కరోనావైరస్: వస్తువులు, ఇతర ఉపరితలాల మీద, గాలిలో ఈ వైరస్ ఎంత కాలం సజీవంగా ఉంటుంది?

  • 25 మార్చి 2020
కరోనా వైరస్ Image copyright Getty Images

కోవిడ్-19 ప్రపంచవ్యాప్తంగా వ్యాపించడంతో అది బయట కూడా ఉంటే ఎలా అనే భయమేస్తోంది. బహిరంగ ప్రాంతాల్లో జనం మోచేత్తో తలుపు తీస్తుండడం, రైళ్లలో ప్రయాణికులు హాండిల్ కూడా పట్టుకోకుండా నిలబడి ఉండడం, ఆఫీసుల్లో ఉదయాన్నే ఉద్యోగులు తమ డెస్కులు శుభ్రం చేసుకుంటూ ఉండడం మనకు కనిపిస్తోంది.

కరోనావైరస్‌కు తీవ్రంగా ప్రభావితమైన ప్రాంతాలైన పార్కులు, మాల్స్, వీధుల్లో రక్షణ దుస్తులు వేసుకుని ఫాగ్ స్ప్రే చేస్తున్నారు. ఆఫీసులు, ఆస్పత్రులు, షాపులు, రెస్టారెంట్లలో కూడా శుభ్రం చేస్తున్నారు. ఏటీఎంల కీపాడ్ శుభ్రం చేసేందుకు కూడా వాలంటీర్లు నైట్ షిఫ్టుల్లో పనిచేస్తున్నారు.

పీల్చడం ద్వారా వచ్చే ఫ్లూ వైరస్ లాగే, కోవిడ్-19 ఉన్న వ్యక్తి దగ్గినపుడు అతడి ముక్కు, నోటి నుంచి వచ్చిన చిన్న తుంపర్ల ద్వారా ఈ వైరస్ వ్యాపించవచ్చు. చిన్నగా దగ్గినా మూడు వేలకు పైగా తుంపర్లు బయటికి వస్తాయి. ఇవి మిగతావారిపై, చుట్టూ ఉన్న బట్టలు, ఇతర ఉపరితలాలపై పడతాయి.

కానీ, కొన్ని చిన్న అణువులు ఇంకా గాల్లోనే ఉండిపోతాయి. వైరస్ మలంలో కూడా ఎక్కువసేపు ఉంటుందనడానికి కొన్ని ఆధారాలు కూడా ఉన్నాయి. అందుకే ఎవరైనా టాయిలెట్ వెళ్లిన తర్వాత చేతులు శుభ్రంగా కడుక్కోకుంటా దేన్నైనా ముట్టుకుంటే, వాటిని వైరస్‌తో కలుషితం చేసే ప్రమాదం ఉంది.

Image copyright getty images
చిత్రం శీర్షిక వైరస్ బయట ఎంతకాలం బతుకుతుంది

దేనిపై ఎంతకాలం ఉంటుంది

ఇక్కడ గమనించదగిన విషయం ఏంటంటే, ఏదైనా ఉపరితలం లేక ఏదైనా వస్తువును తాకి, అదే చేతుల్తో తమ ముఖాన్ని తాకడం అనేది వైరస్ వ్యాపించడానికి ప్రధాన కారణం కాదు అని సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ చెప్పింది. అయితే, సీడీసీ, ప్రపంచ ఆరోగ్య సంస్థ, ఇతర ఆరోగ్య సంస్థలు అన్నీ కోవిడ్-19 వ్యాప్తిని అడ్డుకోడానికి మనం చేతులు శుభ్రంగా కడుక్కోవడం, తరచూ తాకే ఉపరితలాలను క్రిమిరహితం చేయడం రెండూ ముఖ్యమే అని గట్టిగా చెబుతున్నాయి.

ఉపరితలాలు తాకడం వల్ల ఎన్ని కేసులు నమోదయ్యాయో మనకు ఇప్పటికీ కచ్చితంగా తెలీకపోయినా, జాగ్రత్తలు పాటించాలని నిపుణులు సలహా ఇస్తున్నారు.

కోవిడ్-19 వ్యాధికి కారణమైన సార్స్-CoV-2 అనే ఈ వైరస్ కచ్చితంగా ఎంతకాలం పాటు మనిషి శరీరం బయట ఉంటుంది అనే ఒక్క విషయంపై మాత్రం ఇంకా స్పష్టత రాలేదు.

సార్స్, మెర్స్ సహా ఇతర కరోనావైరస్‌లపై జరిగిన కొన్ని అధ్యయనాల్లో పూర్తిగా క్రిమిరహితం చేయనంతవరకూ అవి లోహం, గ్లాస్, ప్లాస్టిక్ మీద 9 రోజుల వరకూ బతకగలవని, వాటిలో కొన్ని బయట కనిష్ట ఉష్ణోగ్రతల్లో 28 రోజుల వరకూ సజీవంగా ఉంటాయిని కనుగొన్నారు.

