెందేవారికి, ప్రభుత్వ హెచ్చరికలను తేలిగ్గా తీసుకునేవారికి ఇద్దరికీ అది చాలా మంచి నిర్ణయం.

పిల్లలు ఆడుకోడానికి, అంటే, టెన్నిస్, లోకల్ గ్రౌండ్‌కు వెళ్లిరావడం, స్నేహితుల ఇళ్లకు వెళ్లడం లాంటి వాటిపై ఎలాంటి నిబంధనలు ఉన్నాయి అని విల్సన్ లాగే ప్రపంచవ్యాప్తంగా చాలామంది తల్లిదండ్రులు గందరగోళంలో పడ్డారు.

"సమాజానికి దూరంగా ఉండడం, అవతలి వ్యక్తికి ఎప్పుడూ ఆరు అడుగులు దూరం ఉండడం అనేవి పిల్లలు, పెద్దలు ప్రతి ఒక్కరూ పాటించాలి. అంటే బాస్కెట్ బాల్, ఫుట్‌బాల్ లాంటివి ఆడడం కుదరదు" అని మేరీలాండ్ బాల్టిమోర్‌లో జాన్స్ హాప్‌కిన్స్ బ్లూంబర్గ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ ప్రొఫెసర్ డాక్టర్ కెరీ ఆల్తోఫ్ చెప్పారు.

పిల్లలు కలిసి ఆడుకోడానికి తక్కువ కాంటాక్ట్ ఉండే టెన్నిస్, దాగుడు మూతలు లాంటి ఆటలు ఉన్నాయి. సరదాగా ఆడుకుంటున్న సమయంలో మిమ్మల్ని మీరు అదుపులో ఉంచుకోవాలని పిల్లలకు చెప్పడం చాలా కష్టం.

"గ్రౌండ్‌లో ఆడుకుంటున్నప్పుడు ఒకరికొకరు తమకంటూ ఒక స్పేస్ ఉంచుకోలేరు. అలా ఉండాల్సి వస్తే అది క్రీడామైదానమే కాదు" అని ఆమె చెప్పారు.

"బయట వైరస్ కొన్ని రోజుల పాటు సజీవంగా ఉంటుందనడానికి ఆధారాలు కూడా ఉన్నాయి. అందుకే, ఎక్కువ మంది తాకే ప్లే ఏరియాలు, క్రీడా పరికరాలు లాంటివి ఉండే ప్రాంతాలకు వెళ్లకపోవడమే మంచిది" అన్నారు.

Image copyright EPA

పిల్లల్లో లక్షణాలు లేకున్నా...

అయినా, ఇతరులకు వ్యాపించేలా కరోనావైరస్ ఉన్నట్టు పిల్లల్లో పెద్దగా లక్షణాలు కూడా కనిపించలేదు.

"అంటే, మీ పిల్లలు, లేదా మీ పిల్లల స్నేహితులు పూర్తి ఆరోగ్యంగా ఉన్నట్టు కనిపిస్తున్నా, వారు ఆ వ్యాధిని తన సమాజంలో ఇతరులకు సోకేలా చేయవచ్చు. పిల్లల ద్వారా వైరస్ వచ్చిన వారిలో తీవ్రమైన లక్షణాలు ఉండవచ్చు. అందుకే ఇప్పుడు వారి తల్లిదండ్రులు కూడా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది" అని అల్తోఫ్ చెప్పారు.

"సామాజిక దూరం అంటే ఏమిటి? అనే దానిపై స్థానిక ప్రభుత్వాలు స్పష్టంగా వివరించాలి. మనకు తెలిసిన వైరస్ ప్రభావం రెండు, మూడు, నాలుగు వారాల నుంచే ఉంది" అని ఎరియాడ్నే లాబ్స్ ఎపిడమాలజిస్ట్ డాక్టర్ కాథెరీన్ సెమ్రావ్ చెప్పారు.

"ఇటలీలో ఉన్నట్లు మీ ప్రాంతంలో లాక్‌డౌన్ లేకపోయినా, ఇది జనం చాలా తక్కువ ప్రాంతాల్లో, చాలా తక్కువ ఉండాల్సిన సమయం" అని సెమ్రావ్ అన్నారు.

ముందు ముందు తల్లిదండ్రులకు మరిన్ని ఆంక్షలు ఉండచ్చు. వాటిని ఎలా ఎదుర్కోవాలి అనేదానిపై తమ పిల్లలతో కలిసి వారు ప్లాన్ చేసుకోవాలి అని అల్తోఫ్ అన్నారు.

"హఠాత్తుగా అలా జరిగితే, కుటుంబాలకు అది చాలా ఇబ్బందిగా ఉండచ్చు. అందుకే తల్లిదండ్రూలూ ప్లాన్ చేసుకోండి".

సామాజిక దూరం పాటించినంత మాత్రాన అది సంఘ వ్యతిరేకం కాదని ఈ మహిళలు ఇద్దరూ చెప్పారు. అంటే, బయటికి వెళ్లడం గురించి, స్నేహితులు, కుటుంబ సభ్యులతో ఆన్‌లైన్‌లో కనెక్ట్ కావాల్సిన ప్రాధాన్యాన్ని వివరించారు.