ముఖ్యంగా ఎక్కడైనా తట్టుకుని జీవించగలిగే సామర్థ్యం ఉన్న వైరస్‌లలో కరోనావైరస్‌లు ముఖ్యమైనవి.

కొత్త కరోనావైరస్‌ వ్యాప్తికి ఇవి ఏమేరకు ప్రభావం చూపిస్తాయి అనే విషయంపై పరిశోధకులు ఇప్పుడు మరిన్ని పరిశోధనలు చేస్తున్నారు.

Image copyright getty images
చిత్రం శీర్షిక వైరస్ బయత ఎంతకాలం బతుకుతుంది

గాలిలో తుంపర్లలా...

సార్స్-CoV-2 వైరస్ వివిధ ఉపరితలాలపై ఎంత కాలం ఉండగలదు అనేదానిపై అమెరికా నేషనల్ ఇన్‌స్టిట్యూట్స్ ఆఫ్ హెల్త్(ఎన్ఐహెచ్) వైరాలజిస్ట్ నీల్టిజే వాన్ డోరెమాలెన్ మొదటిసారి కొన్ని పరీక్షలు చేశారు.

ఆ పరిశోధనల గురించి న్యూ ఇంగ్లండ్ జర్నల్ ఆఫ్ మెడిసన్‌లో ప్రచురించారు. అందులో ఒక వ్యక్తి దగ్గితే వచ్చే తుంపర్ల రూపంలో ఈ వైరస్ సజీవంగా ఉంటుందని. వీటిలో పెద్ద తుంపర్లు 1 నుంచి 5 మైక్రోమీటర్ల పరిమాణంలో ఉంటాయని, అంటే మనిషి వెంట్రుక కంటే 30 రెట్లు చిన్నగా ఉండే ఆ వైరస్ నిశ్చలంగా ఉన్న గాలిలో కొన్ని గంటలపాటు ఉంటుందని చెప్పారు..

అంటే, వడపోత లేని ఏసీల నుంచి వచ్చే వైరస్ కొన్ని గంటలు మాత్రమే ఉంటుంది. ముఖ్యంగా గాలి తుంపర్లలా వేగంగా చిమ్మే వైరస్ చెదిరిన గాలిలో ఉపరితలాలపై వేగంగా స్థిరపడుతుంది.

కానీ, ఎన్ఐహెచ్ అధ్యయనంలో సార్స్- CoV-2 వైరస్ కార్డుబోర్డు మీద 24 గంటల వరకూ ఉంటుందని, ప్లాస్టిక్, స్టెయిన్‌లెస్ స్టీల్ మీద అది 2-3 రోజులపాటు ఉండగలదని తేలింది.

డోర్ హాండిల్స్, ప్లాస్టిక్ పూత లేదా లామినేటెడ్ ఫర్నిచర్, గట్టిగా ఉండే మిగతా ఉపరితలాలపై ఈ వైరస్ ఎక్కువకాలం ఉండవచ్చని పరిశోధనలు చెబుతున్నాయి. అయితే, వైరస్‌ను చంపగలదని భావించే రాగి వస్తువులపై ఈ వైరస్ దాదాపు 4 గంటలే ఉండగలదని కనుగొన్నారు.

కానీ, దీనికి ఒక వేగవంతమైన ప్రత్యామ్నాయం ఉంది. 62 నుంచి 71 శాతం ఆల్కహాలు, లేదా 0.5 శాతం హైడ్రోజన్ పెరాక్సైడ్ బ్లీచ్ లేదా 0.1 శాతం సోడియం హైపోక్లోరైట్ ఉన్న ఇంట్లో వాడే బ్లీచింగ్ సాయంతో ఒక్క నిమిషంలో కరోనావైరస్ ఉన్న ఈ ఉపరితలాలను క్రిమిరహితం చేయవచ్చని ఈ పరిశోధనలు చెబుతున్నాయి. అధిక ఉష్ణోగ్రతలు, తేమ కూడా కరోనావైరస్‌ను త్వరగా చంపేస్తుంది. అయితే, సార్స్ వ్యాధి వచ్చేలా చేసే ఒక కరోనావైరస్‌ను 56 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత (స్నానం చేయగలిగే వేణ్ణీళ్ల కంటే ఎక్కువ వేడి) దగ్గర ప్రతి 15 నిమిషాలకూ 10 వేల వైరల్ కణాలను చంపవచ్చని ఒక అధ్యయనం చెబుతోంది.

Image copyright getty images
చిత్రం శీర్షిక వైరస్ ఎంతకాలం బతుకుతుంది

ఉష్ణోగ్రత, తేమలో మార్పుల ప్రభావం

అమెరికా ఎన్విరాన్‌మెంటల్ ప్రొటెక్షన్ ఏజెన్సీ(ఈపీఏ) ఇప్పుడు సార్స్- CoV-2 వైరస్‌కు వ్యతిరేకంగా ఉపయోగించగలిగే క్రిమిసంహారకాలు, పదార్థాల జాబితాను ప్రచురించింది.