సామాజిక దూరం పాటిస్తూనే సరదాగా గడపం ఎలా?

  • ఎలాంటి చర్యలు సురక్షితం అనే దాని గురించి మీ స్థానిక ఆరోగ్య అధికారుల సలహాలను అనుసరించండి
  • క్రీడా మైదానాలు, బొమ్మల దుకాణాలు, లేదా ప్లే-ఏరియాలు లాంటి 'హై-టచ్' ప్రాంతాలకు దూరంగా ఉండండి.
  • బయటికెళ్లండి. ఆరుబయట నడవండి, బైక్ రైడ్స్ చేయండి. వాటి ద్వారా వచ్చే అనుభవాన్ని ఆస్వాదించండి.
  • ఇంటర్నెట్ ద్వారా స్నేహితులు, కుటుంబ సభ్యులను కలవండి. వీడియో చాట్ ద్వారా పిల్లలు ఊహిస్తూ కలిసి ఆడుకోవడం, లేదా క్రాఫ్ట్స్ లాంటివి చేసేలా చూసుకోండి.

ఇళ్లలో బంధించినట్లు అనిపించకుండా తమ ఊహల్లో తేలిపోయేలా, అనుకోకుండా వచ్చిన ఖాళీ సమయాన్ని ఉపయోగించుకునేలా పిల్లలను వదిలేయడం చాలా ముఖ్యం అని టొరోంటో యూనివర్సిటీ ప్రొఫెసర్ యాంజిలా పైలే అన్నారు.

"పిల్లలు తరచూ ఊహలతో ఆడుకుంటారు. బొమ్మలు, జంతువుల బొమ్మలు, లేదా వస్తువులతో ఏవేవో ఊహించుకుంటూ ఆడుకుంటూ ఉంటారు. ఇలాంటి కఠిన సమయంలో అలాంటి ఆటలు వారికి చాలా బాగా పనికొస్తాయి" అన్నారు.

టొరోంటోలో తన ఏడేళ్ల కూతురు ఎలా ఆడుకుంటోందో పైలే స్వయంగా చెప్పారు. అక్కడ ప్రతి ఒక్కరూ ఇళ్లలోనే ఉండాలని, స్కూళ్లు, డేకేర్ సెంటర్లు మూసివేయాలని అధికారులు ఆదేశించారు.

"మేం మా ఇంట్లోనే ఆడుకుంటున్నాం. చుట్టుపక్కల ప్రాంతాల్లో నడకకు వెళ్తాం. బైక్ రైడ్స్ చేస్తాం. ఎక్కువమంది గుమిగూడే పార్కులకు వెళ్లకుండా, మేం బయటకు అడుగుపెట్టాం అంటే, అది బైక్, స్కూటర్ రైడ్స్ కోసమే" అన్నారు.

క్లిప్ బోర్డులు, పజిల్స్ లాంటివి కొని తీసుకురావడం వల్ల, అవి తన చిన్న పాపను బయటికి విహారానికి వెళ్లకుండా సరదాగా ఉంచడానికి సహకరిస్తున్నాయని ఆమె చెప్పారు.

మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.
Media captionవీడియో: కరోనావైరస్: మీ చేతుల్ని 20 సెకండ్లలో కడుక్కోవడం ఎలా?

కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు

‘కరోనావైరస్ మీద నేను ఎలా పోరాడుతున్నానంటే...’ - హైదరాబాద్‌ పేషెంట్ నంబర్ 16 స్వీయ అనుభవం

కరోనా లాక్‌డౌన్: నరేంద్ర మోదీ మన్‌కీ బాత్.. ‘ఆరోగ్యమే మహాభాగ్యం.. ఇది యుద్ధం లాంటి పరిస్థితి’

కరోనావైరస్: తొలి మేడిన్ ఇండియా టెస్టింగ్ కిట్‌ను అందించిన భారత శాస్త్రవేత్త ఈమే.. కిట్ ఇచ్చిన గంటకే బిడ్డకు జన్మనిచ్చిన మీనల్

కరోనావైరస్: ట్విటర్‌లో #ShameOnBCCI ట్రెండింగ్, ఎందుకు

ఆంథొనీ ఫాచీ: ఆరుగురు అమెరికా అధ్యక్షులకు సలహాలు ఇచ్చిన వైద్యుడు.. ఒకప్పుడు ఎయిడ్స్‌‌తో, ఇప్పుడు కరోనాతో యుద్ధానికి దిగిన సైనికుడు

PMCARESకు బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ విరాళం రూ.25 కోట్లు

కరోనావైరస్ మీద యుద్ధంలో ముందు నిలిచి పోరాడుతున్న యోధులు ఎవరు.. వారు ఏమంటున్నారు

కరోనావైరస్: సినీ కార్మికులు, సాధారణ ప్రజలకు టాలీవుడ్ హీరోలు, నిర్మాతల సహాయం

కరోనావైరస్: పాకిస్తాన్‌ను భయపెడుతున్న కోవిడ్-19.. వైద్యులే వణికిపోతున్నారు