వైరస్ ఉన్న వ్యక్తి దగ్గినపుడు బయటికి వచ్చే ఒక తుంపరలో ఎన్ని వైరస్ కణాలు ఉంటాయి అనేదానిపై ఎలాంటి గణాంకాలూ లేవు. ఫ్లూ వైరస్‌పై జరిగిన పరిశోధనల్లో ఒక చిన్న తుంపరలో కొన్ని వేల ఇన్‌ఫ్లూయెంజా వైరస్ కణాలు ఉంటాయని తేలింది.

అయితే, అది వైరస్‌ రకాన్ని బట్టి మారుతూ ఉంటుంది. అది శ్వాసనాళం లోపల కనిపించిందా, వైరస్ ఉన్న వ్యక్తి ఏ స్టేజిలో ఉన్నారు అనే దానిని బట్టి మారుతుంది.

ఏదేమైనా, రాగి ఉపరితలాలు వైరస్‌ను నాలుగు గంటల్లో చంపుతాయని పరిశోధకులు గనుగొన్నారు.

బట్టలు, ఇతర ఉపరితలాలను క్రిమిరహితం చేయడం కష్టం. ఈ కొత్త కరోనావైరస్ ఎంతకాలం బతుకుతుందో ఇంకా స్పష్టంగా తెలియడం లేదు. “కార్డుబోర్డులో సహజంగా పీల్చుకునే ఫైబర్లు.. ప్లాస్టిక్, మెటల్ మీద కంటే త్వరగా ఈ వైరస్‌‌ను ఎండిపోయేలా చేస్తాయి” అని ఎన్ఐహెచ్ అధ్యయానికి నేతృత్వం వహించిన రాకీ మౌంటెన్ లాబరేటరీస్ వైరస్ ఎకాలజీ హెడ్ విన్సెంట్ మున్‌స్టెర్ చెప్పారు.

“సన్నటి రంధ్రాలు ఉండే ఒక పదార్థంపై అది త్వరగా ఎండిపోయి, దానిలోని ఫైబర్లకు అతుక్కుపోవచ్చని మా అంచనా” అని ఆయన చెప్పారు.

ఉష్ణోగ్రతల్లో, తేమలో వచ్చే మార్పులు కూడా ఈ వైరస్ ఎంతకాలం బతుకుతుంది అనేదానిపై ప్రభావం చూపిస్తుంది. అంటే, గాలిలో వేలాడే తుంపర్లలా అవి ఎక్కువ బహిర్గతం అయినపుడు, తక్కువ స్థిరత్వంతో ఉంటాయని మనం వివరించవచ్చు. ఉష్ణోగ్రత, తేమ ప్రభావాలపై మరింత వివరంగా పరిశోధనలు చేసేందుకు మేం ప్రస్తుతం ప్రయోగాలు కొనసాగిస్తున్నామని ఆయన చెప్పారు.

మున్‌స్టర్ వివరణ ప్రకారం సుదీర్ఘ కాలంపాటు సజీవంగా ఉండే ఈ వైరస్ సామర్థ్యం... మన చేతులు, ఉపరితలాలను శుభ్రం చేయాల్సిన ప్రాధాన్యం గురించి నొక్కి చెబుతోంది.

“ఈ వైరస్‌కు రకరకాల మార్గాల ద్వారా ఇతరులకు సంక్రమించే సామర్థ్యం ఉంది” అని ఆయన చెబుతున్నారు.

మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.
Media captionవీడియో: కరోనావైరస్: మీ చేతుల్ని 20 సెకండ్లలో కడుక్కోవడం ఎలా?

కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు

కరోనావైరస్: భారత్‌లో గత 24 గంటల్లో 11 మంది మృతి.. ప్రతి నాలుగు రోజులకు రెట్టింపు అవుతున్న కేసులు

కరోనావైరస్‌: కోవిడ్-19తో మరణించిన ముస్లిం శవాన్ని దహనం చేయడంపై శ్రీలంకలో వివాదం

కరోనావైరస్: ఒకరిని ఒకరు తాకలేకపోతున్నామనే ఈ బాధ తీరేదెలా

కరోనావైరస్: యూరప్‌లోని వృద్ధాశ్రమాల్లో మృత్యు ఘోష, వందలాది మంది వృద్ధులు మృతి

కరోనా వైరస్‌: ఒక డాక్టర్ భార్యగా నేను తీసుకునే జాగ్రత్తలు ఏంటంటే..

కరోనావైరస్: తీవ్ర సంక్షోభం దిశగా పాకిస్తాన్.. ఈ కల్లోలాన్ని ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం తట్టుకోగలదా

కరోనావైరస్: ప్రభుత్వాలు అందిస్తున్న యాప్‌లు సురక్షితమేనా, రాబోయే రోజుల్లో వాటితో ప్రమాదం ఉందా

కరోనావైరస్: ఇండొనేసియాలో క్షణం క్షణం... భయం భయం

కరోనావైరస్: డాక్టర్ల మీద దాడులు... ఉమ్మి వేస్తూ అవమానాలు